వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు. అంటే విఘ్నాలను తొలగించేవాడని అర్థం. సుఖ్‌కర్త అని కూడా అంటారు అంటే సుఖాలను అందించేవాడని అర్థం. అయితే, ఈ వినాయకుడు మీ కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఆయన ఏ రూపంలో వస్తాడు. ఆయనకు ఎన్నో రూపాలు ఉన్నాయి. ఏ రూపంలో కనిపిస్తే.. మనకు మంచి జరుగుతుంది.
సాధారణంగా చాలా మందికి గత రాత్రి వచ్చిన కలలు గుర్తుండవు . కొంత మంది ఈ కలలను పెద్దగా పట్టించుకోరు. మరికొందరు ఆ కలలు ఎందుకు వచ్చాయో ఆలోచనలో పడిపోతారు. కలలు మన గతం లేదా రాబోవు రోజులతో సంబంధం కలిగి ఉంటాయి. అయితే, ఏ రూపంలో అయిన మనకు గణపతి కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
శివపార్వతుల తనయుడు గణేషుడు కలలోకి వస్తే విజయం వరిస్తుందట. సుఖసంపదలకు చిహ్నంగా గణపతిని పరిగణిస్తారు. శుభాలను అందించే గణేషుడు కలలోకి వస్తే అతని ఆశీర్వాదలు మన వెన్నంటి ఉంటాయని అర్థమట.
ముఖ్యంగా మనకు విఘ్నాలు, ఆటంకాలు తొలగుతాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా వినాయకుడి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. మన దేశంలో ఏ వేడుకలు నిర్వహించినా ముందుగా గణపతి పూజ చేస్తాం. అయితే, ఎవరికైతే కలలో బొజ్జగణపతి కనిపిస్తే..వారి విజయానికి అడ్డులేదని అర్థం. గణేషుడు అంటే శుభానికి ప్రతిరూపం, మంచితనానికి మారుపేరు. అందుకే వినాయకుడు కలలో కనిపించిన వారికి జీవితంలో అన్నీ శుభాలే కలుగుతాయి. ఇక కలలో ఏకదంతుడు కనిపిస్తే.. కొత్త పనులు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు.
అలా మీరు ప్రారంభించేలా మీ మనసంతా సంతోషంతో నిండిపోతుంది. మీరు ఏదో పనిని తలపెట్టి.. ఇతర పనుల వల్ల దాన్ని మర్చిపోతే అప్పుడు మీకు మహాగణపతి కలలోకి వచ్చే అవకాశం ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంటే మీ బాధ్యతలను స్వామివారు గుర్తు చేస్తున్నారని అర్థం. అందుకే ఎవరికైనా మంచి విషయాల్లో మాటì స్తే.. వెంటనే దాన్ని తీర్చేయాలి. కలలు మనం చెప్పినట్టు రావు. అవి ఎలా వస్తే అలా వాటిని మనం స్వీకరించాలి. మన చుట్టు ఉండే పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా కలలు వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.