Home /News /astrology /

WHY MAXIMUM NUMBER OF HINDUS BELIEVE THIS NUMBER RNK

హిందువులు ఆ సంఖ్యనే ఎందుకు ఎక్కువగా ఆరాధిస్తారు?దాని వెనుకు ఉన్న మర్మం..

అసలు ఈ సంఖ్యకు మనదేశంలో ఎందుకు అంత క్రేజ్‌. ఈ సంఖ్య లేనిది ఏ పని చేయలేం. అది శుభకార్యం, యజ్ఞయాగాల్లో కూడా ఈ సంఖ్యకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది.

అసలు ఈ సంఖ్యకు మనదేశంలో ఎందుకు అంత క్రేజ్‌. ఈ సంఖ్య లేనిది ఏ పని చేయలేం. అది శుభకార్యం, యజ్ఞయాగాల్లో కూడా ఈ సంఖ్యకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది.

అసలు ఈ సంఖ్యకు మనదేశంలో ఎందుకు అంత క్రేజ్‌. ఈ సంఖ్య లేనిది ఏ పని చేయలేం. అది శుభకార్యం, యజ్ఞయాగాల్లో కూడా ఈ సంఖ్యకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది.

హిందువులు ఒక అంకెను ప్రత్యేకంగా పూజిస్తారు. ఏ పని చేసినా దీంతో ముడిపడి ఉంటుంది. ఎందుకు అసలు దానికి అంతగా పూజిస్తారు. దీని వెనుక పెద్ద కథనే ఉంది. ఇంతకి ఏమిటా సంఖ్య.. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ నంబర్‌ వెనుక ఓ అంతరిక్ష శాస్త్రమే ఉంది. వేద కాలంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి.

ఈ సంఖ్య ఆధారంగానే భూమికి సూర్యునికి మ«ధ్య దూరాన్ని కూడా అప్పుడే చెప్పారు. అదే నూటాఎనిమిది. సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు. ఇది నమ్మశక్యంగా లేదు కదా. అన్నిటి లెక్కలు, దూరాలు ఈ సంఖ్యంతోనే ముడిపడి ఉంది. వేద కాలంలో మన రుషులు చెప్పిన నిజం.

ఆయర్వేదం ప్రకారం కూడా మనిషి శరీరంలో నూటా ఎనిమిది మర్మస్థానాలు ఉంటాయి. శ్రీ చక్రం అంరార్థాం కూడా తెలీదు. ఈ చక్రంలో 54 పురుష, మరో 54 స్త్రీ అంతర్భాగాలు ఉంటాయి. ఇది మొత్తం 108. శ్రీ చక్రం ఇంట్లో ఉంటే నెగిటివ్‌ ఎనర్జీని పాజిటివ్‌ ఎనర్జీగా మారుస్తుందని విశ్వాసం. కొంతమంది వల్ల మూడనమ్మకం అనే మచ్చ పడింది.

కానీ, మనం పుట్టినపుడు ఏ రాశి, నక్షత్రం ఆధారంగా భూమ్మిద పడతామో అవి చివరి వరకు మనపై ప్రభావాన్ని చూపుతాయి. 27 నక్షత్రాలను కూడా 4 పాదాలతో గుణిస్తే 108 వస్తుంది. భారతీయ శాస్త్ర ప్రకారం 12 రాశులు 9 గ్రహాలు ఉంటాయి. ఈ రెండింటిని గుణించిన 108 వస్తుంది. మనిషి సగటున 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో 10,800 సార్లు సూర్యాంశ అంటే ప్రాణశక్తి, 10,800 సార్లు చంద్రాంశ అంటే మనం వదిలే కార్బన్‌డయాక్సైడ్‌. ఆక్సిజన్‌ పీల్చుకుని కార్బన్‌డయాక్సైడ్‌ను వదలడం.

నటరాజ స్వామి చేసే భంగిమలు కూడా 108. అష్టాదశ పురాణాలు కూడా ఇన్నే. అందుకే మన ప్రాచీన రుషులు అంత ప్రాధాన్యతనిచ్చారు. అందుకే గుడిలో ప్రదక్షిణలు చేసినా, మంత్రాలు చదివినా 108 సార్లు చేస్తారు. మనలో ఉన్న దేవుడిని కలవడానికి కూడా 108 మెట్లు దాటి వెళ్లాలని బౌద్ధుల నమ్మకం.

ఇది భారతీయ అద్భుత గణిత పరిజ్ఞానానికి ఇది ఓ సింబల్‌. అనేక పరిశోధనులు వేల ఏళ్ల కిందటే చేసినట్లు దీంతోనే తెలుస్తుంది. రుద్రాక్ష, తులసీదళం ఇలా అన్ని నూటాఎనిమిది సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది. ఇంతటి ప్రధాన్యం ఉన్న ఈ సంఖ్యకు ఇప్పటికీ ఆచరిస్తూనే ఉన్నాం.
Published by:Renuka Godugu
First published:

Tags: Hindu Temples, Science

తదుపరి వార్తలు