ITR: 2017-18 ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? మార్చి 31 డెడ్‌లైన్

Income Tax Returns | ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత రూ.10,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు... విచారణ ఎదురుకోవాల్సి ఉంటుంది.


Updated: March 26, 2019, 1:24 PM IST
ITR: 2017-18 ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? మార్చి 31 డెడ్‌లైన్
ITR: 2017-18 ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా? మార్చి 31 డెడ్‌లైన్

Updated: March 26, 2019, 1:24 PM IST
మీరు 2017-18 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా? మీకు చివరి అవకాశం మిగిలే ఉంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ ఉంటుంది. కానీ... చాలామంది పలు కారణాలతో రిటర్న్స్ ఫైల్ చేయరు. 2017-18 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ అంటే 2018-19 అసెస్‌మెంట్ ఇయర్‌గా పరిగణిస్తారు. మీరు కూడా ఇప్పటికీ 2017-18 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే మార్చి 31 వరకు అవకాశముంది. అంతలోపు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత రూ.10,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు... విచారణ ఎదురుకోవాల్సి ఉంటుంది. హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వ్యక్తులకు రూ.2.5 లక్షలు, వృద్ధులకు రూ.3 లక్షలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల వరకు మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఇలా ఫైల్ చేయొచ్చు


మీరు ఆదాయపు పన్ను శాఖకు చెందిన www.incometaxindiaefiling.gov.in ఇ-పైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. మీకు సంబంధించిన రిటర్న్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. లేదా ఆన్‌లైన్‌లో ఫైల్ చేయొచ్చు. ఇ-ఫైలింగ్‌లో అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్(EVC) లేదా ఆధార్ ఓటీపీ లేదా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ తప్పనిసరి. మీ ఐటీఆర్ ఫైలింగ్ పూర్తైన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:



IRCTC New Rule: ఇక 4 గంటల ముందు రైలు ఎక్కే స్టేషన్ మార్చుకోవచ్చుTRAI Deadline: ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 డెడ్‌లైన్

Twitter: ట్విట్టర్‌లో పాపులర్ సీఎం ఎవరో తెలుసా?

జనవరిలో 6.9 శాతం తగ్గిన ఉద్యోగాల కల్పన: ESIC డేటా
First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు