WHEN IS BHISHMASTAMI 2022 SIGNIFICANCE AND IMPORTANCE RNK
Bhishmastami 20221: భీష్మ అష్టమి ఎప్పుడు? తేదీ, ముహూర్తం, ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
Bhishmastami 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఎనిమిదవ రోజున భీష్మ అష్టమి జరుపుకుంటారు. ఈ తేదీనే పితామహుడు భీష్ముడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఎనిమిదవ రోజున భీష్మ అష్టమిని (Bhishmastami) జరుపుకుంటారు. ఈ తేదీనే పితామహుడు భీష్ముడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు. మహాభారత యుద్ధంలో, కౌరవుల తరపున పోరాడుతున్నప్పుడు, భీష్ముడు వీర్గతిని పొందాడు. అతడిని బాణాలతో దాడిచేసినప్పుడు సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు. మత విశ్వాసాల ప్రకారం ఉత్తరాయణంలో మరణించే వారు జీవన్మరణ చక్రం నుండి బయటపడతారు. వారు మోక్షాన్ని పొందుతారు. మకర సంక్రాంతి (Sankranti) రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి మారిన తర్వాత మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు భీష్ముడు తన ప్రాణాల్ని విడిచిపెట్టాడు. ఈ సంవత్సరం భీష్మ అష్టమి ఎప్పుడు అని తెలుసుకుందాం?
భీష్మ అష్టమి 2022 తేదీ, ముహూర్తం..
పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం మాఘ మాస శుక్ల పక్ష అష్టమి తిథి ఫిబ్రవరి 8 మంగళవారం ఉదయం 06.15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఫిబ్రవరి 09, బుధవారం ఉదయం 08:30 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, భీష్మ అష్టమి ఫిబ్రవరి 8 న జరుపుకుంటారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, భీష్మ అష్టమి ముహూర్తం రోజులో ఉదయం 11.29 నుండి మధ్యాహ్నం 1:42 వరకు ఉంటుంది. భీష్మ అష్టమి రోజున ప్రజలు ఏకోదిష్ట శ్రాద్ధం చేస్తారు. ఈ రోజున శ్రాద్ధం చేస్తారు., ఎవరికి అయితే తండ్రి బతికి లేరో, వారు భీష్మ అష్టమి రోజున ఏకోదిష్ట శ్రాద్ధం చేయవచ్చని కూడా నమ్ముతారు.
భీష్మ అష్టమి ప్రాముఖ్యత..
పితామహుడు భీష్మునికి మరణ వరం లభించింది. అతని స్వంత సంకల్పం ఉంటే తప్ప అతడి ప్రాణాల్ని ఎవరూ తీయలేరు. ఈ కారణంగా, అతను తన జీవితాన్ని వదులుకోవడానికి ఉత్తరాయణం తరువాత మాఘ మాసం శుక్ల పక్ష అష్టమి తిథి కోసం వేచి ఉంటాడు.
భీష్మ అష్టమి రోజున, ప్రజలు భీష్మునికి శ్రాద్ధ కర్మలు కూడా చేస్తారు. పితామహుడు భీష్ముడు తన తండ్రికి తగిన కొడుకు, కాబట్టి ప్రజలు కూడా యోగ్యమైన కొడుకు కోసం భీష్మ అష్టమి రోజున ఉపవాసం ఉంటారు.
(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.