హోమ్ /వార్తలు /బిజినెస్ /

Scrapping Vehicles: ఆ రూల్ దెబ్బకి తుక్కు తుక్కుగా మారనున్న 20 లక్షల వాహనాలు.. ఎక్కడంటే..

Scrapping Vehicles: ఆ రూల్ దెబ్బకి తుక్కు తుక్కుగా మారనున్న 20 లక్షల వాహనాలు.. ఎక్కడంటే..

Scrapping Vehicles: ఆ రూల్ దెబ్బకి తుక్కు తుక్కుగా మారనున్న 20 లక్షల వాహనాలు.. ఎక్కడంటే..

Scrapping Vehicles: ఆ రూల్ దెబ్బకి తుక్కు తుక్కుగా మారనున్న 20 లక్షల వాహనాలు.. ఎక్కడంటే..

Scrapping Vehicles: కొత్త నిబంధనల ప్రకారం.. భారతదేశంలోని ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు ఏ రాష్ట్రంలోనైనా నమోదు చేసుకున్న వాహనాలను అంగీకరించవచ్చు, స్క్రాప్ కిందకు మార్చవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఏవైనా వాహనాలు (Vehicles) రోడ్లపైకి వచ్చిన నిర్ణీత వ్యవధి తర్వాత వాటిని స్క్రాప్‌గా మార్చాలని మోటార్ వాహన చట్టం రూల్స్ చెబుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల మోటారు వాహనాల (రిజిస్ట్రేషన్, ఫంక్షన్స్‌ ఆఫ్‌ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ) సవరణ నియమాలు, 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 20 సంవత్సరాల కంటే పాతవైన ప్రైవేట్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాతవైన కమర్షియల్‌ వాహనాలను స్క్రాప్‌ కిందకు మార్చవచ్చని పేర్కొంది. ఈ రూల్స్ ప్రకారం ఇప్పుడు మహారాష్ట్ర (Maharashtra)లో ఏకంగా 20 లక్షలకు పైగా వాహనాలు స్క్రాప్‌ (Scrap)గా మారనున్నాయి.

తాజా నిబంధనల ప్రకారం.. పాత వాహనాలను స్క్రాప్ కింద మార్చడానికి అవసరమైన ప్రక్రియను డిజిటలైజ్‌ చేశారు. వాహన యజమానులు స్క్రాపింగ్‌ కేంద్రాల(Scrapping Centres)లో సులువుగా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఏ రాష్ట్రంలో రిజిస్టర్‌ అయిన వాహనాలను అయినా సరే దేశవ్యాప్తంగా ఉన్న స్క్రాప్‌ కేంద్రాలు అంగీకరించవచ్చు. ఇది వాహన యజమానులకు వాలంటరీ ఎక్సర్‌సైజ్‌ అని తెలిపింది. ప్రస్తుతం ప్రాసెస్‌ను డిజిటలైజ్ చేసినందున సైంటిఫిక్‌ విధానంలో రాష్ట్రంలో 20 లక్షల వాహనాలను వెంటనే స్క్రాప్‌ కిందకు మార్చవచ్చని మహారాష్ట్ర రవాణా కమిషనర్ అవినాష్ ధాక్నే తెలిపారు.

* పది సంవత్సరాల పాటు డాక్యుమెంట్ల స్టోరేజీ

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో..‘స్క్రాపింగ్ సెంటర్లు డిజిటల్ స్కాన్ చేసిన అన్ని డాక్యుమెంట్ల కాపీలను రికార్డు కోసం 10 సంవత్సరాల పాటు నిర్వహిస్తాయి. స్టాండర్డ్‌ కంటైనర్స్‌ నుంచి ఇంధనం, చమురు, యాంటీ-ఫ్రీజ్, ఇతర వాయువులు, లిక్విడ్స్‌ పూర్తిగా ఖాళీ చేసినట్లు ధ్రువీకరించుకునే వరకు వాహనాలు స్క్రాప్ చేయరు.’ అని తెలిపింది.

వాహన్ పోర్టల్‌లో ప్రక్రియ పూర్తి డిజిటలైజేషన్ చేయడం, ఆథరైజ్డ్‌ స్క్రాపింగ్ కేంద్రాలు మొత్తం పేపర్‌వర్క్‌ను చూసుకోవడంతో, వాహన స్క్రాపేజ్‌ను ఎంచుకునే సమయంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురుకావు. వాహనం స్క్రాపింగ్ గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. డిజిటలైజేషన్‌ ప్రక్రియ సులువుగా ఉందని తెలిపారు. అంతకుముందు స్క్రాపింగ్‌కు సంబంధించిన అన్ని RTO ఫార్మాలిటీలను స్వయంగా తామే పూర్త చేసుకోవాల్సి వచ్చేదని వివరించారు.

* ఎక్కడైనా సంప్రదించవచ్చు

కొత్త నిబంధనల ప్రకారం.. భారతదేశంలోని ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలు ఏ రాష్ట్రంలోనైనా నమోదు చేసుకున్న వాహనాలను అంగీకరించవచ్చు, స్క్రాప్ కిందకు మార్చవచ్చు. వాహనం రిజిస్టర్ అయిన ప్రాంతంతో సంబంధం లేకుండా మొత్తం ప్రక్రియ మొత్తం భారతదేశం ప్రాతిపదికన రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన వాహన్ పోర్టల్‌ ద్వారా జరుగుతుంది. వాహన యజమానులు ఆన్‌లైన్‌లో వాహన్ పోర్టల్‌ని సందర్శించి స్క్రాపింగ్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : ఫెస్టివల్ సీజన్‌లో ఇండియాలో రిలీజ్ అవుతున్న కార్లు ఇవే.. ధరలు, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి...

* స్క్రాపేజ్ విధానం అంటే ఏంటి?

పాత, ఫిట్‌నెస్ లేని వాహనాలను తొలగించి, వాటి స్థానంలో రోడ్లపై ఆధునిక, కొత్త వాహనాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వ నిధులతో కూడిన కార్యక్రమం. ఈ విధానాన్ని 2021-2022 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇటీవల దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రజలు తమ పాత వాహనాలను స్క్రాప్ చేయడం ఆటో కంపెనీల ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.

కొత్త కొనుగోళ్లపై వినియోగదారులు ఆయా సంస్థల నుంచి డిస్కౌంట్లు పొందవచ్చు. ట్రక్కులు లేదా బస్సుల వంటి పెద్ద వాహనాలకు రూ.50,000- రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్‌ ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు. చిన్న వాహనాలకు కూడా డిస్కౌంట్‌ ఇస్తే, వాహనాలను స్క్రాప్ చేయడానికి ఇది ప్రోత్సాహకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Maharashtra, New motor vehicle act, Vehicles

ఉత్తమ కథలు