Home /News /astrology /

WHEN SHATTILA EKADASHI CELEBRATED AND WHAT SHOULD OFFER RNK

Shattila Ekadashi: శటిల ఏకాదశి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఒక్క దానం చేసిన వారికి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Shattila ekadashi: పంచాంగం ప్రకారం, మాఘమాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తేదీని శటిల ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీమహావిష్ణువును పూజిస్తారు.

పంచాంగం ప్రకారం, మాఘమాసంలోని (Magha masam)  కృష్ణ పక్షంలోని ఏకాదశి తేదీని శటిల ఏకాదశి (Shattila ekadashi)  అంటారు. శటిల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి, నువ్వులను (Thil)  విష్ణువుకు నైవేద్యంగా సమర్పిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, శటిల ఏకాదశి రోజు నువ్వులను దానం చేయడం వల్ల స్వర్గానికి ద్వారాలు తెరుచుకుంటాయి. నువ్వులను దానం చేసిన వ్యక్తి వేల సంవత్సరాలు స్వర్గంలో స్థానం పొందుతాడు. మహావిష్ణువు (Lord vishnu)  అనుగ్రహం వల్ల ఒక వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. ప్రస్తుత కాలపు పాపాలు, బాధలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం షటిల ఏకాదశి ఎప్పుడు, ముహూర్తం, తిథి, పూజా సమయం ఏమిటో తెలుసుకుందాం?

శటిల ఏకాదశి 2022 తేదీ, ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి తేదీ జనవరి 28 శుక్రవారం నాడు 02:16 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ అదే రాత్రి 23.35కి ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, శటిల ఏకాదశి ఉపవాసం జనవరి 28న చేయాలి.
శటిల ఏకాదశి రోజున తెల్లవారుజామున పూజ చేయవచ్చు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.13 -12.56 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 02.22 -03.05 వరకు ఈ శుభ ముహూర్తం ఉంటుంది.

ఇది కూడా చదవండి: డైమండ్ రింగ్ ధరిస్తున్నారా? ఈ నిజాలు మీకు తెలిసే వాడుతున్నారా?


శటిల ఏకాదశి 2022 పారయణ..
శటిల ఏకాదశి వ్రతం పాటించేవారు జనవరి 29, శనివారం ఉదయం 07.11 నుండి 09.20 గంటల మధ్య పారాయణం చేయవచ్చు. ఈ రోజు ద్వాదశి తిథి రాత్రి 08:37 గంటలకు ముగుస్తుంది.

ఇది కూడా చదవండి:   గరుడపురాణం ప్రకారం ఈ తప్పు చేస్తే.. నరకంలో ఈ కఠినశిక్షలు అనుభవించాల్సిందే!


శటిల ఏకాదశి రోజున నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేస్తారు. ఆ తర్వాత శటిల ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజిస్తానని ప్రమాణం చేస్తారు. పూలు, పండ్లు, అక్షతలు, నువ్వుల లడ్డూలు, పంచామృతం, తులసి ఆకులు మొదలైన వాటిని పూజలో విష్ణువుకు సమర్పిస్తారు. పూజ సమయంలో, శటిల ఏకాదశి వ్రతం వ్రతం చేసి, చివరగా విష్ణువుకు హారతి చేస్తారు.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు