హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Sunset: సూర్యాస్తమయం తర్వాత ఈ పని చేస్తున్నారా? అష్టదరిద్రంతో..

Sunset: సూర్యాస్తమయం తర్వాత ఈ పని చేస్తున్నారా? అష్టదరిద్రంతో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

During sunset: సాయంత్ర పూట నిద్రపోకపోవడం, రాత్రిపూట ఇల్లు ఊడ్చకూడదు. గోళ్లు నమలకూడదు. ఇవన్ని సాయం కాలం చేయకూడదు. ఈ నియమాలను అనుసరించకోపేతే.. మీకే నష్టం ఉండవచ్చు. సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు కచ్ఛితంగా చేయకూడదు.

సూర్యాస్తమయం (sunset)  తర్వాత అనుసరించాల్సిన కొన్ని పనులు మన ప్రాచీన కాలం నుంచే ఉన్నాయి. మన పూర్వీకుల కాలం నుంచే వీటిని అనుసరిస్తున్నారు. ఈ విషయాలన్ని హిందూ  పురణాల్లో (hindu shastra) గుర్తించారు. వాస్తు శాస్త్రం కూడా చాలా పనులు ఇలాంటివే నిర్ధారిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం కొన్ని పనులు చేయకూడదు. ఆ వివరాలు తెలుసుకుందాం.

గోర్లు, జుట్టు కత్తిరించడం..

సూర్యాస్తమయం (sunset)  తర్వాత గోళ్లు, జుట్టు కత్తిరించకూడదు. అంతేకాదు, షేవింగ్‌ కూడా చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అప్పులు పెరుగుతాయని కూడా నమ్ముతారు.

చెట్లను నరకడం.. నీరుపోయడం..

సూర్యాస్తమయం తర్వాత చెట్లను తాకకూడదు. లేదా వాటి ఆకులు తెంపకూడదు. రాత్రిపూట చెట్టకు నీరు పోయకూడదు అని కూడా నమ్ముతారు. సూర్యాస్తమయం తర్వాత చెట్లు, మొక్కలు నిద్రపోతాయి.

ఇది కూడా చదవండి:  ధన్‌తేరాస్‌ రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. లక్ష్మీకటాక్షం!

బట్టలు ఉతకడం లేదా ఆరవేయడం..

సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం కూడా నిషేధించారు. అంతేకాదు సాయంత్రం తర్వాత బట్టలు ఆరబెట్టడం కూడా తప్పుగా పరిగణిస్తారు. అలా చేయడం వల్ల దుష్ట స్వర్గపు శక్తులు దుస్తుల్లోకి ప్రవేశిస్తాయి. వాటిని ధరించడం వల్ల అనారోగ్యాల పాలవుతారు.

మూత లేని ఆహారం..

సూర్యాస్తమయం తర్వాత ఆహారం లేదా నీరు తెరిచి ఉంచకూడదు. వాటిని ఎప్పుడు మూత పెట్టాలి. అలాగే వదిలేస్తే.. చెడు శక్తిని అది గ్రహిస్తుంది.అలాంటి ఫుడ్‌ తింటే ఆరోగ్యం పాడవుతుంది.

ఇది కూడా చదవండి: నాగుల చవితి.. పూజకు సరైన సమయం..విధానం!

అంత్యక్రియలు..

సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల మరణించినవారు పరలోకంలో బాధపడాల్సి వస్తుంది. వారు వచ్చే జన్మలో దివ్యాంగులుగా పుడతారని నమ్మకం.

పెరుగు లేదా అన్నం..

సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినడం పురాణాల్లో నిషిద్ధం. అదేవిధంగా సూర్యాస్తమయం తర్వాత అన్నం కూడా తినరు.

పెరుగు దానం..

పెరుగు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. శుక్రుడు సంపద, కీర్తిని ఇచ్చేవాడుగా పరిగణిస్తారు. ఈ సందర్భంలో సూర్యాస్తమయం సమయంలో పెరుగు దానం చేయడం వల్ల సంతోషాలు దూరమవుతాయి.

ఇల్లు శుభ్రం..

సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టం వస్తుంది.

సాయంత్రం నిద్ర..

సూర్యాస్తమయం తర్వాత పడుకోవద్దు. ఈ సమయంలో సెక్స్‌ కూడా నిషిద్ధంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల దంపతుల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.

First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు