హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Zodiac Sign: ఈ రాశుల వారు అబద్ధాలు ఎక్కువగా చెబుతారట.. జాబితాలో మీ రాశి ఉందోమో తెలుసుకోండి

Zodiac Sign: ఈ రాశుల వారు అబద్ధాలు ఎక్కువగా చెబుతారట.. జాబితాలో మీ రాశి ఉందోమో తెలుసుకోండి

జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశుల వారి స్వభావాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి వ్యక్తి స్వభావం, ఇష్టాలు, అయిష్టాలు భిన్నంగా ఉంటాయి. ఒక వ్యక్తి రాశి ప్రభావం, స్వభావం, వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు అలాంటి రాశిచక్రం వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారు తమ రహస్యాన్ని ఇతరులతో పంచుకోరు.

జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశుల వారి స్వభావాలు భిన్నంగా ఉంటాయి. ప్రతి వ్యక్తి స్వభావం, ఇష్టాలు, అయిష్టాలు భిన్నంగా ఉంటాయి. ఒక వ్యక్తి రాశి ప్రభావం, స్వభావం, వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు అలాంటి రాశిచక్రం వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారు తమ రహస్యాన్ని ఇతరులతో పంచుకోరు.

కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే అబద్ధాలు చెప్పే ఆస్కారం ఉంది. రాశులు కూడా మన మంచి ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశుల వారు తరచూ అబద్ధాలు చెబుతారని వెల్లడిస్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఆ రాశుల వారెవరో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

అబద్ధాలు చెప్పే వారు కనీసం రోజుకు ఒక అబద్ధం అయినా చెప్పకుండా ఉండలేరు. ఎంతటి ఘోరమైన అబద్ధమైనా వారు పట్టించుకోరు. తప్పుడు మాటలతో తమకు కావాల్సింది దక్కించుకోవడానికి ఏమాత్రం సందేహించరు. వీరి వల్ల నిజాయితీపరులు ఎన్నో కష్టాల పాలవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే అబద్ధాలు చెప్పే ఆస్కారం ఉంది. రాశులు (Zodiac Signs) కూడా మన మంచి ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశుల వారు తరచూ అబద్ధాలు చెబుతారని వెల్లడిస్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఆ రాశుల వారెవరో తెలుసుకుందాం.

1. సింహరాశి (Leo)

సింహ రాశి వారు ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి లేదా నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి అబద్ధాలు చెబుతారు. వీరిలో కాస్త అహంకారం ఎక్కువగానే ఉంటుందట. ఇతర విషయాల్లో అబద్ధాలు చెప్పకపోయినా కీర్తి, పాపులారిటీ గురించి వీరు ఎక్కువగా అబద్ధాలు చెబుతారు. తామే గొప్ప వాళ్లమన్నట్లు వ్యవహరిస్తుంటారు. అయితే అబద్ధాలు చెప్పేటప్పుడు మాత్రం చాలా తెలివిగా ఐ-కాంటాక్ట్ లేకుండా జాగ్రత్త పడతారు.

2. కర్కాటక రాశి (Cancer)

కర్కాటక రాశి వారు అతిశయోక్తులు చెప్పడానికి ఇష్టపడుతుంటారు. ఎంతగా అంటే కొన్ని సందర్భాల్లో వారు చెప్పిన మాటలు నిజమేనని నమ్మించడానికి అబద్ధాలు చెప్పేందుకు ఏ మాత్రం సందేహించరు. వీరు.. నలుగురిలో ఎక్కడ నవ్వులపాలు అవుతామేమోనని భయపడే సున్నిత మనస్కులు. అందుకే తమ మాటలను కప్పిపుచ్చేందుకు అసత్యాలు పలుకుతుంటారు.

3. పచ్చి అబద్ధాలు చెప్పే రాశులవారు

కుంభం, మిథునం, మేషం, సింహం, ధనుస్సు రాశులవారు పెద్దపెద్ద అబద్ధాలు చెప్పడానికి వెనుకాడరట. ఈ రాశుల వారు ఇతరుల నుంచి నిజాలు రాబట్టడానికి అబద్ధాలు ఆడతారు. లేదా ఎవరితోనూ తిట్లు తినకుండా ఉండాలని అబద్ధాలు చెప్తారు. వీరు చెప్పే అసత్యాలు ఇతరులకు ఎలాంటి హాని తలపెట్టవు. ఈ 5 రాశుల వారు అబద్ధాలు చెప్తారు. కానీ తమని ఎవరైనా జడ్జ్ చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు.

4. వృశ్చికరాశి (Scorpio)

అబద్ధాలు చెప్పడంలో వృశ్చిక రాశి వారు దిట్ట. వీరు అబద్ధాలు చెప్పినా.. అవి అసత్యాలని ఎవరూ కొనుక్కోలేరు. ఎందుకంటే వారి ముఖం నిత్య సత్యాలు చెప్పే సత్య హరిశ్చంద్రుడు వలె కనిపిస్తుంది. వీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా సరే అబద్ధాలు చెప్పి తప్పించుకోగలరు. వారు చెప్పే మాటలను శ్రద్ధగా గమనిస్తే తప్ప అది అబద్ధం అని గమనించడం అసాధ్యం.

5. మిథునరాశి (Gemini)

మిథునరాశి వారు కన్ను మూసి తెరిచేలోపు నిజాన్ని అబద్ధం చేయగలరు. ఎందుకంటే వారికి అబద్ధాలు చెప్పటం చాలా సులభమట. అయితే వారు ఎట్టి పరిస్థితులలోనూ ఎవరితోనూ ఓ చిన్న గొడవ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అందరికీ మంచి స్నేహితులుగా మెలుగుతూ ఆ హోదాను కాపాడుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు. అబద్ధాలు చెప్పే వారిగా సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఇష్టపడరు. అందుకే ఎవరికీ హాని తలపెట్టని అబద్ధాలు చెబుతుంటారు.

6. తులారాశి (Libra)

తులా రాశి వారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. కానీ తమని తాము రక్షించుకోవడానికి మాత్రం అసత్యాలు చెప్పేస్తారు. ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు వీరు అబద్ధాలు చెప్తారు. కానీ చివరికి ఆ అబద్ధాల వల్లే నష్టాల పాలవుతారు.

First published:

Tags: Cancer, Rasi phalalu, Zodiac sign, Zodiac signs

ఉత్తమ కథలు