Pitru paksha 2021: పితృపక్షంలో మగవారు ఈ పని ఎందుకు చేయరో తెలుసా?

పితృపక్షంలో మన చనిపోయిన పెద్దవారు తిరిగి ఈ భూమ్మిదకు వస్తారని నమ్మకం. అందుకే ఈ పక్షం రోజులు కొన్ని నియమాలను వారి ఆత్మశాంతి కోసం పాటిస్తారు.

పితృపక్షంలో మన చనిపోయిన పెద్దవారు తిరిగి ఈ భూమ్మిదకు వస్తారని నమ్మకం. అందుకే ఈ పక్షం రోజులు కొన్ని నియమాలను వారి ఆత్మశాంతి కోసం పాటిస్తారు.

  • Share this:
పితృపక్షం Pitru paksha అంటే మన పూర్వీకుల కోసం ఓ పక్షం రోజులు ఆచరించే మాసం. ప్రతి ఏడాది బాధ్రపద పౌర్ణమి నుంచి ఈ పక్షం మొదలవుతుంది. ఈ ఏడాది 2021 సెప్టెంబర్‌ 21 పితృపక్షం ప్రారంభం కానుంది. అయితే, ఈ పక్షంలో మగవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తారు. చనిపోయిన తమ కుటింబీకుల గుర్తుగా ఈ నియమాలను పాటిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఈ పక్షంలో అందరూ ముఖ్యంగా మగవారు చనిపోయిన తమ పూర్వీకులకు Ancestors తర్పణం, శర్ధం పెడతారు. దీంతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని. పదిహేను రోజులు సంతాప దినాలుగా పాటిస్తారు
ఈ పక్షం రోజులు ఆత్మ శాంతించని తమ చనిపోయిన పెద్దలు భూమిపైకి తమను చూడటానికి వస్తారని నమ్మకం. కొన్ని నియమాలు పాటించి వాటిని ఆచరిస్తే వారికి మోక్షం కలుగుతుందని పిండ ప్రదానం చేస్తారు. కాకులు చనిపోయిన వారికి గుర్తు కాబట్టి వీటికి కూడా ఏదైనా ఆహారం పెడతారు. ఆ ఫుడ్‌ కాకులు తింటే తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని అంటారు. ఒకవేళ అవి ఈ ఆహారం ముట్టుకోకపోతే ఆత్మ శాంతించలేదని భావిస్తారు.

ఇవన్ని ఒక ఎత్తు అయితే... ఈ పక్షం రోజులు మగవారు కట్టింగ్, షేవింగ్‌ చేసుకోరు. ఎందుకంటే ఈ దినాలను సంతాప దినాలుగా బావిస్తారు. ముఖ్యంగా పితృపక్షం ముగిసే వరకు ఏ శుభకార్యాలు, కొత్త పనులకు కూడా పూనుకోరు. అంటే కొత్త బట్టలు, వస్తువులు, బంగారం, ఏ ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయరు. కొత్త ఇల్లు, వాహనాలు కూడా కొనుగోలు చేయరు.

ఇంకా ఈ పక్షంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, నాన్‌ వెజ్‌ వంటి చికెన్, మటన్, చేపలు, ఘటైన వాసన వచ్చే ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోరు. మొత్తానికి చెప్పాలంటే కొంతమంది ఇళ్లలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ప్రార్థనలు, ఆచారాలు పాటించడం వల్ల వారి ఆత్మకు శాంతి కలిగి ముక్తి కలిగుతుందని నమ్మకం. ఏవైనా పితృదోషలు ఉంటే ఉపశమనం కలుగుతుందంటారు.
Published by:Renuka Godugu
First published: