Senior Citizens: ద్రవ్యోల్బణం ప్రభావాన్ని నియంత్రించేందుకు ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మరోసారి పాలసీ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు ఇప్పుడు 6.25 శాతానికి పెరిగింది. 2018 ఆగస్ట్ నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం 2023లో ఇప్పటివరకు రెపో రేటు 225 బేసిస్ పాయింట్లు పెరిగింది. బ్యాంకులు బహుశా వివిధ రకాల రుణాలు, డిపాజిట్ ప్రొడక్టులపై వడ్డీ రేట్లను(Intrest rates) పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హోమ్ లోన్లు, ఇతర రుణాలు భారీగా పెరిగాయి. ఆయా బ్యాంకుల వినియోగదారులపై లోన్ ఈఎంఐల భారం పెరగనుంది. DICGC ఇన్సూర్డ్ అయిన రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ద్రవ్యోల్బణ ఆర్థిక వ్యవస్థలో ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 9 శాతం కంటే ఎక్కువ వడ్డీరేట్లను అందిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Suryoday Small Finance Bank)
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగి 226 బేసిస్ పాయింట్లకు చేరుకుంది. తమ అధికారిక వెబ్సైట్లో.. డిసెంబర్ 6 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లో సాధారణ ప్రజల కంటే ఎక్కువ రాబడి పొందుతారని తెలిపింది. సాధారణ ప్రజలు రూ.2 కోట్లలోపు చేసిన ఎఫ్డీలపై గరిష్ఠంగా 9.01 శాతం వడ్డీనే పొందుతారని, సీనియర్ సిటిజన్లు గరిష్ఠంగా 9.26 శాతం రాబడిని సంపాదిస్తారని వివరించింది. అదనంగా బ్యాంక్ 15 లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్‌పై సాధారణ ప్రజలు 9.01%, సీనియర్ సిటిజన్లకు 9.26% వడ్డీరేటును బ్యాంక్ అందిస్తోంది. అదే విధంగా 999 రోజుల టెన్యూర్‌కి చేసిన ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లు 8.76 వడ్డీని పొందవచ్చు.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(Unity Small Finance Bank)
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిపాజిట్ వడ్డీ రేట్లను 2022 నవంబర్ 21 నుంచి సవరించబడింది. బ్యాంక్ ప్రత్యేకంగా 181 రోజులు, 501 రోజులకు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు వరుసగా 8.50 శాతం, వృద్ధులకు 9.00 శాతం గరిష్ట వడ్డీ రేటును ఇస్తోంది. అదే విధంగా 2 నుంచి 3 సంవత్సరాలు, 3 నుంచి 5 సంవత్సరాల టెన్యూర్‌కి చేసిన ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లు 8.15 వడ్డీని అందుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fixed deposits