Festivals in February 2022:హిందూ క్యాలెండర్ (Hindu calender) చివరి నెల అయిన ఫాల్గునమాసం ఫిబ్రవరి (February) మధ్యలో ప్రారంభమవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం 12వ నెల మతపరమైన దృక్కోణంలో ముఖ్యమైనది. ఈ ఏడాది ఫిబ్రవరి అంటే మౌని అమావాస్య (Mouni amavasya) తో ప్రారంభమవుతుంది. రాబోయే నెలలో గణేష్ జయంతి, వసంత పంచమి, రథ సప్తమి, భీష్మ అష్టమి, గుప్త నవరాత్రి, కుంభ సంక్రాంతి, జయ ఏకాదశి, ప్రదోష వ్రతం, సంత్ రవిదాస్ జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి , విజయ ఏకాదశి వంటి ముఖ్యమైన పండుగలు కూడా జరుగుతాయి.
ఫిబ్రవరిలో నిర్వహించుకునే ముఖ్యమైన పండుగల పూర్తి జాబితా:
ఫిబ్రవరి 1 మంగళవారం- మౌనీ అమావాస్య లేదా మాఘ అమావాస్య
ఫిబ్రవరి 2 బుధవారం- గుప్త నవరాత్రి (ప్రారంభం)
ఫిబ్రవరి 4 శుక్రవారం- గణేష్ జయంతి
ఫిబ్రవరి 7 సోమవారం- రథసప్తమి
ఫిబ్రవరి 8 మంగళవారం- భిష్మాష్టమి
ఫిబ్రవరి 11 శుక్రవారం- గుప్త నవరాత్రి (ముగింపు)
ఫిబ్రవరి 12 శనివారం - జయ ఏకాదశి
ఫిబ్రవరి 13 ఆదివారం- కుంభ సంక్రాంతి, ప్రదోష వ్రతం
ఫిబ్రవరి 16 బుధవారం- మాఘ పౌర్ణిమ, సంత్ రవిదాస్ జయంతి
ఫిబ్రవరి 17 గురువారం- పాల్గునమాసం ప్రారంభం
ఫిబ్రవరి 19 శనివారం - ఛత్రపతి శివాజీ జయంతి
ఫిబ్రవరి 20 ఆదివారం -ద్విజప్రియ సంకష్ట చతుర్ధీ
ఫిబ్రవరి 27 ఆదివారం- విజయ ఏకాదశి
ఫిబ్రవరి 28 సోమవారం- ప్రదోష వ్రతం
ఫిబ్రవరి మొదటి రోజు మౌని అమావాస్య ముఖ్యమైనది. మౌని అమావాస్య రోజున గంగాస్నానం, దానం, ఉపవాసం ఉండే సంప్రదాయం ఉంది.
గణేష్ జయంతి 2022: ఈ సంవత్సరం గణేష్ జయంతి ఫిబ్రవరి 4 న వస్తుంది. హిందువుల విశ్వాసం ప్రకారం గణేష్ మాఘ మాస చతుర్థి రోజున శుక్ల పక్షంలో జన్మించాడు. ఈ రోజున వినాయకుడిని ఉపవాసంతో పూజిస్తారు.
వసంత పంచమి 2022: వసంత పంచమి పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున, జ్ఞానం, విద్య , కళల దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అందుకే వసంత పంచమిని సరస్వతీ పూజ అని కూడా అంటారు. ఈరోజు అక్షరాభ్యాసాలు చేయిస్తారు.
రథ సప్తమి 2022: ఈ రోజున సూర్య దేవుడు రథంపై కనిపించాడని చెబుతారు.
ఏకాదశి 2022: ఫిబ్రవరిలో రెండు ఏకాదశి ఉపవాసాలు ఉన్నాయి- జయ ఏకాదశి, విజయ ఏకాదశి. ఏకాదశి వ్రతం సమయంలో, విష్ణువును పూజిస్తారు.
ప్రదోష వ్రతం 2022: ఫిబ్రవరిలో రెండు ప్రదోష వ్రతాలు కూడా ఉన్నాయి- రవి ప్రదోష వ్రతం, సోమ ప్రదోష వ్రతం. ఈ రోజున శివుని పూజిస్తారు.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.