Home /News /astrology /

WHY DO WE HAVE TO WAKE UP IN THE BRAHMA MUHURAT AND WHY DO MORE MARRIAGES TAKE PLACE IN THAT MUHURAT PRV

Brahma Mahurat: ఉదయం 4 నుంచి 6 మధ్యలో నిద్ర ఎందుకు లేవాలి? ఆ సమయంలోనే పెళ్లిళ్లు ఎందుకు ఎక్కువ చేస్తారు?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏమిటంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని.. మరో విషయం ఏంటంటే ఎక్కువగా పెళ్లిళ్లు ఉదయం ఆ సమయంలోనే జరగడం. ఎందుకు అలా.. ఏమిటి ఆ సమయం ప్రత్యేకత.?

    ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏమిటంటే, ఉదయాన్నే (Morning) లేచేటప్పుడు సూర్యోదయం కంటే.. ముందుగానే లేవాలి అని , అప్పుడే మన పనులు త్వరగా ముగించుకోవడానికి వీలు ఉంటుందని చాలామంది చెబుతుంటారు. సూర్యోదయం (before sunrise) కంటే ముందుగా నిద్రలేవడం వల్ల అదృష్టం వరిస్తుందని, అష్ట ఐశ్వర్యాలు చెంతకు వస్తాయని పెద్ద వాళ్ళ నమ్మకం. చాలామందికి బ్రహ్మ ముహూర్తం (Brahma Muhurat)లో నిద్ర లేస్తే బాగుంటుందట.

    ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ప్రతి ఒక్కరు బ్రహ్మ ముహూర్తం (Brahma Muhurat)లో నిద్ర లేవాలని (wakeup) సూచిస్తున్నారు. అంటే తెల్లవారు జామున ఉదయం 4 నుంచి 6 గంటల లోపు నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ (positive energy) మనకు వరిస్తుందట. తద్వారా మన ఆలోచనలు కూడా పాజిటివ్ రావడం, సమాజంలో అందరితోనూ ఆనందోత్సహాలతో జీవించడానికి వీలు ఉంటుందట. శరీరానికి కావలసిన శక్తి (energy) లభించడమే కాకుండా ఆరోగ్యంగా (healthy) కూడా ఉంటారు అట.

    బ్రహ్మ ముహూర్తం (Brahma muhurat) లో మేల్కొంటే మీ మానసిక స్థితి స్థిరంగా ఉంటుంది. దానికి సరైన సమయం ఉదయమే. బ్రహ్మదేవుడు (Lord brahma) సృష్టికారకుడు అంటారు.  ఈ సమయంలో చేసే ఉత్తమ పనులు మంచి ఫలితాలను ఇస్తుంది. అందుకే బ్రహ్మ ముహూర్తం సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో తిథి వార నక్షత్ర దోషాలు ఉండవు. ఆ సమయం ఎల్లప్పుడూ శుభప్రదం. ఈ సమయంలో మనం లేచి స్నానం చేసి, పూజించి, మన పనిని ప్రారంభిస్తే.. రోజంతా విజయం సాధిస్తాం. ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

    ఈ సమయంలో ఇంట్లో పని..

    బ్రహ్మ త్రిమూర్తుల్లో ఒకరు. ఈ సమయంలో కచ్ఛితంగా నిద్రపోకూడదు. ధ్యానం, పూజ వంటి ఉపయోగకరమైన పనులు చేయాలి.ఈ సమయంలో వివాహం వంటి శుభకార్యాలు చేస్తారు. ఈ సమయంలో చేసే పని మెరుగైన ఫలితాలన్ని ఇస్తుందని నమ్మకం. ఇక ఎవరైనా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఇంట్లో పని చేసుకోవాలి. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం నిద్రపోయే సమయంలో మెలకువగా ఉంటే.. వ్యాధులు వస్తాయి. అందుకే మన పెద్దలు మనం త్వరగా లేవాలని చెప్పారు. ఆ సమయంలో భగవంతునికి అన్ని రకాల ప్రార్థనలు దేవుడికి చేరుతాయి. ఈ సమయం దీపం వెలిగించడానికి సరైన సమయం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో 4–6 గంటల మధ్య దీపం వెలిగించి ఉదయమే పూజిస్తే.. అన్ని కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉంటాయని అంటారు.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Astrology, Sleep tips

    తదుపరి వార్తలు