Home /News /astrology /

WEEKLY HOROSCOPE ON 12TH DECEMBER TO 18TH DECMBER 2021 HERE IS TELUGU ASTROLOGY RASHIFAL FOR ALL 12 ZODIAC SIGNS VB

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. వీరికి ఆదాయంలో తిరుగుండదు.. ఆ విషయంలో శుభవార్తలు వింటారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాల్లో.. ఏ రాశి వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? మీనం నుంచి మేషం వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకుందాం.

  కాలజ్ఞానం  డిసెంబరు 12, 2021

  రాశి ఫలాలు

  మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతాయి. హామీలు ఉండవద్దు.

  వృషభం (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడటమే కాకుండా, ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్ధవంతంగా లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరి స్తారు. లాభాలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి నిపుణులకు ఎంతో అనుకూల సమ యం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అది తూచి అడుగు వేయడం. మంచిది.

  Weekly Horoscope: వార ఫలాలు.. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు.. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది..


  మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  చాలా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు... ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులను, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగి సూచనలు కనిపిస్తాయి. డబ్బు నష్టపోతారు జాగ్రత్త.

  కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఆరోగ్యానికి ఆదాయానికి సమస్య ఉండదు. ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు, చేర్పులు చో టు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకు బడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హెూదా పెరుగుతుంది. స్థాన చలనానికి ఆ ఉంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో మీకు అనుకూలత పెరుగుతుంది. ఇంజనీర్లకు, బి.టి నిపుణులకు, లాయర్లకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది.

  Zodiac Signs: ఈ మూడు రాశుల వారు తెలివిలో మిన్న.. ‘కట్టప్ప’లను సైతం పసి గట్టేస్తారు..


  సింహం ( Leo): (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా కారణంగా ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్ధికంగా పుంజుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలి గిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆదాయం ఆశించినంతగా పెరుగుతుంది. శుభకార్యాలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు తగ్గి చాలా లు నిలకడగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

  కన్య (kanya): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగానికి సంబంధించి దూర ప్రాంతం నుంచి ఆఫర్లు అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. స్పెక్యులేషన్ వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

  తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

  వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
  ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడతారు. ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సి వస్తుంది. స్నేహితులు, బంధువులు ఆదుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ఇక అక్రమ పరి చయాలకు దూరంగా ఉండండి. వ్యాపారులు శ్రమ మీద లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉ ంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం చూసుకోవాలి.

  ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ధోకా ఉండదు. లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తో బుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. వ్యాపారులకు ఆర్ధికంగా పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి. ఉండవచ్చు.

  Cumin-Weight Loss Tips: జీలకర్రను ఇలా ఉపయోగిస్తే.. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఇక ఉండదు..


  మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1, 2)
  గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఏలినాటి శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు..

  కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొ లిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత కోసం న ౦గానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. ఆర్ధిక లావాదేవీలకు, హామీలకు, స్పెక్యులేషన్కు వీలైనంత దూరంగా ఉండండి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంది.

  మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  ఆదాయ పరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యానికి ఢాకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి నిపుణులు విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Horoscope, Weekly Horoscope, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు