హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Astrology | Hair Cutting : మంగళవారం హెయిర్​ కటింగ్​ ఎందుకు చేసుకోకూడదు..? చేసుకుంటే ఏమవుతుంది?

Astrology | Hair Cutting : మంగళవారం హెయిర్​ కటింగ్​ ఎందుకు చేసుకోకూడదు..? చేసుకుంటే ఏమవుతుంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. లేదంటే అంగారకుడి చెడు ద్రుష్టి పడుతుందట. అయితే చాలా మంది మంగళవారం హెయిర్​ కటింగ్​ చేయకూడదంటారు. ఎందుకు అలా? చేస్తే ఏమవుతుంది?

  వారంలో మూడవ రోజు మంగళవారం (Tuesday). దీనిని జయవారం అని కూడా పిలుస్తారు. ఈ వారం దుర్గాదేవికి, ఆంజనేయస్వామికి అంకితం చేసిన రోజు. మంగళవారం రోజు చాలా మంది భక్తులు కొన్ని ప్రాంతాల్లో హనుమంతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం అనేది కుజ గ్రహానికి సంబంధించిన వారం. ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే…ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడని భక్తులు నమ్ముతుంటారు. మంగళవారం (Tuesday) ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. లేదంటే అంగారకుడి చెడు ద్రుష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయట. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడుతుంది. మంగళవారం ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం. ఇంతకీ మంగళవారం జుట్టు ఎందుకు కత్తిరించుకోకూడదు? (Why not get a haircut) తెలుసుకుందాం..

  కొత్త బట్టలు కొనకూడదట.. మంగళవారం (Tuesday) నాడు కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదట. అదేవిధంగా ఈ సమయంలో ధరించకూడదట. ఎందుకంటే ఈ రోజు కొత్త బట్టలు ధరిస్తే మంగళకరంగా భావిస్తారు. ఈ రోజు కొత్త బట్టలు ధరిస్తే…ఇతర కారణాల చేత ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారట. ఈ రోజు ధరించిన కొత్త వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తుంటారట.

  అప్పు తీసుకోవద్దట. శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్న రుణాలు లేదా అప్పులు తిగిరి చెల్లించడం కష్టం అవుతుందని మంగళవారం అప్పు పొరపాటున కూడా చేయోద్దు.

  హెయిర్ కట్ (Hair cut)..  మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్, షేవింగ్, గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులు చేయవద్దట. ఎందుకంటే ఈ పనులు చేస్తే ఆయుష్షు తగ్గిపోతుందని చెబుతుంటారు. మంగళవారం షేవింగ్ చేయడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు నిషిద్ధం

  అనారోగ్యంపై ప్రభావం.. మంగళవారం ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మంగళవారం మసాజ్ చేసుకుంటే తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి. ఫలితంగా ఎన్నో వ్యాధులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంట్లో చికాకులు కూడా మొదలవుతాయి.

  కొత్త షూస్ ధరించకూడదు.. శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తువులతోపాటు కొత్త బూట్లను ధరించకూడదు. కొత్త బూట్లు వేసుకోవడం వల్ల గాయాలపాలవుతారు. అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో మంటలు, దొంగతనం జరిగే ప్రమాదం ఉంటుందని భావిస్తారు. ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్పమయ్యే అవకాశం ఉంటుంది.  ఇవన్నీ మనం తప్పకుండా ఆచరించాలని లేదు. ఎందుకంటే ఆధునిక యుగంలో ఇలాంటి వాటిని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అయితే పెద్దలు ఇలాంటి పద్దతులు ఏదో బలమైన కారణం ఉంటేనే పెట్టారని.. ఊరికనే పెట్టరు కదా అని పలువురు వీటిని పాటించే వారు వాదిస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Astrology, Horoscope Today, Vastu Tips