Home /News /bhadrari-kothagudem /

DO YOU KNOW HOW BIG AN ACCIDENT HAPPENED ON THIS DAY 83 YEARS AGO IN BOGUTTA IN SINGARENI KMM PRV

Singareni Bogutta Accident: నాటి బొగ్గుట్టవన్నీ నెత్తుటి గుర్తులే.. సరిగ్గా 83 ఏళ్ల కిందట సింగరేణిలో ఇదే రోజు ఏమైందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎనభై మూడేళ్ల నాటి ముచ్చట ఇది. ఆ రోజు మొహరం పండుగ (Moharam festival). అంతలోనే బొగ్గుట్టలో (Bogutta) విషాదం నిండింది. వందల మీటర్ల లోతులోని భూగర్భ గనిలో నుంచి వెలువడింది విషవాయువు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    (G. Srinivas Reddy, News18, Khammam)

    ఎనభై మూడేళ్ల నాటి ముచ్చట ఇది. ఆ రోజు మొహరం పండుగ (Moharam festival). అంతలోనే బొగ్గుట్టలో (Bogutta) విషాదం నిండింది. వందల మీటర్ల లోతులోని భూగర్భ గనిలో నుంచి వెలువడిన విషవాయువుకు 43 మంది బలైపోయారు. సింగరేణి (Singareni) చరిత్రలో చెరగని చేదు గుర్తుగా, అతి పెద్ద విషాధంగా మిగిలిపోయిన ఈ ప్రమాదం గుర్తు చేసుకుని నేటికీ సింగరేణి అధికారులు బాధపడుతుంటారు.  సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటి అతి పెద్ద ప్రమాదం కనుక ఇది రికార్డుల్లో ఉండిపోయింది. నాటి బ్రిటీష్‌ పరిపాలనలో తొలిసారిగా నేలబొగ్గును తవ్విన సింగరేణి గ్రామం పేరిటే ఈ గనులన్నిటనీ కలిపి సింగరేణి కాలరీస్‌గా (Singareni Calories) నామకరణం చేశారు.  మాసిపోని మరువలేని ఈ 85 ఏళ్ల నాటి నెత్తుటి గుర్తుల సాక్షిగా ఏటా ఆరోజున ఇప్పటికీ సెలవు (Holiday) ప్రకటిస్తుంటారు సింగరేణి అధికారులు. ఆనాటి మృతులను స్మరించుకుంటూ నివాళులర్పించడం సింగరేణిలో ఆనవాయితీగా వస్తోంది.

    రాత్రి 10 గంటల సమయంలో..

    మొహరం వచ్చిందనగానే పల్లెల్లో పీరీల ను నిలబెట్టి ఆడుతూ పాడుతూ ఆనందోత్సవాలతో నిండి ఉంటారు.  అలాంటి సమయంలో అదే మోహరం పండుగ రోజు సింగరేణి చరిత్రలో నిలిచిపోయే అత్యంత విషాదకర సంఘటన గుర్తుకు వస్తుంది. అదే 43 మంది గనిలో  విష వాయువుకు బలి అయిన సంఘటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem)  ఇల్లందు ఏరియా సింగరేణి లో బ్రిటిష్ హయాంలో కార్మికులు వేలాది అడుగుల లోతులో బొగ్గు పొరలను తొలుస్తూ వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలోనే   1938 మార్చి 12వ తేదీన  స్టట్ ఇంక్లైన్ లో విషవాయువు (poison gas) వెలువడి  విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సింగరేణి చరిత్రలో మరిచిపోని మైలురాయిగా నిలిచిపోయింది.



    ప్రజలంతా మోహరం సంబరాలలో మునిగి ఉండగా అదే రోజు శుక్రవారం నాడు  కార్మికులు భూగర్భంలో బొగ్గును (Coal) వెలికి తీస్తుండగా రాత్రి 10 గంటల సమయంలో  గ్యాస్ వెలువడి భారీ మంటలు సంభవించాయి.. విషవాయువు విస్పోటనం వలన బొగ్గు వెలికి తీస్తున్న 37 మంది పురుషులు ఆరుగురు స్త్రీలు వారితో పాటు సింగరేణి జనరల్ మేనేజర్ అండ్రుస్, హుస్సేన్, జాన్ యంగ్ అధికారులు దుర్మరణం పాలయ్యారు. దుర్మరణం పాలైన కార్మికులు అధికారులు తునాతునకలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో మాంసపు ముద్దలు ఏరి మూటగట్టి కొచ్చి వారి వారి బంధువులకు అప్పగించారు.

    దక్షిణ భారతదేశంలో తొలిసారిగా బొగ్గును గుర్తించింది.. తవ్వకాలు చేపట్టింది సింగరేణి అనే గ్రామంలో.. దాని ఆధారంగానే సింగరేణి బొగ్గు గనులుగా ప్రసిద్ధిగాంచాయి. స్థాపించి శతాబ్దం దాటినా, ఇప్పటికీ తొలినాటి పేరునే కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటాతో ఉమ్మడి యాజమాన్యంలో నడుస్తున్నప్పటికీ, అధికారుల నియామకం, ఇతరేతర పాలనా వ్యవహారాలన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వమే చూస్తుంటుంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bhadradri kothagudem, Khammam, Singareni Collieries Company

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు