Palmistry: మీ అరచేతిలో ‘X’ అక్షరం గుర్తు ఉందా?

Palmistry

Palmistry: ఎవరైనా  ద్రోహం చేస్తే.. 'X' గుర్తు ఉన్న వ్యక్తులు ప్రతీకారం తీర్చుకుంటారు. అంతేకాతు వీళ్లు మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు.

  • Share this:
హస్తసాముద్రిక శాస్త్రం (Palmistry) ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇప్పటికీ దీన్ని నమ్మేవారు ఉన్నారు. అయితే, నేటితరంలో వ్యక్తి దృష్టి రేఖను చూసి చెప్పేవారు కూడా ఉన్నారు. పూర్వం రాజులు, రాణులు రాజ్యం భవిష్యత్తుతోపాటు తమ భవిష్యత్తు (future) ను కూడా తెలుసుకునేవారు. అరచేతుల గీతలు అందరికీ ఒకేలా ఉండవు. అదేవిధంగా మీ చేతిలో ఒక గుర్తు ఉంటే..దానర్థం ఏంటో తెలుసా?

అర చేతుల్లో గీతలు అడ్డదిడ్డంగా ఉంటాయి. అయితే, కొన్ని నిర్ధిష్ట రేఖలు నిజంగా మీ జీవితంలో అనేక అంశాలను సూచిస్తుంది. అది మీ పనులను, ఆలోచనా సామార్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ గీతలు మీ వ్యక్తిత్వానికి సంబంధించినవి. అందువల్ల ఇది వివాహం (marriage), కెరీర్, సంపద, ఆరోగ్యం మొదలైన అంశాలను నిర్ణయించవచ్చు.

ఇది కూడా చదవండి: ‘స్క్విడ్‌ గేమ్‌’లోని ఈ కాస్ట్యూమ్స్‌ కోసం తెగ వెతుకుతున్నారట!

ఈ గుర్తు అలెగ్జాండర్‌ చేతిలో ఉంది...
'X' ఆకారం రేఖ మీ అరచేతుల్లో ఉంటే.. మీరు అదృష్టవంతులు. ఈ లైన్‌ ప్రపంచ జనాభలో కేవలం 3 శాతం మందికి మాత్రమే ఉంటుంది. మీ రెండు చేతుల్లో రెండు సమాంతర వక్రరేఖల మధ్య ఈ గుర్తు ఉంటే.. అది విజయానికి సంకేతం. అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ అరచేతిలో 'X' అక్షరం ఉండేదని పురాతన నివేదికలు చెబుతున్నాయి. కొంతమంది వ్యక్తుల్లో ఈ గుర్తు చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి:  గాజు బాటిల్‌ల్లోని నీరు తాగితే.. ఏమవుతుందో తెలుసా?

పరిశోధన..
దీనికి సంబంధించి మాస్కో విశ్వవిద్యాలయం ఎస్‌టీఐకి చెందిన పరిశోధకుడు అరచేతులపై 'X' అక్షరంతో పరిశోధన నిర్వహించారు. అతను ప్రజల జీవితాలను, గమ్యాలను అధ్యయరం చేశాడు. ఇదే జరిగితే..అరచే తి గుర్తులు నిజంగా గొప్పవి, మనిషి జీవితానికి ముడిపడి ఉన్న చాలా ముఖ్యమైనవి.
అరచేతుల్లో ఈ గుర్తు ఉన్నవారు చాలా విజయవంతమవుతారు. మంచివారు, ప్రసిద్ధులు అవుతారు. ఒకవేళ వారి రెండు అరచేతులపై 'X' అక్షరం ఉంటే.. వారు చనిపోయిన తర్వాత కూడా పేరుప్రఖ్యాతలు పొందుతారు. ఈ గుర్తు సంపద, విజయాన్ని, శ్రేష్టతను సూచిస్తుంది. ప్రెసిడెంట్‌ అబ్రహం లింకన్, ప్రెసిడెంట్‌ వ్లాదిమర్‌ పుతిన్‌ ఈ అరుదైన గుర్తు ఉన్నవారే.

ఈ వ్యక్తులు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వారు తెలివైన, సహజమైన, షార్ప్, దయకలిగినవారు. వీరు శక్తి, అధికారాన్ని ప్రసరించే బలమైన లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఎవరైనా  ద్రోహం చేస్తే.. 'X' గుర్తు ఉన్న వ్యక్తులు ప్రతీకారం తీర్చుకుంటారు. అంతేకాతు వీళ్లు మంచి జ్ఞాపకశక్తి కలిగి ఉంటారు. జ్ఞానం వల్ల చాలా మందికి వీరి ఖ్యాతి విస్తరిస్తుంది. ఏదైనా పరిస్థితులు, పర్యావరణానికి అనుగుణంగా, మొత్తంగా వారు బాధ్యయుతమైన, గొప్ప గుర్తింపు కలిగిన మంచి వ్యక్తులు.
Published by:Renuka Godugu
First published: