హోమ్ /వార్తలు /బిజినెస్ /

Success Story: 13 ఏళ్ల వయసులో సబ్బుల వ్యాపారం.. కోట్లు సంపాదిస్తున్న టీనేజ్ గర్ల్

Success Story: 13 ఏళ్ల వయసులో సబ్బుల వ్యాపారం.. కోట్లు సంపాదిస్తున్న టీనేజ్ గర్ల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాకు చెందిన ఓ అమ్మాయి 13 ఏళ్ల వయసులోనే సబ్బుల వ్యాపారం ప్రారంభించి.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది. సొంత డబ్బులతో ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కొని.. నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

డబ్బు సంపాదిచండం ఎలా? అందరూ దీని గురించే ఆలోచిస్తారు. డబ్బు సంపాదించడం (Money Earning) చాలా కష్టమని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే... డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కానీ అందుకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. అప్పుడే డబ్బు చాలా సులభంగా మీ చేతుల్లోకి వస్తుంది. కొంత మంది జీవితాంతం ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. కానీ ఆర్థికంగా నిలుదొక్కుకోలేరు. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. నెలనెలా స్థిరమైన ఆదాయం పొందతూ బతుకు బండిని నెట్టుకొస్తుంటారు. కానీ ఇంకొంత మంది ఉంటారు. వారు చిన్న వయసులోనే రిస్క్ చేస్తుంటారు. కొత్తగా ప్రయత్నించి సక్సెస్ అవుతుంటారు. ఎవరూ ఊహించనంతగా విజయంతమై.. బాగా డబ్బులు సంపాదిస్తుంటారు. టీనేజీ వయసులోనే కోటీశ్వరులవుతుంటారు. అమెరికాకు చెందిన ఓ అమ్మాయి కూడా ఇదే కోవలోకి వస్తుంది. కేవలం 13 ఏళ్ల వయసులోనే సబ్బుల తయారీ వ్యాపారం (Soap Making Business) ప్రారంభించి.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది.

ది సన్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం... అమెరికాకు చెందిన లిల్లీ అనే యువతి వయసు 18 ఏళ్లు. ఈ ఏజ్‌లో చాలా మంది కాలేజీలో చదువుకుంటారు. కానీ లిల్లీ అలా కాదు. ఈమె ఓ వ్యాపారవేత్త. ఇంత చిన్న వయసులోనే మిలియనీర్‌గా మారిన లిల్లీ.. ఇటీవలే తన సొంత డబ్బుతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. లిల్లీ కేవలం 13 సంవత్సరాల వయస్సులో సబ్బుల వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచింది. లిల్లీ ఓ లగ్జరీ సోప్ కంపెనీని ప్రారంభించింది. దానితో పాటు హ్యాండ్ మేడ్ సోప్ క్లబ్ పేరుతో మెంబర్‌షిప్ క్లబ్‌ను నిర్వహిస్తోంది.

జీవితంలో ముందుకు సాగేందుకు.. తన తండ్రి ఎప్పుడూ భుజం తట్టి ప్రోత్సహిస్తారని లిల్లీ పేర్కొంది. ఆమె కెమిస్ట్. రసాయన శాస్త్రంపై ఎంతో పట్టుంది. కానీ మ్యాథ్స్‌లో మాత్రం కాస్త వీక్. ఐతే ఈ విషయంలో లిల్లీకి ఆమె తండ్రి ఎన్నో విధాలుగా సలహాలు సూచనలు ఇచ్చేవారు. నిజ జీవితంలో సైన్స్ , మ్యాథ్స్‌ని ఉపయోగిచాలని దిశానిర్దేశం చేశారు. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో వ్యాపారంలో మెలకువలు తెలుసుకుంది. అనంతరం సొంతంగా సబ్బు తయారీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది లిల్లీ. దానితో పాటు ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఆ వెబ్‌సైట్ ద్వారా సబ్బు వ్యాపారాన్ని విస్తరించింది. ఇందుకు ఆమె స్కూల్ టీచర్లు సహకరించారు. తమ వంతు సాయం చేశారు. ఇలా తక్కువ సమయంలోనే లిల్లీ సబ్బుల వ్యాపారం ఊపందుకుంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్తలో ఒకరిగా లిల్లీ నిలిచింది.


తమ సోప్ కంపెనీ ఊహించిన దాని కంటే.. ఎక్కువ విజయం సాధించిందని లిల్లీ తెలిపింది. కంపెనీ ఏర్పాటులో పూర్తి క్రెడిట్..  తన తల్లిదండ్రులకే దక్కుతుందని పేర్కొంది. వారు ప్రోత్సహించడం వల్లే ఇది సాధ్యమయిందని చెబుతోంది.  కొత్త కారు కొన్నప్పుడు అది తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని వెల్లడించింది. సంస్థను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెబుతోంది. ప్రస్తుతం లిల్లీ వయసు తక్కువే. 18 ఏళ్ల వయసులో అందరూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే.. ఈమె మాత్రం ఏకంగా కంపెనీనే నడుపుతోంది. అందులో విజయవంతమై.. కోట్ల సంపాదిస్తూ.. నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

First published:

Tags: Amercia, Business, Business Ideas, Us news

ఉత్తమ కథలు