Home /News /astrology /

WEEKLY HOROSCOPE TODAY IN TELUGU CHECK ASTROLOGY FROM AUGUST 22 2021 TO AUGUST 28 2021 FOR ALL ZODIAC SIGNS AND RASI PHALALU HERE NK

Weekly Horoscope: వార ఫలాలు. బాధ్యతల భారం, ధనలాభం

Weekly Horoscope: వార ఫలాలు.

Weekly Horoscope: వార ఫలాలు.

Horoscope Weekly in telugu: ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఆగస్ట్ 22, 2021 నుంచి ఆగస్ట్ 28, 2021 వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  Horoscope Weekly: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, నక్షత్రాలు, ఘడియలు, ముహూర్తాలు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని జ్యోతిష పండితులు వారఫలాలను అందిస్తున్నారు. ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంది? ఆర్థిక అంశాలు ఎవరికి బాగా కలిసొస్తాయి? తెలుగు పంచాంగం ఎలాంటి సూచనలు చేస్తోంది? ఎవరికి ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? వంటివి తెలుసుకుందాం ఏవైనా సమస్యలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... ఎదుర్కొనేందుకు వీలవుతుంది. ఆగస్ట్ 22 నుంచి 28 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  మేష రాశి (Aries)
  ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. సహెూద్యోగుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. ఏదో ఒక ఆరోగ్య సమస్య పట్టి పీడిస్తుంటుంది. వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరి కొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. కొందరు మిత్రులను నమ్మి నష్టపోతారు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

  వృషభ రాశి (Taurus)
  ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతానికి ఉద్యోగం మారే అవకాశం లేదు. అందుకు సమయం కూడా అనుకూలంగా లేదు. తల పెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల పురోగతి గురించి సమాచారం అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. వ్యక్తిగత సమస్యలను లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. ఎవరికీ హామీలు, పూచీకత్తులు ఉండవద్దు. స్పెక్యులేషన్ అంత శ్రేయస్కరంగా లేదు.

  మిథున రాశి (Gemini)
  అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలోకాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధువుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

  కర్కాటక రాశి (Cancer)
  ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులకు కుటుంబ సభ్యులను కూడగట్టుకోండి.

  ఇది కూడా చదవండి: Raksha Bandhan 2021: రక్షాబంధన్ శుభ ముహూర్తం.. విశేషం

  సింహ రాశి (Leo)
  కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. డబ్బు ఇవ్వాల్సినవారు తిరిగి ఇస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

  కన్య రాశి (Virgo)
  ముఖ్యమైన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులతో కష్టాలు పడతారు. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలు విరమిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికైనా డబ్బు ఇచ్చినా తీసుకున్నా నష్టపోతారు.

  తుల రాశి (Libra)
  ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినీ నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుంది.

  వృశ్చిక రాశి (Scorpio)
  ఉద్యోగ జీవితం నల్లేరు మీది బండిలా సాగిపోతుంది. సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. వీలైనంతగా రుణ భారం తగ్గించుకుంటారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాస జీవితానికి అలవాటు పడతారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఉద్యోగ జీవితం మంచి మలుపు తిరుగుతుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. జీవితానికి పనికి వచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు కూడా ఆందోళన చెందడం మంచిది కాదు.

  మకర రాశి (Capricorn)
  మీరు ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. పాజిటివ్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా దాని వల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా శ్రమ ఎక్కువవుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధువులకు సంబంధించి ఒక దుర్వార్త వింటారు.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: సైన్స్ లేక సోషల్.. ఏ రాశికి ఏ సబ్జెక్ట్ నచ్చుతుంది?

  మీన రాశి (Pisces)
  ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. తల పెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు. దగ్గర బంధువొకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Weekly Horoscope, Zodiac sign, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు