హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri 2022: నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం..

Navaratri 2022: నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Navaratri 2022: దేశవ్యాప్తంగా మనం అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండగ దసర. ఈ రోజు విజయానికి ప్రతీక.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Navaratri 2022:  దేశవ్యాప్తంగా మనం అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండగ దసర. ఈ రోజు విజయానికి ప్రతీక. అందుకే విజయ దశమి అంటారు. ముఖ్యంగా ఈరోజు జమ్మి చెట్టు దర్శనం చేస్తాం.

హిందువులకు ప్రధాన పండగ విజయదశమి (vijaya dashami) . దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. దసరాగా పిలవబడే ఈ పర్వదినాల్లో అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు. నవరాత్రుల్లో ( Navaratri) దేవిని పూజిస్తే.. పదిజన్మల పాపం పోతుందని నమ్మకం.

ఇది కూడా చదవండి: నవరాత్రి 5వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం..పూజావిధానం..

అమ్మను అలంకరించే విధానం..

ముందు కింద ఏదైన గుడ్డ పరచి పీటను ఏర్పాటు చేసుకుని దాని ఒక కంచెం పెట్టి అందులో ఒక కలశం పెట్టుకోవాలి. ఈ చెంబులో కొంచెం నీరు, పసుపు,కుంకుమ, అక్షితలు, పూలు వేసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని.. బ్లౌజ్‌ ముక్కతో చీర మాదిరి కట్టించాలి. అమ్మవారికి పూర్తి అలంకరణ చేయాలి.

ఇక అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు. ఏ రంగు అమ్మవారిక ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి.. వాటి ఫలితాలు ఏంటి..? దాన్ని అనుసరించి తెలుసుకుందాం.నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు.

ఇది కూడా చదవండి: Bathukamma 2022: బతుకమ్మ 8వ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా?

7వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ సప్తమి..

అక్టోబర్ 02వ తేదీ.. ఏడో రోజు అమ్మవారు సరస్వతిదేవిగా అలంకరిస్తారు. తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై ఉంటుంది. ఈ దవళవస్త్రం మానసిక పరిపక్వతతోపాటు సకల విద్యలకు నిదర్శనం. దద్దోజనం, కేశరి నైవేద్యంగా పెట్టాలి. పిల్లలకు చదువు బాగా రావాలని ఈ నైవేద్యం పెడతారు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Dussehra, Dussehra 2022

ఉత్తమ కథలు