భారతదేశం(India)లో ఎక్కువగా సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తారు. ఇవి ఇతర దేశాలతో పోలిస్తే కాస్తంత ఎక్కువనే చెప్పాలి. నిత్యం ఎన్నో ఆచారాలు(Rituals) పాటించడం భారతీయుల జీవన విధానంలోనే భాగంగా ఉంది. అయితే.. కొన్ని కొన్ని సాంప్రదాయాలు(Traditions) కొన్ని ప్రాంతాలకే పరిమితం. కొన్ని ఆచారాలు మాత్రం దేశమంతటా ఒకేలా ఉంటాయి. అయితే.. మనం పాటించే ఆచారాలు, సంప్రదాయాల అర్థాలు అన్నీ తెలియాలని లేదు. కొన్ని తెలిసి ఉండొచ్చు.. కొన్ని తెలియకపోవచ్చు. ఇలా ఒకరు పాటించారంటే.. ఒకరి నుంచి ఒకరు దాని అర్థం ఏంటో కూడా తెలియకుండా ఆచారంగా వస్తుంది కదా అని పాటిస్తుంటారు.
కానీ ఇలా చేసే వాటిలో ప్రతీ దానికి నిగూడ అర్థాలు ఉన్నాయి. ఇలా దానిలో భారతదేశంలో ఎక్కువగా చాలామంది పాటించే ఆచారాల్లో గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయ కట్టి వేలాడదీయడం. ఎందుకు ఇలా చేస్తారో తెలియదు.. కానీ సాంప్రదాయం, ఆచారం ప్రకారం ఇలా చేస్తున్నారు కాబట్టి.. దానిని అనుసరిస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు కడతారో ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం వల్ల దుష్టశక్తులు, ఆత్మలు ఇంట్లోకి రావు అని ఒక నమ్మకం అప్పట్లో ప్రచారంలో ఉంది.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. దీని వెనుక ఓ మంచి సైన్స్ దాగి ఉందనేది మాత్రం నిజం. అందేంటంటే.. ఇప్పుడంటే ఎక్కడ చూసినా డాబాలు, పెద్ద భవనాలు కనపడుతున్నాయి. ఎక్కడో ఒక చోటు గుడిసెలు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. పూర్వం మాత్రం ఇలా ఉండేది కాదు. చాలామంది మట్టితో అలికిన ఇండ్లలో నివసించేవారు. ఆ ఇంటిలో ఎలాంటి టైల్స్ గానీ, బండలు గానీ ఉండేవి కావు. దీంతో ఎక్కువగా చిన్న పురుగులు, దోమలు ఇంట్లోకి ఎక్కువగా వస్తుండేవి. ఇప్పుడంటే దోమల నుంచి తప్పించుకోవడానికి మస్కిటో బ్యాట్లు, కాయిల్స్ వాడుతున్నాం గానీ అప్పట్లో ఇలాంటివి ఉండేవి కాదు.
అప్పుడు ఇవి అందుబాటులో లేవు. దీంతో.. నిమ్మకాయ, మిరపకాయలు కలిపి ఇంట్లో గుమ్మానికో.. లేదంటే దూలానికో కట్టేవారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వస్తూ పురుగులు రాకుండా అడ్డుకునేది. మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
అందుకే వాటిని గుమ్మానికి ఎదురుగా కట్టేవారు. పూర్వకాలం నుంచి ఈ ఆచారాన్ని మన పెద్దలు పాటిస్తుండటంతో ఇప్పటికీ మనం ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. దాంట్లో సైన్స్ తో పాటు.. ఆచారం కూడా ఉండటంతో ఆ పద్ధతి పాటించవద్దని చెప్పడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అందుకే ఏ ఇంటికి వెళ్లిన ఇలా గుమ్మానికి నిమ్మకాలయను వేలాడదీస్తారు. చాలామందికి వాటి ఉపయోగం తెలియకపోయినా.. పెద్దలు చెప్పింది వింటూ ఇలా చేస్తున్నారు. ఏం చెసినా.. ఎప్పుడు చేసినా.. కొన్ని ఆచారాలు తెలుసుకోవడం మంచిది. వాటి వెనకాల ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health benefits, Life Style