హోమ్ /వార్తలు /బిజినెస్ /

Volkswagen: వోక్స్‌వ్యాగన్ నుంచి కొత్త కారును లాంచ్ చేసిన కంపెనీ.. ఆ వివరాలు ఇలా..

Volkswagen: వోక్స్‌వ్యాగన్ నుంచి కొత్త కారును లాంచ్ చేసిన కంపెనీ.. ఆ వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు మార్కెట్‌లోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ కొత్త పోలో కారును లాంచ్ చేసింది. సరికొత్త ‘పోలో లెజెండ్’ (Polo Legend) ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌ ను విడుదల చేసింది.

భారతదేశంలో ఎక్కువ కార్ సేల్స్(Car Sales) నమోదు చేసుకుంటున్న కంపెనీల్లో వోక్స్ వ్యాగన్(Volkswagen) ఒకటి. ఈ కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే కార్లకు ఇండియన్ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుంది. ఇలా 2009లో లాంచ్ చేసి, 2010లో అందుబాటులోకి వచ్చిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు సూపర్ సక్సెస్ అయింది. ఇది మార్కెట్‌లోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంపెనీ కొత్త పోలో కారును లాంచ్ చేసింది. సరికొత్త ‘పోలో లెజెండ్’ (Polo Legend) ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌ ను విడుదల చేసింది. పోలో ఎడిషన్ ఉత్పత్తి 2009లో ప్రారంభమైంది. 2010లో ఇది మార్కెట్లోకి వచ్చింది. వోక్స్‌వ్యాగన్ పుణెలోని చకన్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేసిన మొదటి మోడల్ ఇది. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఆఫర్‌గా అందించిన సెగ్మెంట్‌లోని మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా హ్యాచ్‌బ్యాక్‌లలో పోలో కూడా ఒకటి. ఇది 2014లో 4-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

వోక్స్‌వ్యాగన్ పోలోకు భారతదేశంలో మూడు లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వోక్స్‌వ్యాగన్ పోలో లెజెండ్ ఎడిషన్ భారతదేశంలో పోలో ప్రయాణానికి గుర్తుగా ఒక సెలబ్రేటరీ ఎడిషన్. లెజెండ్ ఎడిషన్ GT TSI వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌ ఉన్న 1.0-లీటర్ TSI ఇంజిన్‌తో వస్తోంది. 110PS పవర్, 175 Nm టార్క్ ప్రొడక్షన్‌తో శక్తివంతమైన పనితీరును ఇది అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన TSI టెక్నాలజీతో వచ్చే ఈ మోడల్.. ఇంధన వినియోగాన్ని బ్యాలెన్స్ చేస్తూ డ్రైవర్‌కు అసాధారణమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.

Bank Customers: ఆ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వాటిలో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి..

పోలో వారసత్వానికి గుర్తుగా ఈ ఎడిషన్ ఫెండర్ అండ్ బూట్ బ్యాడ్జ్‌పై “లెజెండ్” టైటిల్‌తో వస్తుంది. సైడ్ బాడీ గ్రాఫిక్స్, బ్లాక్ ట్రంక్ గార్నిష్, బ్లాక్ రూఫ్ ఫాయిల్‌లో ఆకట్టుకునే డిజైన్‌తో రిలీజ్ అయింది. లిమిటెడ్ వాల్యూమ్ లెజెండ్ పోలో ఎడిషన్ 151 వోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది.

కొత్త పోలో ఎడిషన్ లాంచింగ్‌పై వోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడారు. వోక్స్‌వ్యాగన్ పోలో అనేది వినియోగదారులకు బాగా కనెక్ట్ అయిన ఒక ఐకానిక్ కార్‌ లైన్ అని చెప్పారు. ‘ఈ మోడల్ మార్కెట్‌కు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కస్టమర్లను ఆకట్టుకుంది. ఫోక్స్‌వ్యాగన్ పోలో అనేది చాలా భారత కుటుంబాలకు ఫస్ట్ కార్‌గా నిలిచింది. స్పోర్టీ డిజైన్, భద్రత, వినోదభరితమైన డ్రైవింగ్ అనుభవం, మంచి బిల్డ్ క్వాలిటీతో ఇది సూపర్ సక్సెస్ అయింది. వోక్స్‌వ్యాగన్ పోలో బ్రాండ్‌ వారసత్వానికి గుర్తుగా సరికొత్త పోలో లెజెండ్ మోడల్‌ను ఆవిష్కరించాం.’ అని ఆశిష్ వెల్లడించారు.

Published by:Veera Babu
First published:

Tags: New cars, Polo cars, Volkswagen

ఉత్తమ కథలు