ఇంట్లో పెట్టుకునే వినాయకుడి విగ్రహనికి తొండం ఎటువైపు ఉండాలి?

విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ ఏర్పాటు చేయనున్నారు. నీలి, ఆరెంజ్, ఎరుపు, ఆకుపచ్చ రంగులు.. వాటికి కేటాయించిన రంగు ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు.

వినాయకుడి ప్రతిమను తీసుకునేటపుడు కేవలం ఇటువైపు తిరిగిన తొండం ఉన్న విగ్రహనిన మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా ఆచరించకపోతే అరిష్టాలు తప్పవు.

  • Share this:
వినాయకుడిని ఇంట్లో పెట్టుకునేటపుడు చాలా మందికి వచ్చే సందేహం అసలు తొండం ఎటువైపు ఉండాలి? కొంతమంది కుడివైపు ఉండే వినాయకుడిని తీసుకోవాలి అంటే.. మరికొందరు కాదు..కాదు ఎడమవైపు తొండం ఉండే విగ్రహన్ని తీసుకోవాలని సూచిస్తారు. అసలు ఎటువైపు తిరిగి ఉన్న తొండం ఇంటికి శుభాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం.

కుడివైపు తొండం తిరిగి ఉంటే.. లక్ష్మీగణపతి అంటారు. తొండం లోపల వైపునకు  ఉంటే తపోః గణపతి అంటారు. ఇక తొండం గనుక ముందువైపునకు ఉంటే దానికి పూజలు అస్సలు చేయకూడదు అంటారు.

ఒక దంతం విరిగిన గణపతిని రుద్రగణపతి అంటారు. ఈ విగ్రహనికి కూడా పూజలు చేయకూడదు. గణపతిని పూజించేటపుడు ఎలుక కచ్ఛితంగా ఉండాలి. గణపతి, ఎలుక వేరుగా ఉన్నది తీసుకోకూడదు. రెండూ ఒకే ప్రతిమలో ఉండాలి.

అలాగే తీసుకునే గణపతి ముఖంలో చిరునవ్వు ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు అలాంటి ఇంట్లో కూడా సుఖ, శాంతులు పెరుగుతాయి. ముఖ్యంగా గణపతికి చతుర్భుజాలు ఉండేలా చూసుకోవాలి.

ఒక చేతిలో లడ్డూ, మరో చేతిలో కమలం, ఇంకో చేతిలో శంఖం, నాలుగో చేతిలో ఏదైనా ఆయుధం ఉండాలి. అలాడే వినాయకుడికి తొండం ఎల్లప్పుడూ ఎడమవైపుగా ఉండేలా చూసుకోవాలి. కేవలం ఎడమవైపు తొండం ఉండే విగ్రహన్ని లేదా చిత్రపటాన్ని కొనుగోలు చేయాలి.

గణేషుడి తొండం ఎప్పుడూ తన తల్లి గౌరీదేవి దిక్కుగా ఉండాలని, అందుకే ఎడమవైపు తొండం ఉన్న వినాయకుడిని తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే కుడివైపు తొండం తిరిగి ఉన్న గణపతిని దక్షిణాముఖి గణపతి అంటారు. ఇలాంటి విగ్రహలను కేవలం గుడిలో మాత్రమే ఏర్పాటు చేస్తారు.

ఈ విధంగా ఉన్న గణపతికి ప్రతిరోజూ చాలా నిష్టగా పూజలు, ధూపదీప నైవేధ్యాలు అందిస్తారు. కాబట్టి ఇంట్లో పెట్టుకోకూడదు, గుడిలో మాత్రమే పెట్టుకోవచ్చు. గణపతి ముందు ముఖం సంపదను సూచిస్తే... వెనుక ముఖం పేదరికాన్ని సూచిస్తుంది. కాబట్టి వినాయకుని వెనుక ముఖం ఇంటి బయట ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఇంటి దక్షిణ దిశలో గణేష విగ్రహన్ని ఎట్టిపరిస్థితుల్లో పెట్టరాదు. తూర్పుదిశ లేదా పశ్చిమదిశలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా స్నానల గది గోడకు కూడా వినాయకుడి విగ్రహన్ని పెట్టకూడదు. అలా చేస్తే అరిష్టం.
Published by:Renuka Godugu
First published: