Dead person material: చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఈ వస్తువు మీ దగ్గర ఉంటే..!

ప్రతీకాత్మక చిత్రం

Dead person materials in home: మరణించిన వ్యక్తిని మీరు అమితంగా ప్రేమించడం వల్ల వారికి సంబంధించిన వస్తువులను ఇంట్లోనే పెట్టుకుంటారు. అందుకే వాటిని పారవేయడం కష్టంగా ఉండవచ్చు.

  • Share this:
మన భారతదేశం రకరకాల నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలకు పెట్టింది పేరు. వాటిని మనం పూర్వీకులు, వాస్తు నియమాలను అనుసరించి నడుచుకుంటాం. అయితే, కొన్ని సందేహాలు మాత్రమ ఏళ్ల నుంచి అలాగే ఉన్నాయి. వీటిని కొంతమంది నమ్ముతారు.. మరికొంతమంది కొట్టిపారేస్తారు. అయితే, ఎవరి బాట వారిదే అయినప్పటికీ కొన్ని సందేహాలు నిపుణుల ద్వారా నివృతి చేసుకుంటాం.

సాధారణంగా కొంతమంది సంప్రదాయాల ప్రకారం చనిపోయినవారి (Dead person) వస్తువులను వాడరు. మరికొంత మంది వారి ఏవైనా వస్తువులను జ్ఞాపకంగా (memory) పెట్టుకుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? అసలు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు వాడటం వల్ల ఏం జరుగుతుంది? దీనికి జోతిషులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి:  మిరియాల కల్తీని ఈ సింపుల్‌ చిట్కాతో గుర్తించండి!

  • చనిపోయిన వ్యక్తుల వస్తువులు పెట్టుకోవడం మంచిదా? కాదా? అని చాలా మందికి ఉన్న సందేహం.ఆ వస్తువులు పెట్టుకుంటే ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు.

  • చిన్న వయస్సులోనే మరణించినవారి జాతకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. 45 ఏళ్లు పైబడి.. సహజ మరణం పొందిన వ్యక్తి జాతకాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. ప్రమాదశాత్తు , కోరిక తీరకుండా.. అకాల మరణం చెందిన వ్యక్తికి సంబంధించిన జాతకాలను ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు. వీటిని ప్రవహించే నదిలో వీడిచేయాలి.


ఇది కూడా చదవండి: ఆర్కిటెక్చరల్‌ కిచెన్, బెడ్‌రూం ఇటువైపే ఉండాలి!

  • అదేవిధంగా చనిపోయినవారి బట్టలు ఇంట్లో ఉంచవచ్చా? అనే ప్రశ్న కూడా వస్తుంది. ఒకవేళ వాటికి రక్తపు మరకలు ఉంటే.. ఇంట్లో ఉంచకూడదు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి లోదుస్తులను ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. మరణించిన వ్యక్తిని మీరు అమితంగా ప్రేమించడం వల్ల వారికి సంబంధించిన వస్తువులను ఇంట్లోనే పెట్టుకుంటారు. అందుకే వాటిని పారవేయడం కష్టంగా ఉండవచ్చు. అయితే, ఆ వ్యక్తి ఆత్మ శాంతికి ఏం అవసరమో మనకు తెలియదు. దీనివల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉండవచ్చు.


బంగారు నగలు..
వీలైనంత వరకు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఏ వస్తువులు ఉపయోగించకపోవడం మంచిది.ఇక వారికి సంబంధించిన బంగారు ఆభరణాలు అయితే, బంగారం దుకాణాల్లో ఎక్సె ్చంజ్‌ చేసుకోవచ్చు. దీంతో మీకు కొత్త నగలను కొనుగోలు చేసుకోవచ్చు.

ఒకవేళ చనిపోయినవారు వృద్ధులై ఉంటే.. కొన్ని ఇళ్లలో వారి వారసత్వపు ఆభరణాలను భద్రంగా దాచుకోవడం ఆచారం ఉంటుంది. అటువంటి వారసత్వపు ఆస్తిని మనం ఉదారంగా ఆస్వాదించవచ్చు. ఏ సందేహం లేకుండా దాచ్చుకోవచ్చు.
Published by:Renuka Godugu
First published: