Scorpio Horoscope 2023: నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తారు. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 21వ తేదీల మధ్య జన్మించిన వారికి వృశ్చిక రాశి వర్తిస్తుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం 2023 వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? రిలేషన్, కెరీర్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు ఎదుర్కొంటారు? అనే విషయాలు తెలుసుకోండి.
జనవరి:
కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా అమలు కావు. దగ్గర వారి కారణంగా ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. ఆర్థిక పురోగతి బాగుంటుంది. ఒంటరిగా ఉన్న వారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి.
రిలేషన్: చిన్ననాటి స్నేహితుల్లో ఒకరు మీ పట్ల ఆసక్తి చూపిస్తారు. అన్ని విషయాలు అవతల వ్యక్తే చెప్పాలని అనుకోవద్దు. ఈ విషయంలో మీ కుటుంబం జోక్యం చేసుకుంటే మీ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కెరీర్: మీ పని వాతావరణంలో అన్నీ అనుకూలంగా ఉంటాయి. చిక్కు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీ దృష్టి, ఏకగ్రత సానుకూల ఫలితాలను అందిస్తాయి.
లక్కీ కలర్: సీయాన్(Cyan).
ఫిబ్రవరి:
మీ పనిలో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం మీ సీనియర్లు సలహాలు అందుతాయి. మీ అవసరాలకు సహకరిస్తూ మిమ్మల్ని అర్థం చేసుకునే సహచరులతో కలిసి పని చేయడం మీ అదృష్టం. మీరు పెట్టుబడులు పెట్టాలంటే పూర్తి మార్గ నిర్దేశం పొందిన తర్వాతే పెట్టండి. ఆరోగ్యం పట్ల దృష్టి సారించండి.
రిలేషన్: ప్రస్తుత బంధంలో కొంత గందరగోళం నెలకొనవచ్చు. మీరు గమనించనప్పటికీ ఇది కొద్ది కాలం నుంచి జరుగుతున్న విషయం. ఒకవైపు వాదనలే నమ్మలేం కాబట్టి, నిజాలు తెలుసుకోండి.
కెరీర్: ఉద్యోగంలో బదిలీ మీకు కొత్త ఉత్తేజాన్ని తీసుకువస్తుంది. దీని తర్వాత మీరు ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. మీ సహ ఉద్యోగి మీ దృక్పథాన్ని మార్చి మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు.
లక్కీ కలర్: మెజంట(Mejanta)
మార్చి:
కొంతకాలంగా వెనక్కి లాగుతున్న విషయం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేలా సులభంగా సాధిస్తారు. ఒక ఆశాజనకమైన వ్యాపారవేత్త మంచి ఆఫర్‌తో మిమ్మల్ని సంప్రదిస్తారు. సందేహాలు మీ పని వేగాన్ని తగ్గిస్తాయి. మీ బడ్జెట్లో ఒక సోలో ట్రిప్ ఉంది. ఒక ప్రాజెక్ట్ ఐడియా ముందుకు తీసుకెళ్లడానికి మీకు మరింత ఉత్తేజం లభిస్తుంది.
రిలేషన్: విశ్వాసం లేని వ్యక్తులతో మీ బంధాన్ని స్థిరంగా నడుపుతున్నప్పటికీ జాగ్రత్త అనేది అవసరం. మీరు మీ సహనాన్ని కోల్పోతుంటే, కొంత విరామం తీసుకోవడం మంచిది.
కెరీర్: మంచి ఉద్యోగ వాతావరణంలో మీ పనితీరు బయటపడుతుంది. అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వారి వల్ల మీరు ప్రశాంతత కోల్పోతారు. ఫారెక్స్ సంబంధిత వ్యాపారం లేదా వాణిజ్య వ్యాపారం మీకు కలిసి వస్తుంది.
లక్కీ కలర్: ఆక్వా మెరైన్ బ్లూ(Aqua Marine Blue)
ఏప్రిల్:
గతంలో ఉన్నంత ఉత్సాహంతో మీరు పనిచేయలేరు. ప్రస్తుతం మీ అంతరంగిక పరిశీలన అవసరం. గతంలో మీ కుటుంబంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఇప్పుడు ఉండవు. గతంలో మీరు చేసిన పనులు మిమ్మల్ని వెలుగులోకి తీసుకువసస్తాయి. పునరుత్తేజం పొందడానికి బయట ప్రదేశాలకు వెళ్లడం అవసరం. మీ అంతర్గత పరిణామానికి మీరు ఆశ్చర్యపోతారు.
రిలేషన్: పైకి అంత బాగానే ఉంటుంది. కొత్తగా మీ మనసులో ప్రేమ గురించిన ప్రభావం పడుతుంది. వారితో మీ ప్రాధాన్యతల గురించి చర్చించడం ఆపేయండి.
కెరీర్: ప్రస్తుతం మీరు అనుకున్నంత స్థాయిలో లేరని బాధపడవచ్చు కానీ ముందు ముందు అది మారుతుంది. పని ఒత్తిడి కాస్త ఇబ్బంది పెడుతుంది. మీరు రైటర్ అయితే త్వరలో మంచి వార్తలు వింటారు.
లక్కీ కలర్: మహోగని(Mahogany).
మే:
మీరు వ్యాపారం గురించి కలలు కంటుంటే ఇప్పుడే దాన్ని ప్రారంభించి ముందుకు తీసుకువెళ్లండి. మీ శ్రేయోభిలాషులకు కూడా మీకు సహరించడానికి ముందుకు వస్తారు. మంచిగా ప్రారంభిస్తే సగం పని పూర్తయినట్లే. కుటుంబంలో కలహాలు వల్ల కుదురు లేకుండా పోతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. షాపింగ్ కి వెళ్తే ఉత్సాహం వస్తుంది.
రిలేషన్: మీకు దగ్గరలోని యుక్త వయస్కులు మీ పట్ల ఆకర్షితులవుతారు, ఆ విషయం మీకు కూడా వింటారు. ఇబ్బందికర పరిస్థితి నుంచి తప్పించుకుంటారు. ఒక చిన్న గొడవ పెద్దవాదనకు దారితీస్తుంది.
కెరీర్: కొత్త దిశలో వెళ్లడానికి మీరు పునరాలోచించుకుంటారు. మీ సొంత ఐడియాలను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను కూడా నిర్వహిస్తారు.
లక్కీ కలర్: ముక్కుపొడుం(Brown)
జూన్ :
నిలకడగా కాకుండా కదలికలతో కూడిన ప్రణాళిక అవసరం. మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే దానికోసం ఇప్పటి నుంచే ప్రయత్నించాలి. ఎక్కువ మంది వ్యక్తులతో మీరు కలిసి పని చేయాల్సి ఉంటుంది. మీకు కుటుంబం మద్దతు లభిస్తుంది.
రిలేషన్: మీ భాగస్వామి నుండి సరైన మద్దతు లభిస్తుంది. మీకు సన్నిహితంగా ఉండేవారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. జాగ్రత్తగా ప్లాన్ చేసిన కొన్ని జరగకపోవచ్చు.
కెరీర్: మీ ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే, బయటివారితో ఎటువంటి వివరాలు పంచుకోవద్దు. మీరు అనవసరమైన దూకుడును నియంత్రించుకోవాలి. మీ పాత సహ ఉద్యోగి మీకు ఉపయోగపడతాడు.
లక్కీ కలర్: బ్లూ(Blue)
జులై :
మీ పనిలో భావోగ్వేదాలను కలపవద్దు, ఎందుకంటే మీరు తప్పు ఎప్పుడు చేస్తారని ఎదురు చూసే వ్యక్తులు ఉన్నారు. మీకు ముందులో సహకరించిన వారు ఇప్పుడు ఆ విధంగా లేరు. స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు చెప్పే మాట వినండి.
రిలేషన్: మీ వ్యక్తిగత జీవితంలో కొందరు మీరు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకుంటారు. ఆరోగ్యమైన వాదన పరిస్థితిని చక్కబడుతుంది. ఏ విషయమైనా స్పష్టంగా తెలియజేయండి.
కెరీర్: మీ పనిని నిరూపించుకోవడానికి ఒక అవకాశం రావచ్చు. మీకోసం ప్రత్యేకంగా ఒక పాత్ర సృష్టించబడుతుంది. పనిలో పోటీ ఉన్నప్పుడు తొందరపాటు పనికిరాదు.
లక్కీ కలర్: పగడపు ఎరుపు (Coral Red)
ఆగస్టు :
గతంలో మీరు తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ పరిస్థితులు దానికి తగ్గట్టు ఉండవు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. ఎన్నాళ్లనుంచో చేస్తున్న పనులు ఇప్పుడు కొలిక్కి వస్తాయి. ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
రిలేషన్: రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది ఇతరులకు ఉన్నంత సులువుగా మీకు ఉండదు. అపార్ధాలు తలెత్తవచ్చు, ఇబ్బందికర పరిస్థితి రావచ్చు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి సుదీర్ఘకాలం మీతో ఉంటారు.
కెరీర్: మీరు సాధించాలనుకున్నది నెరవేరక పోవచ్చు కాబట్టి మీ ఆశయం దెబ్బతినే అవకాశం ఉంది. కొంతమంది స్నేహితులు మీతో పార్ట్‌నర్‌షిప్ కోసం వస్తారు.
లక్కీ కలర్: ఎమరాల్డ్ గ్రీన్ (Emerald Green).
సెప్టెంబర్ :
ఇన్నాళ్లు చెల్లాచెదురుగా ఉన్న విషయాలన్నీ ఇప్పుడు కలిసి వస్తాయి,ఇది మీకు ఉపసమనంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్ గ్యాప్ ని సరి చేస్తారు. మీకు ముందస్తు కాలంలో ఉపయోగపడే ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. మీ అభిప్రాయాలను చెప్పడానికి సంకోచించవద్దు. ఇది కూడా ప్రశంసలను అందిస్తుంది. ఒక ముఖ్యమైన సమావేశానికి మీకు ఆహ్వానం అందుతుంది.
రిలేషన్: పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. దెబ్బతిన్న సంబంధాలు కూడా కలిసే అవకాశం ఉంది. మీ భాగస్వామి చాలాకాలం నాటి విషయాలను మీకు తెలియజేస్తారు. మీ మధ్య కొత్త బంధం ఏర్పడుతుంది.
కెరీర్: మీరు ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు మీ సొంతం అవుతుంది. కొత్త అవకాశాలు ఉంటే అందరికంటే ముందు మీకు తెలుస్తుంది. స్పోర్ట్స్‌లో కూడా మీరు రాణించగలరు.
లక్కీ కలర్: క్యానరీ ఎల్లో( Canary Yellow).
అక్టోబర్ :
మీరు మీ నిజాయితీలతో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తారు. కారణం లేకపోయినా మీ చుట్టూ ఉన్న వారితో మాట్లాడటం మంచిది. నీ స్నేహపూర్వక వైఖరి మీకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది. ప్రతి పని చేయడానికి పూనుకోకండి ఎందుకంటే ఇది ఆలస్యానికి దారితీస్తుంది. మీ ఇంట్లో పెద్దవారు మీతో మాట్లాడడానికి చూస్తున్నారు. మీరు బలవంతంగా కొన్ని కొన్ని సార్లు వంట గదిలో వంట చేస్తూ గడపాల్సి వస్తుంది.
రిలేషన్: మీరు అవతలి వ్యక్తుల నుండి కొంత కోపాన్ని ఆందోళనని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి మీ కుటుంబంలో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మీరు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న వ్యక్తి పట్ల ప్రేమను ఒప్పుకోవడం మంచిది.
కెరీర్: గతంలో జరిగిన పొరపాట్లను మర్చిపోండి. భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంటర్వ్యూ కి అటెండ్ అయితే మీ వైఖరికి కట్టుబడి ఉండండి.
లక్కీ కలర్: టాన్జరిన్ (Tangerine).
నవంబర్ :
మీరు బయట తిరగడానికి ప్రాధాన్యత ఇస్తుంటే దాన్ని నిలువరించాల్సిన సమయం వచ్చింది. ప్రస్తుతం మీరు ఎంజాయ్ చేయవచ్చు కానీ అది మీ పని ప్రదేశం మీద ప్రభావం చూపుతుంది. మీకు రాయడం ఇష్టం అయితే దానిపై ఇప్పుడు దృష్టి సారించండి. సృజనాత్మకత ఉన్నవారు కొత్త అవకాశాలను పొందుతారు. డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి.
రిలేషన్: ఎక్కువ సమయాన్ని మీ అనుకున్న వారితో కలిసి ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. మీ భాగస్వామితో మీ బంధాన్ని బలపరుచుకుని మీ జీవితంలో భాగం చేసుకోవాలి. అసలు మాటలు లేకపోవడం కూడా మంచిది కాదు.
కెరీర్: విజ్ఞానాన్ని పెంచుకునేందుకు నైపుణ్యాలను సరి చేసుకోవడానికి ఇది సరైన సమయం. మీ జూనియర్ మీ సహాయాన్ని, ప్రమేయాన్ని కోరుతారు.
లక్కీ కలర్: మిడ్ నైట్ బ్లూ (Midnight Blue)
డిసెంబర్ :
మీకు అనేక టెక్నిక్స్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించే అవకాశం కావాలి. మీ వల్ల ఇతరుల భావోద్వేగాలు దెబ్బతింటాయి. మీరు ఈరోజు ఉన్న స్థితికి ఎంతో శ్రమపడి ఉండవచ్చు. కానీ మీ అంతర్గత ఆలోచనలను మెరుగుపరుచుకోవాలి. మీరు సంపద కూడగట్టిన మెరుగైన జీవన విధానాన్ని అనుసరించిన కానీ అనుకున్న ప్రతిదీ సాధించలేరు. మీరు జీవితంలో అనుకున్నది సాధించడానికి చాలా దూరం ప్రయాణించాలి. నిర్మాణాత్మక విమర్శలను స్వాగతించండి.
రిలేషన్: మీ ఇబ్బందికర అలవాట్ల వల్ల మీ భాగస్వామి విసుగు చెందుతారు. దాని గురించి మీరు ఆలోచించాలి. త్వరలో మీకు ఒక సంకేతం అందుతుంది, దాన్ని అనుసరించి మీ బంధాలను చక్కదిద్దుకోండి.
కెరీర్: విదేశాలలో పనిచేసే అవకాశం వస్తుంది. దాన్ని వదులుకోవడం మంచి నిర్ణయం కాదు. జీవితంలో, పని వాతావరణంలో సానుకూలత ఉంటుంది. పదోన్నతులు ఉన్నాయి.
లక్కీ కలర్: వైలెట్ (Violet)
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Horoscope, New Year 2023, Scorpio