2021 APRILIA SR 160 2021 APRILIA SR 125 LAUNCHED IN INDIA PRICES START AT RS 107595 MK GH
Aprilia SR 160: పియాజియో నుంచి అప్రిలియా ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125 స్కూటర్లు లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే!
Aprilia SR 160
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూవీలర్ సంస్థ పియాజియో ఇండియా ఒకేసారి రెండు స్కూటర్లను లాంచ్ చేసింది. భారతదేశంలో మార్కెట్‌ను విస్తరించడంలో భాగంగా సరికొత్త ఏప్రిలియా ఎస్ఆర్160, ఎస్ఆర్ 125 స్కూటర్లను ఆవిష్కరించింది.
భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూవీలర్ సంస్థ పియాజియో ఇండియా ఒకేసారి రెండు స్కూటర్లను లాంచ్ చేసింది. భారతదేశంలో మార్కెట్‌ను విస్తరించడంలో భాగంగా సరికొత్త ఏప్రిలియా ఎస్ఆర్160, ఎస్ఆర్ 125 స్కూటర్లను ఆవిష్కరించింది. అప్రిలియా ఎస్ఆర్ 125ని రూ. 1,07,595, అప్రిలియా ఎస్ఆర్160ని రూ. 1,17,494 (ఎక్స్-షోరూమ్, ఇండియా) వద్ద విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్లూ కాస్మెటిక్ డిజైన్‌తో వస్తాయి. వీటిలో బీఎస్ 6 ఎమిషన్ నిబంధనలను పాటిస్తూ వీటిలో మెరుగైన ఫీచర్లను అందించారు. విజువల్ అప్పీల్‌ను మరింత మెరుగుపర్చేందుకు మోటో జీపీ రేస్ గ్రాఫిక్‌లతో పాటు కొత్త కలర్ స్కీమ్‌లను అందించింది. ఈ రెండు స్కూటర్లను భారతదేశం అంతటా కంపెనీ డీలర్షిప్ సెంటర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా రూ. 5,000 టోకెన్ ఫీజు చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు.
కొత్త ఎస్ఆర్ 160 శ్రేణి వైట్, బ్లూ, గ్రే, రెడ్, మ్యాట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త స్కూటర్లపై పియాజియో ఇండియా చైర్మన్, ఎండీ డియెగో గ్రాఫీ మాట్లాడుతూ.. “కొత్త అప్రిలియా ఎస్ఆర్ సిరీస్‌ను విస్తరించడం పట్ల చాలా ఆనందంగా ఉంది. ఎస్ఆర్ స్కూటర్లలో పెద్ద చక్రాలతో కూడిన వినూత్న డిజైన్‌ను అందించాం. ఇది వినియోగదారులకు వినూత్న అనుభవాన్ని ఇస్తుంది.” అని అన్నారు.
అప్రిలియా ఎస్ఆర్ 160, అప్రిలియా ఎస్ఆర్ 125 డిజైన్
2021 అప్రిలియా SR 125, అప్రిలియా SR 160 రెండు స్లూటర్లను అద్భుతమైన డిజైన్‌తో రూపొందించింది. ఈ రెండూ ఫ్లాగ్షిప్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ రెండు స్కూటర్లను అప్రిలియా RSV4 ప్రేరణతో వీటిని డిజైన్ చేసింది. వీటిలో RS-GP ప్రేరణ పొందిన గ్రాఫిక్స్, ఎల్ఈడీ హెడ్లైట్లు, పొజిషన్ లైట్లు, పూర్తి-డిజిటల్ మల్టీఫంక్షనల్ క్లస్టర్, డ్యూయల్ సీట్లు, నకిల్ గార్డ్లు, బ్యాక్ గ్రాబ్, కార్బన్ టెక్చర్ కాంపోనెంట్స్, ముందు భాగంలో 220 ఎంఎం హైడ్రాలిక్ డ్యూయల్ వంటివి అందించింది. ఏబీఎస్‌తో పాటు కాలిపర్ డిస్క్ బ్రేక్, 14 -అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కూడిన విస్తృత ట్యూబ్‌లెస్ టైర్లను చేర్చింది.
2021 అప్రిలియా SR 125లో బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన 124.45cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను చేర్చింది. 6000 ఆర్పీఎమ్ వద్ద 9.92bhp, 9.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించింది. 2021 అప్రిలియా SR 160లో 160 సీసీ 3-వాల్వ్ ఇంజన్‌ను చేర్చింది. ఈ ఇంజిన్ 7600 ఆర్పీఎమ్ వద్ద 11 బీహెచ్పీ, 11.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.