ZODIAC SIGNS WHO ARE LONELY IN THEIR RELATIONSHIP FROM PISCES TO CANCER UMG GH
Astrology: రిలేషన్షిప్లో ఉన్నా ఒంటరి తనాన్ని అనుభవిస్తున్నారా..? అయితే, మీరు కూడా ఈ రాశి వారు అయ్యుంటారు.. ఓ సారి చెక్ చేసుకోండీ..!
ప్రతీకాత్మక చిత్రం
లవ్ లేదా మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్నా ఒంటరి అయ్యామనే ఫీలింగ్ కొందరినీ ఎప్పుడూ వేధిస్తుంటుంది. జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, 4 రాశుల వారు (Zodiac Signs) ఇలాంటి ఒంటరితనంతోనే సతమతమవుతుంటారు. ప్రియులు లేదా దాంపత్య భాగస్వామి తమతోనే ఉన్నా ఒంటరిగా ఉన్నట్లే వీరికి అనిపిస్తుంది. ఈ కారణంగా ఈ రాశుల వారు తమ భాగస్వామితో అంతగా కలిసిపోలేరు.
ఒంటరితనం (Loneliness) చాలా భయంకరమైనది. ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అయ్యే వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశమెక్కువ. ఈ ఒంటరితనం తీవ్రమైతే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే సగటు మనిషి ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఒక తోడు కావాలి అనుకుంటాడు. ఆ ఆలోచనతోనే ప్రేమ లేదా వివాహ బంధంలోకి అడుగు పెడతారు. అయితే లవ్ లేదా మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్నా ఒంటరి అయ్యామనే ఫీలింగ్ కొందరినీ ఎప్పుడూ వేధిస్తుంటుంది. జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం, 4 రాశుల వారు (Zodiac Signs) ఇలాంటి ఒంటరితనంతోనే సతమతమవుతుంటారు. ప్రియులు లేదా దాంపత్య భాగస్వామి తమతోనే ఉన్నా ఒంటరిగా ఉన్నట్లే వీరికి అనిపిస్తుంది. ఈ కారణంగా ఈ రాశుల వారు తమ భాగస్వామితో అంతగా కలిసిపోలేరు. ఈ రిలేషన్షిప్ నుంచి ఒంటరితనం పోగొట్టడం వారికి ఎప్పటికీ సాధ్యం కాదు. మరి ఆ రాశులు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
* మీనరాశి
అనుబంధాల విషయంలో మీనరాశి వారు ఎప్పుడూ సమస్యలను ఎదుర్కొంటారు. వ్యక్తుల విషయంలో కూడా వీరికి సమస్యలు ఉంటాయి. వీరు తమ భాగస్వామితో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక బంధంలో ఇబ్బంది, బాధ కలిగినప్పుడు వీరు తమలో తామే కృంగిపోతారు కానీ తమ భావాలను బయటికి చూపించరు. ఈ భావోద్వేగాలను వారు తమలో ఉంచుకుంటారు. అలా పక్కనే భాగస్వామి ఉన్నా తమ బాధను వారితో పంచుకోలేక ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు.
* కన్యారాశి
కన్యారాశివారు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వీరు ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతుంటారు. ఈ సహజ లక్షణం వల్ల వీరు మానసిక ప్రశాంతత కోల్పోయి నిత్యం సతమతమవుతుంటారు. చిన్న విషయాలకే నొచ్చుకునే వీరిని చూసి బంధుమిత్రులు కూడా ఒక్కోసారి షాక్ అవుతుంటారు. అతిగా ఆలోచిస్తూ.. అకారణంగా బాధపడే మనస్తత్వం గల కన్యారాశి వారు చివరికి తమ భాగస్వామికి కూడా దూరం అవుతారు. భాగస్వామి తనని తప్ప ఎవరినీ పట్టించుకోకూడదని కూడా వీరు కోరుకుంటారు. అయితే తగినంత శ్రద్ధ భాగస్వామి చూపించకపోతే మీరు ఆ బంధాన్ని తెంచుకోవడానికి వెనకాడరు. అలా సున్నితమైన మనస్తత్వంతో వీరు ఒంటరితనంతో సావాసం చేస్తారు.
* వృశ్చికరాశి
వృశ్చికరాశి వారు ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తారు. పక్కన ఎవరూ లేకపోయినా వీరిని ఒంటరితనం ఏం చేయలేదు. వీరు సాధారణంగా తమ ప్రియమైన వారి నుంచి చాలా సమయం పొందుతారు. ఎందుకంటే వీరికి ఒంటరిగా ఉండటం అంటే ఇష్టం. కానీ అప్పుడప్పుడు, వృశ్చికరాశి వారు తమ భాగస్వామి నుంచి మానసికంగా దూరమయ్యామనే ఫీలింగ్స్‌తో తీవ్ర విచారానికి గురవుతారు.
* కర్కాటకరాశి
కర్కాటకరాశి తమ భాగస్వామితో ఆనందంగా ఉన్నంత సేపు ఒంటరితనాన్ని అసలు అనుభూతి చెందరు. సాధారణంగా వీరు తమ భాగస్వామిని ప్రేమించకుండా ఉండలేరు. కానీ ఒక్కసారి వారు తమ భాగస్వామితో డిస్కనెక్ట్ అయినట్లు అనిపిస్తే, ఒంటరి జీవితానికే పరిమితమవుతారు. భాగస్వామి లేదా ప్రియమైన వారు పక్కనే ఉన్నా వీరు తమ మనసులోని భావనలను పంచుకోరు. ఆ విధంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు.సాధారణంగా ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో ఒంటరితనాన్ని అనుభవించొచ్చు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పైన పేర్కొన్న రాశుల వారు ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.