TVS Apache RTR 200 4V: టీవీఎస్ నుంచి కొత్త అపాచీ ప్రీమియం బైక్ విడుదల

TVS Apache RTR 200 4V | దీపావళికి కొత్త బైక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. టీవీఎస్ నుంచి కొత్త అపాచీ ప్రీమియం బైక్ రిలీజ్ అయింది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: November 5, 2020, 2:46 PM IST
TVS Apache RTR 200 4V: టీవీఎస్ నుంచి కొత్త అపాచీ ప్రీమియం బైక్ విడుదల
TVS Apache RTR 200 4V: టీవీఎస్ నుంచి కొత్త అపాచీ ప్రీమియం బైక్ విడుదల (image: TVS Motor Company)
  • Share this:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్‌కి చెందిన అపాచీ ఆర్టీఆర్ సిరీస్ బైక్లు ఇటీవలే నాలుగు మిలియన్ల అమ్మాకాల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. ఈ మైలురాయిని చేరకున్న సందర్భంలో బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా, కొత్త ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన కొత్త అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ను లాంచ్ చేసింది. దీని ధరను1.31 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ప్రయాణిస్తున్న సమయంలొనే మూడు మోడ్‌లలో మారడానికి ఉపయోగపడేలా దీనిలో ప్రత్యేక రైడ్ మోడ్ స్విచ్‌ను పొందుపర్చింది. స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్లలో భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిలో ఎడ్జెస్టెబుల్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కూడా చేర్చింది.

సరికొత్త ఫీచర్స్‌తో Hyundai i20 వచ్చేసింది... ధర ఎంతో తెలుసా

Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ, డేటాతో Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవేఅంతేకాక, ఇది ప్రీమియం షోవా సస్పెన్షన్ సెటప్తో వస్తుంది. ఈ ప్రీమియం బైక్లో ఎల్ఈడీ టెక్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ఛానల్ సింగిల్ ఛానల్ ఏబీఎస్, హై పర్ఫార్మెన్స్ రియల్ రేడియల్ టైర్లు, రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ ఎనేబుల్డ్ టివిఎస్ స్మార్ట్ఎక్స్ కనెక్ట్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ వంటి అట్రాక్టివ్ ఫీచర్లను జోడించింది. వీటితో పాటు ఎడ్జెస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ లివర్ ఫీచర్ను కూడా అప్డేట్ చేయబడింది. ప్రామాణిక బ్లూటూత్ కనెక్టివిటీతో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వచ్చే ఈ బైక్ ప్రీమియం లుక్ను అందిస్తుంది. దీనిలో197.75 సిసి సింగిల్ సిలిండర్, ఆర్టి-ఫై టెక్నాలజీతో ఆయిల్-కూల్డ్ ఇంజన్ను అమర్చారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 20.5 పిఎస్ మ్యగ్జిమం పవర్ని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.8 ఎన్ఎమ్ టార్క్ను అందిస్తుంది.

ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ పొందొచ్చు... LIC Jeevan Labh policy ప్రత్యేకత ఇదే

Gold Loan: ఈ విషయాలు తెలుసుకోకుండా గోల్డ్ లోన్ తీసుకుంటే నష్టపోతారు

మాట్టే బ్లూ కలర్‌తో అట్రాక్టివ్ లుక్..


నూతన అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్ విడులపై టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెటింగ్ హెడ్ మేఘశ్యామ్ దిఘోల్ మాట్లాడుతూ " 2005లో ప్రారంభమైన అపాచీ సిరీస్ కస్టమర్లకు, రేసింగ్ ప్రియులకు సరికొత్త టెక్నాలజీని అందించాలనే ఉద్దేశ్యంతో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4 వి బైక్ను రూపొందించాం. ఇటీవలే అపాచీ సిరీస్ ప్రీమియం బైక్ సెగ్మెంట్ నాలుగు మిలియన్ల అమ్మకాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఈ సరికొత్త ప్రీమియం బైక్తో ముందుకొచ్చాం." అని అన్నారు. అయితే, ఈ ప్రీమియం బైక్ సరికొత్త మాట్టే బ్లూ కలర్ స్కీమ్‌లో ప్రవేశపెట్టబడింది. కాగా, కొత్త అపాచీ ఆర్టీఆర్ 200 4 వి బుకింగ్స్ సంస్థ అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ఇప్పటికే ప్రారంభమవ్వగా రాబోయే కొద్ది వారాల్లోనే డెలివరీలు ప్రారంభంకానున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: November 5, 2020, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading