Home /News /bhadrari-kothagudem /

FORMER TRS MLA THATI VENKATESHWARLU DAUGHTER COMMITTED SUICIDE BY STABBING HERSELF INCIDENT HAPPENED IN BHADRADRI KOTHAGUDEM DISTRICT PRV

TRS leader daughter Suicide: టీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య.. ఇంట్లో ఉరేసుకుని చనిపోయిన యువతి

మృతురాలు మహాలక్ష్మి (ఫైల్​ ఫొటో)

మృతురాలు మహాలక్ష్మి (ఫైల్​ ఫొటో)

టీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇంట్లో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో ఘటన వెలుగుచూసింది.

    తెలంగాణ (Telangana)లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, అశ్వరావుపేట నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే (TRS Former MLA) తాటి వెంకటేశ్వర్లు కుమార్తె (Thati Venkateswarlu daughter) తాటి మహాలక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది (TRS leader daughter Suicide). గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఉరివేసుకుని (hanging)వేలాడుతూ కనిపించిన మహాలక్ష్మిని కుటుంబ సభ్యులు చూసి బోరుమన్నారు. మహాలక్ష్మీ (Mahalaxmi) హుటాహుటిన భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే  ఆమె మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు.

    ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని..

    విషయం తెలుసుకున్న తండ్రి తాటి వెంకటేశ్వర్లు హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి కన్న కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మహాలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ ప్రిపేర్ అవుతోంది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ ఎంట్రన్స్ కి ఆమె ప్రిపేర్ అవుతుంది. ఆత్మహత్యకు గల సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

    ఇంట్లో విషా ఛాయలు..

    ఈ మేరకు బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న పలు పార్టీ నేతలు,కార్యకర్తలు వెంకటేశ్వర్లు ఇంటికి చేరుకుంటున్నారు. మహాలక్ష్మి మృతితో వెంకటేశ్వర్లు ఇంట్లో విషా ఛాయలు అలుముకున్నాయి. కాగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూతురు తాటి మహాలక్ష్మి మరణం పట్ల అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. తాటి మహాలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.

    గతంలో టీఆర్ఎస్​ ఎమ్మెల్యే ఇంట్లో..

    కాగా, గతంలోనూ ఓ టీఆర్ఎస్​ నాయకుడి ఇంట్లో ఆయన కోడలు, మనవళ్లు ఆత్మహత్య చేసుకుని మృతిచెందారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్‍, సారిక ఇంజనీరింగ్‍ చదివేటప్పుడు ప్రేమించుకున్నారు. 2002లో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. 2010లో సనా అనే మహిళతో అనిల్‍ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే సమాచారంతో సారిక ఆత్మహత్యాయత్నం చేసింది. సనా విషయమై రాజయ్య కుటుంబంలో పలుమార్లు గొడవలు జరిగాయి.

    2014 ఏప్రిల్‍లో అనిల్‍తోపాటు అత్తమామలు కట్నకానుకలు తేవాలంటూ వేధిస్తున్నారని.. తనను, పిల్లల పోషణను పట్టించుకోవడంలేదని సారిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వరకట్నం కేసులో రాజయ్య దంపతులు, అనిల్‍ను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారు బెయిల్‍పై బయటకొచ్చారు. 2015 జనవరిలో జీవనభృతి కింద సారికకు నెలకు రూ.6 వేలు, ముగ్గురు పిల్లలకు రూ.3 వేల చొప్పున మొత్తం నెలకు రూ.15 వేలు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

    అనిల్‍తోపాటు రాజయ్య, మాధవి తనను, పిల్లలను పట్టించుకోకపోవడంతో సారిక ఇంట్లో ఒంటరిదైంది. దీనికితోడు కోర్ట్ తీర్పు ప్రకారం జీవనభృతి సకాలంలో ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడింది. జీవనభృతి చెల్లించకుండా వేధిస్తున్నాడనే కేసు విషయమై 2015 నవంబర్‍ 2న అనిల్‍, సారిక కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆస్తిపాస్తుల అంశమై ఇంట్లో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. చివరికి 2015 నవంబర్‍ 4న సారికతో పాటు పెద్ద కుమారుడు అభినవ్‍ (7) కవల పిల్లలైన అయోన్‍, శ్రీయోన్‍ (3) గ్యాస్‍ లీకేజీ మంటలకు ఆహుతయ్యారు. కాగా, వారిది హత్య కాదని.. గ్యాస్ లీక్ అవడం వల్లే ప్రమాదం జరిగిందని హైదరాబాద్‌‌లోని ఫోరెన్సిక్‌‌ సైన్స్‌‌ ల్యాబొరేటరీ అప్పట్లోనే నివేదిక సమర్పించింది. కొన్నిరోజుల కిందట రాజయ్య ఫ్యామిలీకి కోర్టు సైతం క్లీన్​చిట్​ ఇచ్చింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bhadradri kothagudem, Suicide, TRS leaders

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు