భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రాణాలు నిలబెట్టాల్సిన 108 అంబులెన్స్ (Ambulance).. గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన మడివి చుకిడి అనే మహిళ.. కుటుంబ కలహాలతో పురుగుల మందు (Poison) తాగింది. కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకుంది. అనంతరం బాధితురాలిని (Patient) అంబులెన్స్‌లో చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. అటవీ మార్గంలో తాలిపేరు ప్రాజెక్టు దగ్గర 108 వాహనం ఆగిపోయింది (stopped on the road due to technical reasons). సిబ్బందితో పాటు.. బాధితురాలి కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ను తోసినా స్టార్ట్ కాలేదు.
చివరకు ఆమెను కుటుంబ సభ్యులు బైక్ (Bike)పై చర్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చుకిడి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అంబులెన్స్ మొరాయిస్తుందని (stopped on the road due to technical reasons) ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని..వారి నిర్లక్ష్యం కారణంగానే గిరిజన మహిళ ప్రాణం కోల్పోయిందని స్థానికులు ఆరోపించారు.
శవాన్ని భుజాలపై మోసుకుంటూ..
కాగా, ఇదే మాదిరిగా పొరుగు రాష్ట్రంలో ఇటీవలె ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్(Ambulence) అందుబాటులో లేకపోవడంతో వ్యక్తి నాలుగేళ్ల మేనకోడలి శవాన్ని భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకువెళ్లాడు. మధ్యప్రదేశ్(Madhyapradesh)లోని ఛతర్పూర్ జిల్లాలోని బక్స్‌వాహాలో ఈ హృదయవిదారకర సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్(Viral Video)గా మారింది. ఈ హృదయ విదారక ఘటన గురించి ప్రశ్నించగా..అంబులెన్స్‌ల సమస్యపై ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్(CM Shivraj Singh Chouhan)తో మాట్లాడుతానని స్థానిక వైద్యాధికారి డాక్టర్ విజయ్ పథోరియా చెప్పారు. కాగా,ఇంతకుముందు కూడా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.
కాగా, రెండు నెలల క్రితం చత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో.. తన ఏడేళ్ల కూతురి మృతదేహాన్ని భుజాలపై మోస్తూ 10 కిలోమీటర్లు మేర నడిచాడు ఓ తండ్రి. అనారోగ్యంతో ఏడేళ్ల బాలిక లఖాన్‌పూర్ గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతొ ఆమె మృతదేహాన్ని తండ్రి భుజాలపై మోసుకుని వెళ్లాడు. 10 కిలోమీటర్ల కుమార్తె మృతదేహాన్ని భుజంపై మోస్తూ తండ్రి కాలినడకన ఇంటికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు దీనిపై ఆసుపత్రి సిబ్బంది స్పందించారు అంబులెన్సు త్వరలోనే వస్తుందని, అందులో మృతదేహాన్ని తీసుకెళ్తారని చెప్పామని అన్నారు. ఆలోగానే ఆ తండ్రి బాలిక మృతదేహాన్ని భుజాలపై తీసుకెళ్లాడని అంటున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.