హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Bathukamma 2022: ఆరవరోజు అలిగిన బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

Bathukamma 2022: ఆరవరోజు అలిగిన బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bathukamma 2022: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలవుతుంది. దీన్ని 9 రోజులపాటు జరుపుకుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Bathukamma 2022: బతుకమ్మ (Bathukamma) పండుగ ఆశ్వీయుజశుద్ధ అమావాస్యనాడు మొదలవుతుంది. దీన్ని 9 రోజులపాటు జరుపుకుంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఇది నవరాత్రుల (Navaratri) కి ముందు రోజు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ పండుగను చాలా వేడుకగా జరుపుకుంటారు.

బతుకమ్మ తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ వర్షాకాలం చివరిలో శీతాకాలం తొలిరోజుల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలకు చెరువులన్నీ నిండి రంగురంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. ఇందులో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాదు, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం.

ఇది కూడా చదవండి: Bathukamma 2022: బతుకమ్మ 5వ రోజు ప్రత్యేకమైందని తెలుసా?

మహిళలు తొమ్మిది రోజులు బతుకమ్మను తయారు చేస్తారు. సద్దుల బతుకమ్మ రోజున బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను వెనక్కి తీసుకుని, మహిళలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటారు. మహిళలు దుస్తులు ధరించి పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ నృత్యాలు చేస్తారు.

తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేధ్యంగా పెడతారు. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే...

1) ఎంగిలి పూల బతుకమ్మ 2) అటుకుల బతుకమ్మ, 3) ముద్దపప్పు బతుకమ్మ 4) నానే బియ్యం బతుకమ్మ 5) అట్ల బతుకమ్మ..6) అలిగిన బతుకమ్మ..

ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు.

7) వేపకాయల బతుకమ్మ.. 8) వెన్నముద్దల బతుకమ్మ.. 9) సద్దుల బతుకమ్మ..

ఆరో రోజు 'అలిగిన బతుకమ్మ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని, అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు. అప్పటి నుంచి ఈ రోజును 'అలిగిన బతుకమ్మ'గా పిలుస్తారు.

ఇది కూడా చదవండి: దుర్గామాత 8 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి?

ఈ పండుగ పువ్వుల స్పష్టమైన వినియోగానికి ప్రసిద్ధి చెందినప్పటికీ, బతుకమ్మ తయారీకి మొక్కల ఔషధ గుణాల గురించి భారతదేశ పురాతన జ్ఞానంతో చాలా సంబంధం ఉందని నిపుణులు సూచించారు. సాంప్రదాయకంగా, స్థానికంగా పెరిగే పూలతో బతుకమ్మలను తయారు చేస్తారు. అలాగే, ప్రతి బతుకమ్మలో కొన్ని పువ్వులు ఉంటాయి. గునుగు పువ్వు (సెలోసియా), తంగేడు పువ్వులు (కాసియా ఆరిక్యులాట), గుమ్మడి పువ్వులు (కుకుర్బిటా), వామ పువ్వులు (అజ్వైన్), బంతి పువ్వు (మేరిగోల్డ్), చామంతి పువ్వు (క్రిసాన్తిమం) మొదలైనవి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Bathukamma, Bathukamma 2022

ఉత్తమ కథలు