WHERE TO PUT SALT IN THE HOUSE IS GOOD WHERE NOT TO PUT IT PRV
Salt facts: ఉప్పును ఇంట్లో ఎక్కడెక్కడ పెడితే శుభం కలుగుతుంది? ఎక్కడ పెట్టకూడదు?
ప్రతీకాత్మక చిత్రం
వాస్తు నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పు ఇంట్లో ఉండటం చాలా మంచిదట. అయితే ఈ ఉప్పే మన ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందట. మరి ఏ ఏ ప్రాంతంలో ఉంటే ఎంత లాభమూ వాస్తు శాస్త్రం చెబుతోంది. అదేంటో తెలుసుకుందాం..
ఉప్పు(salt). మనం మూమూలుగా కూరలో వేసుకునేది. అయితే ఉప్పుకు మాత్రం ఘనమైన చరిత్రే ఉందట. ఉప్పును ఇంట్లో కొన్నిప్రాంతాల్లో పెట్టుకుంటే శుభాలు(good lucks) కలుగుతాయట. అందుకే ఉప్పును తొక్కడం గానీ, దొంగతనం కూడా చేయకూడదని చెబుతారు పెద్దలు(elders). అలాగే ఉప్పును చేతితో తీసుకోకూడదని కూడా చెబుతారు. ఎందుకంటే.. ఉప్పును దైవంగా భావిస్తారు పూర్వీకులు. అందుకే.. ఒకరి చేతి నుంచి మరొకరికి ఉప్పును ఇవ్వకూడదంట, అప్పుగా తీసుకోకూడదని కూడా చెబుతారు పెద్దలు. అప్పట్లో ఉప్పు(salt) కొరత ఎక్కువగా ఉండేదట. దాని వల్ల చాలామంది దొంగిలించేవారట. అది నివారించడం కోసమే ఉప్పును శనీశ్వరుడనే వదంతి పుట్టించారని పలువురు చెబుతుంటారు. అయితే, కూరలను రుచిగా చేసేది ఉప్పే కాబట్టి.. దాన్ని మన పూర్వీకులు(Ancestors) శనీశ్వరుడి(Of Saturn)గా భావించేవారు. అందుకే ఉప్పును తొక్కడం, ఉప్పు మూటలపై కూర్చోవడం వంటివి దోషమని చెబుతారు. అయితే, ఉప్పు వల్ల చెడు మాత్రమే జరుగుతుందని భావిస్తే తప్పే. వాస్తు శాస్త్రం, మరికొందరు వాస్తు నిపుణుల (architectural experts) తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పు ఇంట్లో ఉండటం చాలా మంచిదట. అయితే ఈ ఉప్పే మన ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ(positive energy)ని ఇస్తుందట. మరి ఏ ఏ ప్రాంతంలో ఉంటే ఎంత లాభమో వాస్తు శాస్త్రం(Architecture) చెబుతోంది. అదేంటో తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది(bed room)లో ఉప్పును ఉంచితే అనారోగ్యం దరిచేరదట. ఎర్ర రంగు వస్త్రంలో ఉప్పు కట్టి ఉంచి గుమ్మానికి వేలాడదీస్తే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. దిష్టి, చెడు(bad) ప్రభావాలు తొలగిపోతాయి. ఉప్పును వస్త్రంలో కట్టి పెట్టడం వల్ల కొందరికి అదృష్టం(lucky) కూడా కలిసి వస్తుందట. ఇంటి చుట్టూ ఉప్పును చల్లితే మొత్తం నెగటివ్ ఎనర్జీ(negative energy)ని అది లాగేసుకుంటుందట. అప్పుడు కష్టలే ఉండవని అంటున్నారు. ఇంటి ముందు బకెట్ లేదా చిన్న పాత్రలో నీరు, ఉప్పు కలిపి ఉంచితే.. అది నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందట. ఆ ఉప్పు నీటిని ఎప్పటికప్పుడు మార్చాలి. ఎక్కడపడితే అక్కడ ఆ నీటిని పారబోయరాదు. శరీరంపై పడకుండా డ్రైనేజీ లేదా టాయిలెట్లో పారబోయాలి. అరచేతిలో ఉప్పు వేసుకుని కడిగితే.. డబ్బు రావడం మొదలవుతుందని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు.
బాత్రూమ్లో ఉప్పు పెడితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు తొలగిపోతాయట. ఇంట్లో వివిధ ప్రాంతాల్లో ఉప్పును ఉంచితే ధనలాభం కలుగుతుందట. ఒత్తిడి(stress) లేదా మనసు ఆందోళనకరంగా ఉన్నట్లయితే ఉప్పును చిన్న పొట్లంలా చుట్టుకుని జేబులో పెట్టుకుంటే సత్ఫలితం ఉంటుందట. ఇంట్లోని డెకరేషన్ వస్తువులను అప్పుడప్పుడు ఉప్పు నీటితో కడిగితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోనే ఉంటుంది. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కాళ్లను పెట్టాలి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది. నెగటివ్ ఎనర్జీ కూడా దరిచేరదు. వాస్తుకు మంచిదని అదేపనిగా ఇల్లంతా ఉప్పుతో నింపేసినా సమస్యే. నెగటివ్ ఎనర్జీని గ్రహించే ఉప్పును ఎప్పుడు కొద్ది మేరకు మాత్రమే ఉపయోగించాలి. అతిగా వాడితే ఉప్పు నెగటివ్ ఎనర్జీకి వాహకంగా మారే ప్రమాదం ఉందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.