హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Break Up నుంచి త్వరగా బయటపడాలా..? అలా Move On అయ్యే రాశులివే..

Break Up నుంచి త్వరగా బయటపడాలా..? అలా Move On అయ్యే రాశులివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి రాశికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా రాశులు, గ్రహసంచారాలను బట్టి ఇలాగే కచ్ఛితంగా ప్రవర్తిస్తారని చెప్పేది జ్యోతిష్యం. నిజానికి ఈ లెక్కలు సరిగ్గా వేశారంటే ఆ లెక్కలు తప్పే అవకాశమే లేదు.

  • News18
  • Last Updated :

రాశులను బట్టి వ్యక్తుల జీవితం, ఆలోచనా విధానం ఉంటుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎందుకంటే ప్రతి రాశికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా రాశులు, గ్రహసంచారాలను బట్టి ఇలాగే కచ్ఛితంగా ప్రవర్తిస్తారని చెప్పేది జ్యోతిష్యం. నిజానికి ఈ లెక్కలు సరిగ్గా వేశారంటే ఆ లెక్కలు తప్పే అవకాశమే లేదు. కానీ జ్యోతిష్య శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకుని, అధ్యయనం చేసిన వారికే ఇదంతా సాధ్యం. ఏదో మిడిమిడి జ్ఞానం ఉన్న జ్యోతిష్యులు చెప్పింది జరగప్రతి రాశికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా రాశులు, గ్రహసంచారాలను బట్టి ఇలాగే కచ్ఛితంగా ప్రవర్తిస్తారని చెప్పేది జ్యోతిష్యం. నిజానికి ఈ లెక్కలు సరిగ్గా వేశారంటే ఆ లెక్కలు తప్పే అవకాశమే లేదు.లేదని.. జ్యోతిష్యమంతా వట్టి మాయ అని మాత్రం భావించకండి. ఆస్ట్రాలజీ కూడా సైన్సే. సైన్స్ తప్పని ఎవరైనా అనగలరా చెప్పండి.

ప్రేమ (love) విషయానికి వస్తే.. జ్యోతిష్యం (astrology) ఈ విషయాన్ని కచ్ఛితంగా తేల్చేస్తుంది. ఫలానా రాశి (zodiac) వారు నమ్మదగిన వ్యక్తిత్వం కలిగినవారు, ఫలానా రాశి వారిని నమ్మలేమని జ్యోతిష్యులు చెబుతారు. అంటే మీరు ప్రేమించే వ్యక్తులు ఏ రాశి వారో తెలిస్తే వారిని మీరు ఎంతవరకు విశ్వాసంలోకి తీసుకోవచ్చో అర్థమైపోతుంది. ఇక బ్రేకప్ అయినవారు కూడా తమ పార్ట్ నర్ ఏ రాశికి చెందినవారో తెలుసుకుంటే వారి స్వభావం అర్థమై, బ్రేకప్ నుంచి బయటికి వచ్చేందుకు సహకరిస్తుంది. అపార్థాలు, అనర్థాలకు దారి తీయకూడదంటే ప్రేమలో ఉన్న వారు తాము ప్రేమిస్తున్న వ్యక్తి ఎలాంటివారో తెలుసుకుంటే సరి. అలాంటి వారికోసమే ఇదంతా..

మిథునం (Gemini)

మిథునం (Gemini) అంటే దంపతులు అని అర్థం. ఈరాశి వారికి ఓ ప్రత్యేకత ఉంది. వీరు చాలా త్వరగా ప్రేమలో పడిపోతారు. ఇంటలెక్చువల్ లెవెల్ ఎక్కువగా ఉన్నవారంటే వీరిక ప్రత్యేకమైన ఆసక్తి. ఇలాంటి బ్రెయినీ ప్యూపుల్ తో మిథున రాశివారు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. మేధావులంటే ఇష్టపడే మిథున రాశి వారు ప్రేమలో పడటాన్ని, ఆకర్షణలో లోనవటాన్ని బాగా ఆస్వాదిస్తారు. కానీ వీరు చాలా తక్కువ సమయం మాత్రమే ఆకర్షణ అనే ఫ్రేమ్ వర్క్ లో ఉంటారు, ఆతరువాత రొటీన్లో పడిపోతారు. కానీ రిలేషన్ షిప్ లో ఉన్న మిథున రాశివారు దాన్ని బ్రేకప్ చేసుకున్నారంటే మాత్రం దానికి లాజిక్ ఉంటుందండోయ్. కాబట్టి వీరు ఆషామాషీగా, తమాషా కారణాలకు బ్రేకప్ చెప్పరన్నమాట.

తులా ( Libra ) రాశి

వీరి ప్రేమ క్షణికం. చాలా తక్కువ సమయం వీరు ప్రేమలో ఉంటారు. అంతే తక్కువ సమయంలో బ్రేకప్ చెప్పేస్తారు. ఒక్కోసారి వారం రోజుల వ్యవధిలో చకచకా ప్రేమలో పడటం, ఆతరువాత కటీఫ్ చెప్పేయడం కూడా జరిగిపోతాయంటే అతిశయోక్తి కాదు. ఈ రాశి వారికి ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇదంతా జరుగుతుంది. వీరిలో Passionate Feelings పోయాయనుకోండి ఇక అంతే..లవ్వు లేదు గివ్వు లేదని తెగేసి చెప్పేస్తారు. అంతే ఆ తరువాత ఆ ఊబి నుంచి బయట పడి (move on) షరామామూలు జీవితంలోకి అడుగుపెట్టేస్తారు.

Sagittarius, Aquarius, Aries, love, zodiac, astrology, Aries, move on, Libra, love, love problems, how to come out from break up, love solutions
ప్రతీకాత్మక చిత్రం

మేషం (Aries)

మేష రాశి వారు త్వరగా ప్రేమలో పడతారు. అంతేకాదు తేడా వస్తే అంతే త్వరగా ప్రేమ నుంచి బయట పడతారు కూడా. క్షమా గుణం అధికంగా ఉన్న ఈ రాశి స్త్రీ, పురుషులు పదే పదే తప్పులు చేస్తే మాత్రం తట్టుకోలేరు. అంతే ఇక ఆతరువాత అంతా క్లోజ్. మీ కంటే తమను ఎక్కువగా ప్రేమించి, ఇష్టపడే వారికి వీరు చేరువ అవుతారు. కాబట్టి మీరు ఇష్టపడ్డ వ్యక్తి మేష రాశికి చెందిన వారేమో చెక్ చేసుకోండి.

కుంభ రాశి (Aquarius)

వీరి ఆలోచనా తీరు చాలా భిన్నంగా ఉంటుంది. అంటే కుంభ రాశి వారు చాలా కాంప్లెక్స్ గా ఆలోచిస్తారు, కానీ ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే ఖతం. ఇక వీరి మైండ్ సెట్ మార్చడం దాదాపు అసాధ్యమే. వీరు చాలా సహృదయం ఉన్నవారు. ఆఖరుకి బ్రేకప్ కూడా కలిసే నిర్ణయించుకుందామనే టైపు. రిలేషన్ షిప్ కు క్విట్ చెప్పాలంటే వీరు ఎక్కువ సమయం తీసుకుంటారు, చాలా లోతుగా ఆలోచిస్తారు, కానీ నిర్ణయం తీసుకుంటే మాత్రం వెనకడుగు వేయరు.

ధనూ రాశి (Sagittarius)

వీరు తరువాత జరగబోయే సాహసం కోసం ఆసక్తిగా ఎదురుచూసే తత్వం ఉన్నవారు. కంటి ముందు కనిపించక పోతే మరిచిపోయే నేచర్ ఉన్న వారు కనుక మీరు కంటికి కనిపించకుండా మాయమైతే సరి ధనూ రాశి వారు మిమ్మల్ని తేలికగా మర్చిపోయి, మూవ్ ఆన్ అయిపోతారు.

Published by:Srinivas Munigala
First published:

Tags: Love, Zodiac sign

ఉత్తమ కథలు