Weekly Horoscope: వారఫలాలు... సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు... రాశి ఫలాలు

Weekly Horoscope: వారఫలాలు... సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు... రాశి ఫలాలు

Weekly Horoscope: 12 రాశుల వారికి ఈ వారం... సెప్టెంబర్‌ 27, 2020 నుంచి అక్టోబర్ 3, 2020 వరకు... వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • Share this:
    తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (సెప్టెంబర్‌ 27, 2020 నుంచి అక్టోబర్ 3, 2020) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుగు సాగవచ్చు.

    సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 3, 2020 వరకు వార ఫలాలు:

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
    పెళ్లి ప్రయత్నాలు జోరందుకుంటాయి. ఉద్యోగంలో మార్పు తప్పకపోవచ్చు. తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్‌ కాల్‌ వస్తుంది. ఆకస్మిక దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు. స్నేహితుల్లో ఒకరు మీకు బురిడీ కొట్టే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది.

    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యా పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరు స్నేహితులో, ఎవరో శత్రువులో తెలుసుకుని మెలగాలి. మీకు రహస్య శత్రువులు తయారవుతారు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువు ఇంటికి వచ్చి రెండు రోజులుండే సూచనలున్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.

    మిధునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఆరోగ్యం మెరుగుపడుతుంది. కులాసాగా బయట తిరుగుతారు. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. గత 23 నుంచి రాహు, కేతువు ప్రభావం మీ మీద తగ్గినందువల్ల, కొన్ని మానసిక ఆందోళనలు తగ్గే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణితో వివాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. భారీయెత్తున షాపింగ్‌ చేస్తారు. భార్యా పిల్లల్ని సంతోషపెడతారు.

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఈ వారమంత ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంది. ఇతర స్త్రీతో పరిచయం పెంచుకోవడం ఇంటికి, వంటికి మంచిది కాదు. సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం దెబ్బతిని ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. కోపతాపాలకు ఇది సమయం కాదు.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి, కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోవాలి. బయటపెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతాల్లో విందు వినోదాల్లో పాల్గొంటారు.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ఆస్తి కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, పూర్తిగా మంచానికి పరిమితమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వేదిక లెక్కి ఉపన్యాసాలు చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. సంసార బాధ్యతలు పెరుగుతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూస సమయం. స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్‌ చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇంటి నిర్వహణ మీద సతీమణితో విభేదిస్తారు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు కనిపిస్తారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. నష్టపోతారు. ఆరోగ్యం జాగ్రత్త.

    వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
    ఇంట్లో శుభ కార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అన్ని విధాలా అనుకూలమైన సమయం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. అవసరాలు తీరతాయి. స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో వివాహానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.

    ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఆదాయం నికడగా ఉంటుంది. ఏలిన నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. తరచూ శివార్చన చేయించండి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సతీమణితో కలిసి షాపింగ్‌ చేసి, కొత్త వస్తువులు కొంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఆదాయం నికడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఏలిన నాటి శని కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించాలి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. తీర్థయాత్రకు ప్లాన్‌ వేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తిప్పలు ఎక్కువగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. త్వరలో భార్యాపిల్లలతో కలిసి షాపింగ్‌ చేస్తారు. ఏలిన నాటి శని కారణంగా తిప్పలు ఎక్కువగా ఉన్నాయి. తలచిన పనులు పూర్తవుతాయి. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. రెండో ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. శివార్చన మంచిది.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
    ఆస్తులు కొనేందుకు ప్రయత్నిస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్త్రీతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు. ప్రమాదంలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: