ZODIAC SIGNS WHO HAVE A VERY SHARP AND SUPER MEMORY POWER THEY REMEMBER EACH AND EVERYTHING HERE IS THE DETAILS SK
Zodiac Signs: వీళ్లది కంప్యూటర్ బ్రెయిన్.. జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ.. ప్రతీది గుర్తుంటుంది..
ప్రతీకాత్మక చిత్రం
Zodiac Signs: కొంతమందికి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన చిన్నపాటి సంఘటనలన్నీ గుర్తుండిపోతాయి. మనం ఎప్పుడో మర్చిపోయిన విషయాలను కూడా వారు పూసగుచ్చినట్లు చెబుతుంటారు. వారికి జ్ఞాపకశక్తి అంత ఎక్కువగా ఉంటుంది. ఆ జాబితాలో మీరూ ఉన్నారా?
మనిషికి జ్ఞాపకశక్తి లేకపోతే ఏ పనీ సక్రమంగా చేసుకోలేరు. రోజువారీ పనులు, ఉద్యోగాలు వంటి కార్యకలాపాల్లో వెనుకబడతారు. ఈ లక్షణం చిన్నప్పటి నుంచే వ్యక్తులను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతుంది. మెరుగైన జ్ఞాపకశక్తి ఉన్నవారు చదువులతో పాటు అన్ని విషయాల్లోనూ ముందుంటారు. పెరిగి పెద్దయిన తరువాత ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. కొంతమందికి కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన చిన్నపాటి సంఘటనలన్నీ గుర్తుండిపోతాయి. మనం ఎప్పుడో మర్చిపోయిన విషయాలను తోటివారు గుర్తుచేస్తూ ఉంటారు. మరికొంత మందికి చాలామంది పేర్లు, పుట్టిన తేదీలు, మంచి, చెడు విషయాలన్నీ గుర్తుండిపోతాయి. ఇలాంటి వ్యక్తులు జ్ఞాపకశక్తితో నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపిస్తారు. జ్యోతిషం ప్రకారం కొన్ని రాశుల వారికి ఇతరులతో పోలిస్తే మంచి జ్ఞాపకశక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
* వృషభం
ఈ రాశివారికి సహజ కళాకారులు అనే గుర్తింపు ఉంది. వీరికి అపారమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. పాత విషయాలన్నీ వీరు మెదడుల్లో నిక్షిప్తం చేసుకోగలరు. వృషభ రాశివారికి తమ జీవితంలో జరిగిన అన్ని మంచి, చెడు సంఘటనలను, చిన్న, పెద్ద విషయాలను సైతం గుర్తుంచుకోగలిగే శక్తి ఉంటుంది.
* వృశ్చికం
ఇతర రాశుల వారితో పోలిస్తే వృశ్చిక రాశి వారికి మంచి జ్ఞాపకశక్తి ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. చిన్న చిన్న స౦ఘటనలు, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను కూడా వీరు గుర్తుంచుకోగలరు. జీవిత౦లో ఎప్పుడెప్పుడు ఏమేం జరిగిందో క్షణాల్లోనే గుర్తు తెచ్చుకుంటారు. వివిధ సంఘటనలు ఇప్పుడే కళ్లముందు జరిగాయా అన్నట్లు కళ్లకు కట్టినట్లు వివరించగలరు.
* కర్కాటకం
కర్కాటక రాశివారు మూడీగా, సున్నితంగా ఉంటారు. అవసరమైన ప్రతి విషయాన్నీ వీరు సులభంగా గుర్తుంచుకోగలరు. మంచి విషయాలతో పాటు ఇతరులు తమను మోసం చేసిన సందర్భాలు, జీవితంలో తొక్కేసేందుకు, వెనక్కు లాగేందుకు చేసిన ప్రయత్నాలను అసలు మర్చిపోలేరు.
* మకరరాశి
మకరరాశి వారు నీతి, నియమాలకు కట్టుబడి ఉంటారు. తమ పనులు తాము సక్రమంగా చేసుకుంటారు. అపారమైన జ్ఞాపకశక్తి వీరి సొంతం. చిన్న చిన్న విషయాలను సైతం వీరు మర్చిపోలేరు. దీన్ని ఉపయోగించుకొని కష్టపడి పనిచేస్తూ, ప్రతి విషయంలో విజయం సాధించే లక్షణం ఈ రాశి వారికి ఉంటుంది.
* కన్యారాశి
కన్యారాశి వారు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్షనిస్టులుగా, పరిపూర్ణులుగా ఉంటారు. వీరికి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది. సమస్యలను పరిష్కరించడానికి, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడానికి వీరు ఈ మెమరీ పవర్‌ను ఉపయోగించుకుంటారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.