హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ 14వ విడత నిధుల విడుదల ఎప్పుడు..? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ 14వ విడత నిధుల విడుదల ఎప్పుడు..? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ 14వ విడత నిధుల విడుదల ఎప్పుడు..? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ 14వ విడత నిధుల విడుదల ఎప్పుడు..? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan: పీఎం కిసాన్ పథకం 13వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు ఇప్పుడు తదుపరి విడత ఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

రైతులకు పంట పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరువేల రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన’ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రూ.2వేల చొప్పున నిధులకు కేంద్రం రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తోంది. పీఎం కిసాన్ పథకం 13వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు ఇప్పుడు తదుపరి విడత ఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

పీఎం కిసాన్ 14వ విడత నిధుల విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే 2023 ఏప్రిల్ నుంచి జులై మధ్య తర్వాతి విడత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) యోజన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

* PM కిసాన్ స్కీమ్ బెనిఫిషరీ స్టేటస్ చెక్ చేసే ప్రాసెస్

పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన మొత్తం వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకంలో రైతులకు అందే నిధుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.

స్టెప్- 1

ముందు పీఎం కిసాన్ వెబ్‌సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయండి.

స్టెప్- 2

హోమ్ పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' విభాగంలో 'బెనిఫిషియరీ స్టేటస్' ఆప్షన్ సెలక్ట్ చేయండి.

స్టెప్- 3

ఇక్కడ అడిగిన వివరాల్లో రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

స్టెప్- 4

తర్వాత 'గెట్ డేటా' ట్యాబ్‌పై క్లిక్ చేయండి. దీంతో రైతుల పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది.

* PM- KISAN పథకం గురించి..

పీఎం కిసాన్ యోజన అనేది వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే రైతులకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన పథకం. భూమి ఉన్న రైతుల కుటుంబాలు, వారి పేర్లపై సాగు చేయదగిన భూమిని కలిగి ఉన్నవారు పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందడానికి అర్హులు. ఇటీవల హోలీకి ముందు పీఎం కిసాన్ 13 విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

ఇది కూడా చదవండి : బ్రహ్మోస్ నుంచి ALH MK-III వరకు.. రూ.70వేల కోట్లకు రక్షణ శాఖ ఆర్డర్లు.. HALతో ఒప్పందం

పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.6వేలు వేస్తుండగా.. ఈ మొత్తాన్ని కేంద్రం రూ.8వేలకు పెంచనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం వెలువడనుందని పుకార్లు వినిపించాయి. అయితే వీటిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కొట్టిపారేశారు. పీఎం కిసాన్ సాయం మొత్తాన్ని పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని పార్లమెంటులో చెప్పారు.

First published:

Tags: Farmers, Personal Finance, PM KISAN, PM Kisan Scheme

ఉత్తమ కథలు