సాధారణంగా మనం ఏ రోజున పుడితే.. ఏం జరుగుతుందో.. ఐశ్వర్యం కలిసి వచ్చే అంశాలు ఏంటో అనే సందేహం ఉంటుంది. అయితే, బుధవారం (Wednesday) పుట్టినవారికి కలిసి వచ్చే అంశాలు ఏంటో తెలుసుకుందాం. బుధవారానికి సంఖ్యా శాస్త్రంలో 5కు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈరోజు పుట్టినవారు (Born) ఏవరైనా సరే.. కొత్త పనులు ఏవైనా మొదలు పెట్టాలనుకుంటే.. విజయం సాధించాలంటే.. ప్రతి నెల 5వ తేదీ మొదలు పెట్టాలి. వీరికి ఐదు నంబర్ బాగా కలిసి వస్తుంది. వాహనాలు కొన్నా.. మొత్తం నంబర్లు కలిపితే 5 సంఖ్య వస్తే.. మంచిది. వీరి లక్షణాలు పరిశీలించినట్లయితే.. వీరు అఖండ మేధావిలు.
ఏ సమస్య అయినా..సులభంగా పూర్తి చేశారు. చాలా మంది క్లిష్టమైన పనులును రోజుల తరబడి సమయం తీసుకుంటారు. కానీ, బుధవారం పుట్టినవారు చిటికెలో పూర్తి చేస్తారట. అటువంటి శక్తిసామర్థ్యాలు కలిగి ఉంటారట. ఇక ప్రతీది కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. ధనాన్ని సంసాదించడానికి కూడా వివిధ మార్గాలను అన్వేశించి సాధిస్తారట. అయితే, వీరు ఎంత ధనాన్ని ఆర్జించినా.. వృథాగా ఖర్చు చేస్తారు. కాబట్టి ధనం ఖర్చు చేయడంలో అప్రమత్తంగా ఉండాలి. వీరు ఏవరైనా..పొగిడితే.. పొంగిపోతారు.. పరవశించిపోతారు. వారి కోసం ఏమైనా చేసే.. ప్రత్యేక లక్షణం కలిగి ఉంటారు. ఇక బుధవారం పుట్టిన వారు ఎవరి వద్ద పని చేసినా.. వ్యాపారం చేసినా.. ఆ సంస్థకు పేరుప్రఖ్యాతలు రాబట్టే ప్రయత్నం చేస్తారు.
వీరు ఎవరి వద్ద పనిచేసినా వారి బిజినెస్ మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. వీరికి డబ్బు అయిపోయినప్పటికీ, అవసరానికి కచ్ఛితంగా డబ్బు అందుతుంది. ఈరోజు పుట్టినవారు గణిత శాస్త్ర రంగంలోకి ప్రవేశిస్తే.. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వీళ్లు షేర్లలో డబ్బులు పెడితే మంచి విజయాలు సాధిస్తారు. అంటే వీరికి స్పెక్యూలేషన్ బాగా కలిసి వస్తుంది. అయితే, వీరికి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు.
అందుకే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే వీరికి ఎప్పుడు డబ్బు చేతిలో ఉండాలి అంటే.. బుధవారానికి అధిపతి అయిన మహా గణపతిని పూజించాలి. అంటే రోజుకు కనీసం 11 సార్లు ‘ఓం గం గణపతిౖయె నమాః’ అని జపించి వారి పనుల్లో ముందుకు సాగిపోవచ్చు. తప్పకుండా వీరికి గణపతి ఆశీర్వాదం వల్ల అషై్టశ్వర్యాలు కలిసి వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, New born baby