Home /News /business /

12 5 LAKH PRIVATE SCHOOL STUDENTS MISSING HARYANA SOUNDS ALERT MK GH

Haryana Private Schools : హర్యానాలో భారీగా తగ్గిన బడి పిలల సంఖ్య.. ఆ 12.5 ల‌క్ష‌ల మంది పిల్ల‌లు ఏమ‌య్యారు?

ఏపీలో పాఠశాలలు ఎప్పటి నుంచి తెరుస్తారనే అంశంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపింది.

ఏపీలో పాఠశాలలు ఎప్పటి నుంచి తెరుస్తారనే అంశంపై ఇప్పటికే స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపింది.

హ‌ర్యానాలో ప్రైవేటు బ‌డుల‌లో చేరే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది భారీగా త‌గ్గిపోయింది. కింద‌టేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో చేరిన పిల్ల‌ల సంఖ్య 12.5ల‌క్ష‌లు త‌క్కువ‌గా ఉంది. ఈ భారీ అంత‌రంపై ప్రైవేటు పాఠ‌శాల‌ల య‌జమానులు తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు. త‌మ‌ను ఆదుకోవాల‌ని వారు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.

ఇంకా చదవండి ...
హ‌ర్యానాలో ప్రైవేటు బ‌డుల‌లో చేరే విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది భారీగా త‌గ్గిపోయింది. కింద‌టేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో చేరిన పిల్ల‌ల సంఖ్య 12.5ల‌క్ష‌లు త‌క్కువ‌గా ఉంది. ఈ భారీ అంత‌రంపై ప్రైవేటు పాఠ‌శాల‌ల య‌జమానులు తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు. త‌మ‌ను ఆదుకోవాల‌ని వారు ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. కోవిడ్ కార‌ణంగా మూత‌ప‌డిన స్కూళ్ళ‌ను మూడునెల‌ల కింద‌ట తిరిగి తెరిచిన‌ప్ప‌టికీ హ‌ర్యానాలో మునుపటి విద్యా వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌లేదు. చాలామంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను స్కూళ్ళ‌కు పంప‌లేని ప‌రిస్థితుల‌లో ఉన్నారు. ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో అధిక ఫీజులు కూడా ఈసారి విద్యార్థుల సంఖ్య త‌గ్గ‌డానికి కార‌ణమ‌ని ఒక అధికారి తెలిపారు. కోవిడ్ దెబ్బ‌కు చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. వ‌ల‌స వ‌చ్చిన‌వారు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్ళిపోయారు. భ‌వ‌న నిర్మాణ‌రంగ కూలీలు పూర్తిగా కుదేలైపోయారు. చాలా మంది పిల్ల‌లు స‌ర్కారీ స్కూళ్ల‌లో చేరుతున్నారు. ఈ కార‌ణాల‌న్నీ ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య త‌గ్గ‌డానికి కార‌ణమ‌ని అధికారులు విశ్లేషిస్తున్నారు.

కింద‌టేడాది ప్రైవేటుబడుల‌లో 29.83ల‌క్ష‌ల‌మంది చేర‌గా, ఈఏడాది ఆసంఖ్య 17.31ల‌క్ష‌ల‌కు ప‌రిమిత‌మైంది అని ప్రైవేటుపాఠ‌శాల‌లు హ‌ర్యానా విద్యాశాఖ‌కు పంపిన డేటాలో పేర్కొన్నాయి. హ‌ర్యానాలో 14,500 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు ఉండ‌గా, 8,900 ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. ఈ డేటా అంద‌గానేప్రైవేటుపాఠ‌శాల‌ల య‌జ‌మానుల‌ను స‌మావేశ ప‌రిచి 12.5ల‌క్ష‌ల‌మంది విద్యార్థులు చేర‌లేక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషించాల‌ని, త‌ద్వారా ఈ సంఖ్య‌ను కుదించ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని హ‌ర్యానా విద్యాశాఖ జిల్లా అధికారుల‌కు ఓ స‌ర్క్యూల‌ర్ పంపింది.

ప్రైవేటుపాఠ‌శాల‌ల్లో పిల్ల‌లు చేరికలో ఇంత‌భారీ తేడానా? అంటూ హ‌ర్యానావిద్యాశాఖామంత్రి క‌న్వ‌ర పాల్ గుర్జార్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తామ‌ని ఆయ‌న ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.
ఇక ఈ ఏడాది కూడా స్కూళ్లు తెర‌వ‌రు అనే న‌మ్మ‌కం ప్ర‌బ‌లంగా ఉండ‌టం కూడా పిల్ల‌లు చేర‌క‌పోవ‌డానికి ఒక ప్ర‌ధాన‌కార‌ణ‌మ‌ని అందుకే ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ముఖ్యంగా జూనియ‌ర్ క్లాసుల‌లో ఎక్క‌డా ఎవ‌రూ చేర‌డంలేద‌ని ప్రైవేటు స్కూల్ మేనేజ్‌మెంట్ స‌భ్యుడు రామ్‌మెహ‌ర్ విశ్లేషించాడు.

కోవిడ్ కార‌ణంగా చాలామంది ఆదాయాలు కోల్పోయారు. దీనివ‌ల‌న వారు త‌మ పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు పంప‌లేక‌పోతున్నారు. కార్మికులు ముఖ్యంగా భ‌వ‌న‌నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి పూర్తిగా క‌రువైంది. దీంతో వారు త‌మ పిల్ల‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేయాల్సిన దుస్థితి త‌లెత్తిందని కార్మికుల స‌మస్య‌ల‌పై ప‌నిచేసే ఫ‌తేబాద్ జిల్లాలోని చౌబారాకు చెందిన రాజేష్ చౌబారా తెలిపారు.

ఆబ్‌కీ బారీ స్కూల్ స‌ర్కారీ

ఈ సారి స‌ర్కారీ స్కూళ్ళు అనే నినాదంతో హ‌ర్యానాలోని ప్ర‌భుత్వ‌పాఠ‌శాల‌ల టీచ‌ర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. పిల్ల‌ల‌ను ప్రైవేటు పాఠ‌శాల‌ల్లోకాకుండా స‌ర్కారీ బ‌డుల‌లో చేర్పించాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో త‌గినంత‌మంది సిబ్బంది ఉన్నార‌ని, క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే ఉపాధ్యాయులు ఉన్నార‌ని ప్ర‌జ‌లు త‌మ పిల్ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేర్చాలంటూ గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్లు కైతాల్ జిల్లా భాట్టా గ్రామంలో మైకుల‌ద్వారా ప్ర‌చారం చేస్తున్న వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీ పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ బ‌డుల‌లో చేర్చండి. ప్రైవేటు బ‌డుల ఫీజుల మోత‌ను దూరం చేసుకోండి... ఆబ్ కీ బారీ స్కూల్ స‌ర్కారీ ( ఈ సారి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ఎంచుకోండి) అంటూ వీరు ప్ర‌చారం చేస్తున్నారు.

ఎస్ఎల్సీ ర‌గ‌డ‌!

ఒక‌ర‌కంగా ప్రైవేటుపాఠ‌శాల‌ల్లో పిల్ల‌ల సంఖ్య‌త‌గ్గ‌డానికి ప్ర‌భుత్వ విధానాలు కూడా కార‌ణ‌మ‌ని ప్రైవేటుపాఠ‌శాల‌ల య‌జ‌మానులు విమ‌ర్శిస్తున్నారు. విద్యార్థి ఒక స్కూల్‌ను వ‌దిలి మ‌రో స్కూల్లో చేరాలంటే క‌చ్చితంగా తాను ముందు చ‌దివిన స్కూల్ నుంచి స్కూల్ లివింగ్ స‌ర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఈ స‌ర్టిఫికెట్ ఉంటేనే విద్యార్థికి కొత్త స్కూల్లో విద్యార్థికి అడ్మిష‌న్ ల‌భిస్తుంది. అయితే ఈ విషయంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని స్కూల్ లివింగ్ స‌ర్టిఫికెట్ గురించి ప‌ట్టించుకోకుండా నేరుగా విద్యార్థుల‌కు అడ్మిష‌న్లు ఇచ్చేస్తున్నాయ‌ని హ‌ర్యానా ప్రైవేటు స్కూల్స్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు కుల‌భూష‌ణ్ శ‌ర్మ ఆరోపించారు. అయితే దీనిపై ప్ర‌భుత్వ వ‌ర్గాలు భిన్నంగా స్పందించాయి. తామేమీ ఎస్ఎల్‌సి నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడ‌వ‌డం లేద‌ని విద్యార్థి చ‌దువుకు అంత‌రాయం క‌ల‌గ‌కుండా తాత్క‌లిక అడ్మిష‌న్లు ఇస్తున్నామ‌ని తెలిపాయి. విద్యాహ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం 8వ త‌ర‌గ‌తి దాకా పిల్ల‌ను ప్ర‌భుత్వ బ‌డుల‌లో చేర‌కుండా ఆపే హ‌క్కు ఎవ‌రికీ లేద‌నే నిబంధ‌న ప్ర‌కార‌మే తాము న‌డుచుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశాయి.

ఎస్ ఎల్ సి నిబంధ‌న‌కు మేము దూరంగా లేము. విద్యార్థుల‌కు చ‌దువులో అంత‌రాయం లేకుండా ఉండేందుకే వారిని చేర్చుకుంటున్నామ‌ని హర్య‌నా స్కూల్ ఎడ్యుకేష‌న్ అద‌న‌పు ముఖ్య కార్య‌ద‌ర్శి మ‌హావీర్ సింగ్ ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.

ఇక ఎస్ ఎల్ సి వివాదంపై జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ నేష‌న‌ల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అల‌యెన్స్ పంజాబ్ హ‌ర్యానా హైకోర్టుల‌ను ఆశ్ర‌యించింది.

ఇది చూడండి..
Published by:Krishna Adithya
First published:

Tags: Haryana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు