హోమ్ /వార్తలు /బిజినెస్ /

Flats At 18 Lakhs: కొత్త ఇల్లు కోసం అన్వేషణ...అయితే ఇక్కడ ఫ్లాట్స్ చూస్తే ఎగిరి గంతేస్తారు

Flats At 18 Lakhs: కొత్త ఇల్లు కోసం అన్వేషణ...అయితే ఇక్కడ ఫ్లాట్స్ చూస్తే ఎగిరి గంతేస్తారు

రెసిడెన్షియల్ ప్లాట్ (మున్సిపాలిటీ) 109 చదరపు గజాల లోపు ఉండొచ్చు. అదే నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 209 చదరపు గజాల్లోపు ఉండొచ్చు. అలాంటి అగ్రవర్ణ పేద ప్రజలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

రెసిడెన్షియల్ ప్లాట్ (మున్సిపాలిటీ) 109 చదరపు గజాల లోపు ఉండొచ్చు. అదే నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 209 చదరపు గజాల్లోపు ఉండొచ్చు. అలాంటి అగ్రవర్ణ పేద ప్రజలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

మిగితా ప్రాంతాలతో పోల్చితే కాస్త తక్కువ ధరకే ఉన్నాయి. దీంతో పేద మధ్య తరగతి వర్గాలు కొనుగోలు చేసేలా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 2BHK ప్లాట్ ధరలు 18 లక్షలకే ప్రారంభం అవుతున్నాయి. 3BHK లగ్జరీ ఫ్లాట్స్ సైతం రూ.35 లక్షలకే లభిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

హైదరాబాద్‌ నగరంలో దక్షిణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ జోరుమీదుంది. ఇంత కాలం ఇక్కడ ఊరిస్తూ వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కార్యకూపం దాల్చడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా మెట్రో రైలు మార్గం విస్తరణ, ఐటీ కంపెనీల ఏర్పాటు ఇందుకు ప్రధాన కారణం. రంగారెడ్డి కలెక్టరేట్‌ ఏర్పాటు కారణంగా ఆదిభట్ల ప్రాంతం ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోనే టాక్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ గా నిలిచింది. ఇక్కడ ఏర్పాటవుతున్న ఐటీ, ఏరోనాటికల్‌ కంపెనీలు ఇందుకు కారణం అని చెప్పాలి. ఇప్పటికే ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, అపార్ట్ మెంట్లు సామాన్య, మధ్య తరగతి వర్గాలూ ఈ ప్రాంతంలో సొంతింటి కలను నెరవేర్చేలా ఉన్నాయి. ఇంతకాలం నగరంలోని కేవలం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట లాంటి పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన రియల్టీ జోరు, ఇప్పుడు ఆదిభట్ల, బొంగులూరు లాంటి దక్షిణ ప్రాంతంలోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం నలుమూలలా విస్తరిస్తోంది. నగరానికి నలుదిక్కుల్లో ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ అభివృద్ధి అనేది ఆకాశమే హద్దుగా జరుగుతోంది. హైదరాబాద్‌ దక్షిణ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌, ఆదిభట్ల, బెంగళూరు హైవే, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ హైవే.. ఇలా నగర దక్షిణ ప్రాంతాల్లో రియల్టీ బూమ్‌ కనిపిస్తోంది.

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసిన ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం కేంద్రంగా పలు అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయి. దాదాపు 5,000 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న విమానాశ్రయంలో కొత్తగా ఎయిర్‌పోర్టు సిటీ, బిజినెస్‌ పార్కులు ఏర్పాటవుతున్నాయి. ఇక ఎయిర్ పోర్టుకు అనుబంధంగా ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పుంజుకుంది.

లొకేషన్ అడ్వాంటేజ్ ఇదే...

బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులకు తోడు నాగార్జునసాగర్‌, శ్రీశైలం రహదారులను కూడా జాతీయ రహదారులుగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాంతానికి ఏ సమయంలోనైనా చేరుకోవచ్చన్న భరోసా ఏర్పడింది.

త్వరలోనే మెట్రో...

అతి త్వరలో శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది కార్యరూపం దాలిస్తే, ప్రస్తుతం గచ్చిబౌలి ఐటీ కారిడార్‌కు ఉన్న డిమాండ్‌ ఇటువైపు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆదిభట్ల ప్రస్తుతం స్థిరాస్తి పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా మారింది. గచ్చిబౌలి, మాదాపూర్‌ ఐటీ కారిడార్ల తర్వాత ఆదిభట్ల ప్రాంతం భవిష్యత్‌ ఐటీ కారిడార్‌గా ఎదుగుతోంది. ఐటీకి తోడు ఏరోనాటికల్‌ కంపెనీలకు ఈ పాంతం కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే టీసీఎస్‌ ఆదిభట్లలో కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రతిపాదిత ఫార్మా సిటీ కూడా హైదరాబాద్‌ దక్షిణ ప్రాంత రియల్టీ రంగానికి ఊతం ఇస్తోంది. సుమారు 18.000 నుంచి 20,000 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తలపెట్టింది.

నగరంలోనే అతి తక్కువ ధరలో 18 లక్షలకే ఫ్లాట్.


ఆదిభట్ల ప్రాంతంలో ఇప్పుడిప్పుడే అపార్ట్ మెంట్ కల్చర్ వేళ్లూనుకుంటోంది. ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లాట్స్ మిగితా ప్రాంతాలతో పోల్చితే కాస్త తక్కువ ధరకే ఉన్నాయి. దీంతో పేద మధ్య తరగతి వర్గాలు కొనుగోలు చేసేలా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 2BHK ప్లాట్ ధరలు 18 లక్షలకే ప్రారంభం అవుతున్నాయి. 3BHK లగ్జరీ ఫ్లాట్స్ సైతం రూ.35 లక్షలకే లభిస్తున్నాయి. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో వస్తున్న అనేక ఐటీ, ఫార్మా ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో ఈ ఫ్లాట్స్ ధరలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యే అవకాశం ఉంది. నగరంలోని ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా వెలుస్తున్న ఆది భట్ల ప్రాంతంలో భవిష్యత్తులో ఐటీ కారిడార్ గా వెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ పలు కాలేజీలు, అలాగే స్కూల్స్ వెలిశాయి.  అలాగే అతిత్వరలోనే కొంగరకలాన్ ప్రాంతంలో ప్రతిష్టాత్మక Indo UK Hospital వంద ఎకరాల్లో వెయ్యి పడకలతో ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు సర్వసిద్ధంగా తయారు కానుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.

First published:

Tags: Real estate, Real estate in Hyderabad

ఉత్తమ కథలు