Home /News /bhadrari-kothagudem /

THE TELANGANA GOVERNMENT WILL DEPOSIT 10000 IN THE ACCOUNTS OF EACH OF THE FLOOD VICTIMS TOMORROW PRV

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం​.. రేపే ఒక్కొక్కరి అకౌంట్లలోకి రూ.10 వేలు జమ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఒక్కొక్కరి అకౌంట్లలో పదివేల రూపాయలు జమ చేయనున్నట్లు మంత్రి అజయ్​ కుమార్​ వెల్లడించారు.

  వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా  గోదావరి (Godavari) జూలై నెలలోనే ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో వచ్చే వరదలు ఈసారి జూలైలోనే (July) రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మొదట్లోనే గోదావరి నదికి భారీఎత్తున వరదలు వచ్చాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వందలాది ఇళ్లు మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అప్పట్లో భద్రాచలంలో పర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR Bhadrachalam Tour).. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని హామీ ఇచ్చారు. గోదావరి ప్రవాహం (Godavari Floods) 90, 100 అడుగులుకు చేరినా.. ఇబ్బందలు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరద ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ నిర్మిస్తామ‌ని చెప్పారు. ఆ కాలనీ భూమి పూజకు తానే స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్ (CM KCR). ఈ విషయంపై తాజా అప్​డేట్​ వచ్చింది ప్రభుత్వం తరఫున.

  20 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు..

  తాజాగా వరద ముంపు బాధితుల పునరావాసానికి సీఎంప్రకటించిన రూ 10 వేలు  పరిహారం ఆగస్టు 1 నుంచి బాధితుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు శనివారం మంత్రి పువ్వాడ అజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వరద బాధిత కుటుంబాలు ఒక ఇంటికి 20 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు, 2 నెలల పాటు ఉచితంగా ఇస్తామని,  అలాగే పదివేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటనలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

  ఈ మేరకు బాధితులకు సహాయార్థం సేకరించిన వారి వివరాల ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు బియ్యం కందిపప్పు పంపిణీ పూర్తయిందని మంత్రి అజయ్ తెలిపారు.  కాగా, ఇంతకుముందే భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పట్టణ కాంటూరు లెవెల్స్ ను పరిగణలోకి తీసుకొని వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో కాలనీల నిర్మాణం చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ గుర్తు చేశారు. కాగా, వర్షాల ప్రభావం  ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఏటూరునాగారం, కమలాపురం ప్రాంతాలపై పడింది. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, వరరామచంద్రాపురం, కూనవరం సహా, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వందలాది గ్రామాలు, గిరిజన గూడేల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Floods, Heavy Rains, Khammam, Money

  తదుపరి వార్తలు