Weekly Horoscope: వార ఫలాలు. ఆదాయ పురోగతి, శ్రమాధికం

Weekly Horoscope: వార ఫలాలు.

Horoscope Weekly in telugu: ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఆగస్ట్ 8 నుంచి 14, 2021 వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope Weekly: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, నక్షత్రాలు, ఘడియలు, ముహూర్తాలు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని జ్యోతిష పండితులు వార ఫలాలను అందిస్తున్నారు. ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంది? ఆర్థిక అంశాలు ఎవరికి బాగా కలిసొస్తాయి? తెలుగు పంచాంగం ఎలాంటి సూచనలు చేస్తోంది? ఎవరికి ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? వంటివి తెలుసుకుందాం ఏవైనా సమస్యలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... ఎదుర్కొనేందుకు వీలవుతుంది. ఆగస్ట్ 8 నుంచి 14 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  మేష రాశి (Aries)
  ఉద్యోగంలో కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. వ్యాపారులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

  వృషభ రాశి (Taurus)
  ఈ వారం చాలావరకు ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అక్రమ, అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులకు శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. ఐ.టి వారికి కాలం కలిసి వస్తుంది. వివాదాలలో తలదూర్చవద్దు. మితిమీరిన ఔదార్యం వల్ల డబ్బు నష్టపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.

  మిథున రాశి (Gemini)
  గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. తల పెట్టిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. సంపద వృద్ధి మీద మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు, వృత్తి నిపుణులు చక్కని పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు.

  ఇది కూడా చదవండి: Mangal Dosh: కుజదోషం అంటే ఏంటి? అది ఉంటే ఏమవుతుంది? ఎలా నివారించాలి?

  కర్కాటక రాశి (Cancer)
  ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువవుతాయి. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వీలైనంతగా సహాయపడతారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. వ్యాపారులకు ఆదాయాలు, లాభాలు నిలకడగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు బాగుంటుంది.

  సింహ రాశి (Leo)
  అన్ని విధాలా అనుకూలమయిన సమయం. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. దానధర్మాలు చేస్తారు. ఒక వ్యక్తిగత సమస్యను స్నేహితుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారుల ఆదాయానికి ధోకా లేదు. వృత్తి నిపుణులు, రాజకీయ, సామాజిక రంగాల వారు రాణించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగాలవారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

  కన్య రాశి (Virgo)
  గ్రహ సంచార ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార జీవితాలలో బాగా ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. వృత్తి నిపుణులు, ముఖ్యంగా డాక్టర్లకు, లాయర్లకు శ్రమ పెరుగుతుందే తప్ప ఆదాయం పెరగదు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారు బాగా రాణిస్తారు.పనులు పూర్తి చేస్తారు. సంతానంలో ఒకరికి వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. దాన ధర్మాల మీద డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. స్నేహితురాలితో ఆ నందంగా గడుస్తుంది.

  తుల రాశి (Libra)
  ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం, స్వయం ఉపాధి రంగాలవారికి సమయం బాగుంది. ఉద్యోగులు అడపాదడపా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి ఆ వకాశం ఉంది. కొందరిని నమ్మి డబ్బు నష్టపోతారు. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉన్నాయి.

  ఇది కూడా చదవండి: ఆదివారం అద్భుతం. 100 ఏళ్ల తర్వాత వస్తున్న ప్రత్యేక రోజు. రాజయోగం కోసం ఇలా చెయ్యండి

  వృశ్చిక రాశి (Scorpio)
  నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రశాంతంగా జరిగిపోతుంది. గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల మధ్య ఆర్థిక, అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. మీ మాటల్ని బంధువులు అపార్థం చేసుకుని, దూరం జరిగే ప్రమాదం ఉంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. వ్యాపారులు శ్రమ మీద లాభాలు ఆర్జిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

  ధనస్సు రాశి (Sagittarius)
  అదృష్ట యోగానికి లేదా ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. తిప్పలు కూడా ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి అనూహ్యంగా సహాయం అందుతుంది. వ్యాపారులు తమ తమ రంగాలలో కొత్త పుంతలు తొక్కుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది.

  మకర రాశి (Capricorn)
  ఆదాయం మెరుగుపడుతుంది. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఏలిన్నాటి శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం అవుతుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం అన్నివిధాలా బాగుంది. ఇల్లు కొనే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో విహారానికి వెళతారు. తిప్పలు ఎక్కువగా ఉన్నా, కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వివాహ సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా ప్రేమ వ్యవహా రాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు.

  మీన రాశి (Pisces)
  ఈ వారం పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం బాగా శ్రమపడతారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలోని సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఆర్థికంగా పరవాలేదు. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది.
  Published by:Krishna Kumar N
  First published: