FOUR PERSONS INJURED IN CLASH AT WEDDING CEREMONY IN BHADRADRI KOTTAGUDEM DISTRICT SNR KMM
Bhadradri Kottagudem : రిసెప్షన్లో కొత్త పెళ్లి కొడుకుపై దాడి .. చేసింది ఎవరో ? ఎందుకో తెలుసా ?
(రిసెప్షన్లో రచ్చ)
Video Viral: తమకు ఇష్టం లేదని చెప్పినా పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువతి బంధువులు పెళ్లి కొడకు ఇంటి దగ్గర గొడవ చేశారు. మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్న జంట రిసెప్షన్ ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వచ్చిన అమ్మాయి బంధువులు గొడవ చేశారు. అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడి చేయడంతో నలుగురు గాయపడ్డారు.
(G.SrinivasReddy,News18,Khammam)
వాళ్లిద్దరూ పదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామంటే అమ్మాయి తరపు బంధువులు ఒప్పుకోలేదు. గత ఐదేళ్లుగా అమ్మాయి బంధువులను వెళ్లి అడిగినప్పటికి అంగీకరించలేదు. దాంతో యువకుడు అమ్మాయిని తీసుకెళ్లి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. యువకుడు చేసిన పనితో రగిలిపోయిన పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు రిసెప్షన్ జరుగుతుండగా రచ్చ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kottagudem)జిల్లా ఇల్లందు(yellandu)లో ఈఘటన జరిగింది.
రిసెప్షన్లో ఘర్షణ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు మనశాంతి లేకుండా చేశారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఇల్లందు మండలం 21 ఏరియాలో నివాసముంటున్న ప్రత్యూష, రాకేష్ గత 10 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో పెళ్లి విషయంపై ప్రత్యూష కుటుంబ సభ్యులను పలుమార్లు కోరారు అబ్బాయి తల్లిదండ్రులు. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో విసిగిపోయిన రాకేష్ పెద్దలతో సంబంధం లేకుండా ప్రత్యూషను తీసుకెళ్లి ఈఏడాది ఏప్రిల్ 6వ తేదిన వివాహం చేసుకున్నాడు.
3నెలల క్రితమే లవ్ మ్యారేజ్..
ప్రత్యూష, రాకేష్ వివాహం జరిగి మూడు నెలలు గడిచింది. రాకేష్ బంధులు రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే రాకేష్ కుటుంబ సభ్యులు రిసెప్షన్ ఏర్పాటు చేయడం ఇష్టం లేని ప్రత్యూష బంధువులు ముందుగానే హెచ్చరించారు. రిసెప్షన్ పెట్టవద్దన్నారు. అయితే రెండు కుటుంబాలకు మధ్య విభేదాలు ఉండటంతో విషయాన్ని పోలీసులకు చెప్పారు. బంధు, మిత్రులను ఆహ్వానించారు. అయితే రిసెప్షన్ మొదలవడంతోనే ప్రత్యూష తండ్రితో పాటు వేమూరి రాజు అనే వ్యక్తి మరికొందరు రాకేష్ ఇంటికి దగ్గరకు వచ్చి గొడవ చేశారు.
ఇది చదవండి: కామారెడ్డి జిల్లాలో పశువుల్ని మేపడానికి వెళ్లిన వివాహిత పట్ల ఆ ఇద్దరు పశువుల్లా ప్రవర్తించారు
ప్రాణహాని ఉందన్న పెళ్లి కొడుకు..
రిసెప్షన్ ప్రారంభం కాక ముందే రాకేష్ ఇంటికి వచ్చిన ప్రత్యూష బంధువులు టెంటు సామాన్లను ధ్వంసం చేశారు. టెంట్ సామాగ్రితో రాకేష్‌ని అతని తండ్రి మోజేస్తో పారు మరో నలుగుర్ని చితకబాదారు. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు. ఎలాగైనా పెళ్లి కొడుకు బంధువులపై దాడి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారని ...వాళ్లతో తనకు ప్రాణహాని ఉందని కొత్తగా పెళ్లి చేసుకున్న రాకేష్ చెప్పాడు. అమ్మాయి తరపు బంధువులు చేసిన దాడిలో తన తండ్రితో పాటు మరో ముగ్గురు గాయపడినట్లుగా తెలిపాడు. రిసెప్షన్ ఏర్పాటు చేయవద్దని...చేస్తే చంపుతామని ముందుగానే చెప్పారని రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ గొడవతో సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి గలాటా చేశారని రాకేష్ పోలీస్ కంప్లైంట్లో పేర్కొన్నాడు. ఇకపై తనకు ఏం జరిగినా అందుకు ప్రత్యూష తల్లిదండ్రులే బాద్యులు అవుతారని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిసెప్షన్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.