Dream revelation in relationship: కలలో మీ భాగస్వామితో విడిపోతే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

Dream revelation: ప్రతికల దాని స్వంత అర్థాన్ని కలిగి ఉంటుందని చెప్పడం తప్పు కాదు. మీ భాగస్వామితో సరదాగా గడపాలని లేదా వారిని మోసం చేయాలని మీకు కల వస్తే.. వీటికీ ఓ అర్థం ఉంటుంది.

  • Share this:
ప్రతిరోజూ మనకు ఏదో ఒక కల (Dream) వస్తుంది. అందులో కొన్ని మనకు నచ్చినవి.. మరికొన్ని నచ్చనివి. కొన్ని గుర్తుంటాయి.. మరి కొన్ని ఉదయం లేచే సరికే మర్చిపోతాం. ఒక్కోసారి మనం రోజంతా ఆలోచించినా విషయాలు కలలోకి వస్తాయి. కొన్ని ఆలోచించకుండానే వస్తాయి. ప్రతి ఒక్కరూ వారి కలలకు అర్థం ఏంటని తెలుసుకోవాలనుకుంటారు. కానీ, ప్రతి ఒక్క కలకు సమాధానం పొందడం అంత ఈజీ కాదు. వాస్తవానికి, కలలపై చాలా పరిశోధనలు జరిగాయి. ఈ కలలు మన జీవితాలతో సంబంధం కలిగి ఉన్నాయని నిర్ధారించాయి.

కాబట్టి మన చట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించే కలల ప్రపంచం ఉందని, ప్రతికల దాని స్వంత అర్థాన్ని కలిగి ఉంటుందని చెప్పడం తప్పు కాదు. మీ భాగస్వామి (partner) తో సరదాగా గడపాలని లేదా వారిని మోసం చేయాలని మీకు కల వస్తే.. వీటికీ ఓ అర్థం ఉంటుంది. అయితే, భాగస్వామికి సంబంధించిన కొన్ని కలలు వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం.

మాజీ ప్రయుడు..
మీ కలలో మీ మాజీ ప్రియుడిని చూసినట్లయితే, మీ ప్రస్తుత రిలేషన్‌తో సంతృప్తిగా లేరని అర్థం. మీరు గందరగోళంలో ఉన్నారు. మీ మనస్సులో ప్రస్తుత భాగస్వామి కాకుండా మరొకరి కోసం వెతుకుతున్నారు.

ఇది కూడా చదవండి:  స్క్రీన్‌ వర్క్‌ ఎక్కువై.. మెడనొప్పి వస్తోందా? ఇలా ఈజీగా..!

భాగస్వామిని మోసం చేయడం..
మీరు కలలో మీ భాగస్వామిని మోసం చేసినట్లు వస్తే.. మీ రిలేషన్‌ను విశ్వసించడం లేదని అర్థం. మీరు దేనికోసమో భయపడుతున్నారు. అభద్రతా భావంతో ఉన్నారని అర్థం.

ప్రేమ..
మీ భాగస్వామిని ప్రేమించాలని కలలు కంటే..పూర్తిగా మీ భాగస్వామితో సంతోషంగా ఉన్నారని అర్థం. మీకు అతని ప్రేమ కావాలి. అతనితో సంతోషంగా ఉండండి. అంటే మీకు మీ భాగస్వామి ప్రేమ కావాలి.

కలలో విడిపోవడం..
మీ సంబంధం విడిపోతున్నట్లు మీరు కలగన్నట్లయితే.. అది కొన్నిసార్లు మరేదైనా ముగింపునకు సంకేతం కావచ్చు. కానీ, నిజంగా విడిపోయాక ఈ కల కంటే.. మీరు ఆ బ్రేకప్‌ను ఇంకా అంగీకరించలేకపోయారని అర్థం.

ఇది కూడా చదవండి:  మీ పిల్లలు హైట్‌ పెరగటానికి ఈ యోగా టిప్స్‌!

ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలు లేదా అమ్మాయిలతో డేటింగ్‌ చేస్తున్నట్లు కల వస్తే.. మీ సంబంధంలో మీరు సంతోషంగా ఉన్నారు కానీ, సంతృప్తిగా లేరని అర్థం. ఇప్పటి వరకు మీ రిలేషన్‌షిప్‌ అంచనాల మార్పులపై గందరగోళంగా ఉన్నారని కూడా అర్థం చేసుకోవచ్చు.

వివాహం కావాలని..
మీరు మీ పెళ్లి చేసుకోవాలని కలలుకంటున్నట్లయితే.. మీ సంబంధం దాన్ని కొత్త లెవల్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈ కల జీవితంలో మంచి మార్పునకు సంకేతం కావచ్చు.
Published by:Renuka Godugu
First published: