Home /News /astrology /

WHEN WAS BONALU STARTED AND DO YOU KNOW HOW THIS CULTURE CAME TO BHAGYANAGARAM RNK

Bonalu 2022: నేటి నుంచి బోనాలు.. భాగ్యనగరానికి ఈ సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bonalu 2022: నేటి నుంచి ఆషాఢం.. బోనాలు కూడా ప్రారంభం. ఈరోజు నుంచి గోల్కొండ బోనాల ఉత్సవం ప్రారంభం కానుంది. అయితే మన భాగ్యనరానికి ఈ బోనాల సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

Bonalu 2022:   ఆషాఢం (ఆషాడం) అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. ప్రతీఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. బోనం (బోనం) అనేది భోజనం అనే పదానికి వికృతి. మా బిడ్డల్ని , కుటుంబ సభ్యులని మాత్రమే కాకుండా ఊరుమొత్తం చల్లంగ చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి భక్తితో బోనం స‌మ‌ర్పిస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ... పేరు ఏదనేం... తమను చల్లగా చూడాలంటూ ఊరి ప్రజా’లు ఒక శక్తిస్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ. తమ ఇంటికి ఎలాంటి ఆపదా రాకుండా, ఏ కష్టమూ లేకుండా చూడాలని ఆ అమ్మతల్లిని తల్చుకుంటారు. మరి అలాంటి గ్రామదేవతలను ఘనంగా కొల్చుకునేందుకు ఓ సందర్భమే.. బోనాలు.

ఆషాఢమాసం రాగానే తెలంగాణ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు ఒక అనువైన రోజుని ఎన్నుకొంటారు. ఈ రోజున స్త్రీలు రాగి లేదా మట్టికుండలో అమ్మవారి కోసం వంట వండుతారు. చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఉల్లిపాయలు కలిపిన అన్నం.... ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారి కోసం బోనం తయారు చేస్తారు. బోనం ఉన్న కుండని పసుపుకుంకుమలతో అలంకరించి, వేపాకులు చుట్టి... దాని మీద జ్యోతిని వెలిగిస్తారు. ఇలా సిద్ధం బోనాన్ని తలమీద పెట్టుకుని ఊరేగింపు మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయానికి భక్తులను అమ్మవారి ప్రాంగణానికి తీసుకువెళ్లేందుకు పోతురాజు తోడుగా ఉంటాడు.

ఇది కూడా చదవండి:   మీ కాలివేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు..!


బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం అందించడంతో ముగిసిపోదు. గ్రామీణసంబరాలకి సంబంధించిన ప్రతి ఘట్టమూ ఇందులో కనిపిస్తుంది. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాన్ని సమర్పిస్తారు. రంగం పేరుతో అవివాహితులు భవిష్యవాణిని చెప్పే ఆచారమూ ఈ జాతరలో ఉంటుంది. అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించడం, ఆఘటాన్ని నిమజ్జనం చేయడం జ‌రుగుతుంది.

ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి సురటి అప్పయ్య ఆధ్వర్యంలో ఆలయానికి బీజం పడింది. బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసిన అప్పయ్య.. విధుల్లో భాగంగా 1813లో ఉజ్జయినిలో పనిచేస్తున్న సమయంలో అక్కడ కలరా ప్రబలి చాలా మంది చనిపోయారు. అయితే మహమ్మారి మరింతమందిని బలితీసుకోకుండా ఉజ్జయినిలోని అమ్మవారే కాపాడినట్లు భక్తులు నమ్ముతారు.అమ్మవారికి ఆగ్రహం వచ్చిందని భావించిన జనం ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు బోనాల జాతర నిర్వహించారు. తర్వాత నిజాం కూడా బోనాలు అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు ఇచ్చారు. అలా బోనాల సంస్కృతి నిజాం కాలం నుంచి హైటెక్ యుగం వరకు కొనసాగుతూ వచ్చింది.

ఇది కూడా చదవండి: ఈ చిన్న 7 విషయాలను చూస్తే మీరెంతో పుణ్యాత్ములని అర్థమట..


హైదరాబాద్ లో బోనాలు ప్రారంభమైయ్యేది, ముగిసేది గోల్కొండ కోట మీద ఉన్న జగదాంబిక ఆలయంలోనే. గోల్కొండ కోట మీద బోనాలు ప్రారంభం అయిన తర్వాతే తెలంగాణలోని అన్ని ప్రాంతాలు జరుగుతాయి. బోనాల పండగ వస్తుందంటే చాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవారు సైతం నగరానికి చేరుకుంటారు. గోల్కొండ ఎల్మ్మ, సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి... ఇలా ప్రతి కూడలిలోనూ జరిగే బోనాలు భాగ్యనగరానికే... ప్ర‌త్యేక‌త తీసుకువ‌స్తుంది. ఈ ఏడాది జూన్ 30 అంటే ఈరోజు బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రప్రభుత్వం దీనికి సంబంధించిన అన్నీ ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. గోల్కొండ కోటలో పూర్తిస్థాయి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగదాంబిక అమ్మవార్లకు మొదటిబోనం సమర్పించనున్నారు.. 17, 18వ తేదీల్లో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు కాగా, జూలై 24, 25 తేదీల్లో హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నారు.
Published by:Renuka Godugu
First published:

Tags: Bonalu, Bonalu 2021, Telangana Bonalu

తదుపరి వార్తలు