CNBC-TV18 IBLA 2020: అంగరంగ వైభవంగా ఐబీఎల్ఎ అవార్డులు - విజేతలు వీరే...

వ్యాపార జగతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన CNBC-TV18 IBLA 2020 అవార్డులను ఈ ఏడాది కూడా అందించింది.

news18-telugu
Updated: February 28, 2020, 8:12 PM IST
CNBC-TV18 IBLA 2020: అంగరంగ వైభవంగా ఐబీఎల్ఎ అవార్డులు - విజేతలు వీరే...
CNBC-TV18 IBLA 2020: అంగరంగ వైభవంగా ఐబీఎల్ఎ అవార్డులు - విజేతలు వీరే...
  • Share this:
దేశీయ పారిశ్రామిక వ్యాపార రంగంలో అత్యున్నత పురస్కారాలను అందించే ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్ (CNBC-TV18 IBLA 2020) కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. వ్యాపార జగతిలో తమ కృషితో, మేధస్సుతో, నాయకత్వ పటిమతో ఎందరికో ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారిని ఒక వేదికపై తెచ్చే బృహత్ కార్యక్రమాన్ని గడిచిన పది సంవత్సరాలుగా సీఎన్‌బీసీ - టీవీ18 నిర్వహిస్తోంది. వ్యాపార జగతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన CNBC-TV18 IBLA 2020 అవార్డులను ఈ ఏడాది కూడా అందించింది. 2020 సంవత్సరానికి గానూ సీఎన్‌బీసీ - టీవీ18 ఇండియా బిజినెస్ లీడర్ షిప్ అవార్డుల మహోత్సవానికి ముంబై వేదికయ్యింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

CNBC-TV18 IBLA 2020 వివిధ విభాగాల్లో విజేతలు వీరే..

యంగ్ టర్క్ ఆఫ్ ది ఇయర్ - గజల్ కల్రా, కో ఫౌండర్, రివిగో

యాంగ్ టర్క్స్ స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ - విదిత్ ఆత్రే, ఫౌండర్ అండ్ సీఈవో, మీషో


మోస్ట్ ప్రామిసింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ - వినతి సరఫ్ ముత్రెజా, ఎండీ అండ్ సీఈవో, వినతి ఆర్గానిక్స్
ది డిస్ట్రప్టర్స్ - దిలీప్ ఆస్బే ఎండీ, యూపీఐ
జ్యూరీ ప్రత్యేక రికమండేషన్ ( ది డిస్ట్రప్టర్స్) - నైకా డాట్ కామ్, ఫాల్గుణి నయ్యర్, ఫౌండర్, సీఈవోబ్రాండ్ కాంపెయిన్ ఆప్ ది ఇయర్ - ఫెవికాల్: మధుకర్ పారెఖ్, చైర్మన్ పిడిలైట్ ఇండస్ట్రీస్, మరియు పీయూష్ పాండే, సీసీవో వరల్డ్ వైడ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇండియా, ఓగిల్వీ
ఔట్ స్టాండింగ్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ - రాజేష్ గోపీనాథన్, ఎండీ, సీఈవో, టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్
ఔట్ స్టాండింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ - ఆదిత్య పురి, ఎండీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్
స్టేట్ ఆఫ్ ది ఇయర్ - మహారాష్ట్ర, సీఎం ఉద్ధవ్ థాక్రే
గ్లోబల్ ఇండియన్ బిజినెస్ ఐకాన్ - సత్య నాదెళ్ల
ఐకానిక్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది డికేడ్ - పుల్లెల గోపీచంద్
ఐకానిక్ ఎంటర్ టైన్ మెంట్ లీడర్ ఆఫ్ ది డికేడ్ - కరణ్ జోహార్
ఐకానిక్ కంపెనీ ఆఫ్ ది డికేడ్ - టాటా కన్సెల్టెన్సీ - రాజేష్ గోపీనాథన్, ఎండీ సీఈవో
ఐకానిక్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ - ముఖేష్ అంబానీ, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
లైఫ్ ఎచీవ్ మెంట్ అవార్డ్ - దీపక్ పారేఖ్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్



First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading