పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

Photo: PTI

పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఆల్‌టైమ్ హై ధరలతో ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్ ధరల పెరుగుదలపై రాజకీయ పార్టీలే కాదు... సామాన్యులు సైతం భగ్గుమంటున్నారు. పెరిగే ధరలు ఎలాగూ పెరుగుతూనే ఉంటాయి. మరి పెట్రోల్ ఆదా చేయడానికి గల మార్గాలేంటో తెలుసుకోండి.

 • Share this:
  మనం పొదుపు చేసే డబ్బు కూడా మన సంపాదనే అంటారు. ఈ మాట అన్ని విషయాల్లో వర్తిస్తుంది. పెట్రోల్‌కు కూడా. ఎందుకంటే... పెట్రోల్‌ను తక్కువగా వాడగలిగితే మళ్లీ మళ్లీ బంకు చుట్టూ తిరగక్కట్లేదు. నెలలో ఐదుసార్లు పెట్రోల్ పోయించుకునే అలవాటు ఉందనుకోండి. అదే మీరు పొదుపుగా వాడుకుంటే... నాలుగుసార్లు బంకుకు వెళ్తే చాలు. అంటే ఒకసారి డబ్బులు మిగిలినట్టే. మరి పెట్రోల్ ఆదా చేయడానికి ఈ 20 టిప్స్ ఫాలో అవండి.

  1. ఓవర్ స్పీడ్‌గా వెళ్తే మీ ప్రాణాలను రిస్క్‌లో పడెయ్యడమే కాదు... పెట్రోల్ కూడా అంతే స్థాయిలో ఖర్చయిపోతుంది. తక్కువ వేగంతో వెళ్లడం పెట్రోల్‌ని ఆదా చేస్తుంది.
  2. పదేపదే గేర్లు మారిస్తే మైలేజీ తగ్గిపోతుంది. అందుకే ఎక్కువ దూరం ఒకే గేర్‌పై వెళ్లేలా చూసుకోండి.
  3. ఎమిషన్ టెస్ట్ చేయించిన వాహనం 4 శాతం పెట్రోల్‌ని ఆదా చేస్తుంది.
  4. ఆక్సిజన్ సెన్సార్‌తో 40 శాతం మైలేజీ పెరుగుతుంది.
  5. టైర్లు మంచి కండీషన్‌తో ఉంటే పెట్రోల్ కూడా ఆదా అవుతుంది.
  6. ఓనర్స్ గైడ్‌లో సూచించిన గ్రేడ్ మోటార్ ఆయిల్ మాత్రమే వాడాలి.
  7. సరైన మోటార్ ఆయిల్ వాడకపోతే మీ పెట్రోల్ ఖర్చులు 2 శాతం పెరుగుతాయి.
  8. ఫ్యూయెల్ ఫిల్టర్స్, స్పార్క్ ప్లగ్స్, వీల్ అలైన్‌మెంట్, ఎమిషన్ సిస్టమ్ తరచూ పరిశీలిస్తుండాలి.
  9. ఉదయం వేళల్లోనే పెట్రోల్ ట్యాంకు నింపాలి.
  10. పూర్తిగా ఖాళీ కాక ముందే సగం ఖాళీ అయినప్పుడే ట్యాంకు నింపాలి.
  11. లోయెస్ట్ గేర్‌ కన్నా హయ్యెస్ట్ గేర్‌లోనే డ్రైవింగ్ చేయాలి.
  12. వాహనాన్ని తరచూ సర్వీసింగ్ చేయిస్తుండాలి.
  13. బ్రేక్స్, యాక్సిలేటర్‌ హార్డ్‌గా ఉపయోగించొద్దు.
  14. టైర్ ప్రెజర్ పరిశీలిస్తుండాలి.
  15. వేగం పెంచుతూ, తగ్గిస్తూ కాకుండా ఒకే స్పీడ్‌లో వాహనాన్ని నడపాలి.
  16. ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయంలో ప్రయాణించడం మంచిది.
  17. పెట్రోల్ లీకేజీ సమస్యలు ఉంటే రిపేర్ చేయించాలి.
  18. కార్ పూలింగ్, బైక్ పూలింగ్ సేవలు ఉపయోగించుకోవాలి.
  19. కిలోమీటర్ దూరంలోపు వెళ్లాలంటే వాహనం కన్నా నడవడం మంచిది.
  20. మీ స్నేహితులు వాహనం తీసుకెళ్తే పెట్రోల్ పోయించమని నిర్మొహమాటంగా చెప్పాలి.

  petrol price, diesel price, petrol saving tips పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, పెట్రోల్ సేవింగ్ టిప్స్, పెట్రోల్ ఆదాకు మార్గాలు
  (Image: Network18 Creative)


  ఇవి కూడా చదవండి:

  ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్

  బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!

  మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!

  ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న 'ఇన్విజిబుల్ ఛాలెంజ్'

  Video: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

  Video: ఆరోగ్యం కోసం 10 సూపర్‌ఫుడ్స్!
  Published by:Santhosh Kumar S
  First published: