హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri puja: నవరాత్రి 9వ రోజు అమ్మవారి అలంకరణ ఏంటి? నైవేధ్యం, రంగు వస్త్రం..

Navaratri puja: నవరాత్రి 9వ రోజు అమ్మవారి అలంకరణ ఏంటి? నైవేధ్యం, రంగు వస్త్రం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. అయితే 9వ రోజు అమ్మవారి అలంకరణ ఏంటో నైవేధ్యం ఏం పెట్టాలో తెలుసుకుందాం..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు.నవరాత్రులు (Navaratri) దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రుల్లో దుర్గామాత (Durga maata) పెద్ద విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తారు.

అమ్మను అలంకరించే విధానం..

ముందు కింద ఏదైన గుడ్డ పరచి పీటను ఏర్పాటు చేసుకుని దాని ఒక కంచెం పెట్టి అందులో ఒక కలశం పెట్టుకోవాలి. ఈ చెంబులో కొంచెం నీరు, పసుపు,కుంకుమ, అక్షితలు, పూలు వేసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని.. బ్లౌజ్‌ ముక్కతో చీర మాదిరి కట్టించాలి. అమ్మవారికి పూర్తి అలంకరణ చేయాలి.

ఇది కూడా చదవండి: సద్దుల బతుకమ్మ .. చాలా ప్రత్యేకమైందని తెలుసా? 

ఇక అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు. ఏ రంగు అమ్మవారిక ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి.. వాటి ఫలితాలు ఏంటి..? దాన్ని అనుసరించి తెలుసుకుందాం.నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక శ్రీ దేవి శరన్నవరాత్రులు అంటే ఇంకా ప్రత్యేకంగా నిలుస్తాయి..

ఇది కూడా చదవండి:  నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారి అలకంరణ పూజావిధానం.. నైవేధ్యం..

9వ రోజు.. అశ్వీయుజ నవమి

అక్టొబర్ 4వ తేదీ.. తొమ్మిదవ రోజు.. మహిషాసురమర్ధిని గా అమ్మవారు దర్శనం ఇస్తారు. ఆ రోజు దేవికి నీలం రంగు, ముదురు ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఇది యుద్ధానికి సంకేతం. ఇది ధరించి మహిషాసురుని సంహరించింది. చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక శ్రీ దేవి శరన్నవరాత్రులు అంటే ఇంకా ప్రత్యేకంగా నిలుస్తాయి..

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

First published:

Tags: Dussehra, Dussehra 2022

ఉత్తమ కథలు