హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Weekly Horoscope: వీరికి ఈ వారం డబ్బే డబ్బే.. అన్నీ శుభాలే.. నవంబరు 21 నుంచి 27 వరకు రాశి ఫలాలు..

Weekly Horoscope: వీరికి ఈ వారం డబ్బే డబ్బే.. అన్నీ శుభాలే.. నవంబరు 21 నుంచి 27 వరకు రాశి ఫలాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horoscope: న‌వంబ‌ర్ 21 నుంచి న‌వంబ‌ర్ 26 వరకు రాశి ఫలాలు. ఈ వారం ఏయే రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? ఈ వారం రాశి ఫలాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

కాలజ్ఞానం

నవంబరు 21 నుంచి 27 వరకు

వార ఫలాలు

మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ వారం గురు గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశించిన కారణంగా కొన్ని కుటుంబ, వ్యక్తిగత క్లిష్ట సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఆరోగ్యం చాల వరకు కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడి తక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. మీ ద్వారా కొన్ని మంచి పనులు జరుగుతాయి. బంధువులు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి.

వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

గురువు కుంభరాశి ప్రవేశం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలకు, అదనపు బాధ్యతలకు అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్నఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా లేదు. తల పెట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల పురోగతి గురించి మంచి సమాచారం అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల వారు పురోగతి చెందుతారు. వ్యక్తిగత సమస్యలున్నా బంధుమిత్రులకు సహాయపడతారు. స్పెక్యులేషన్ లాభించదు.

మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గురువు కుంభరాశి ప్రవేశం మిథున రాశివారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాలు మేలు చేకూరుస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతా వరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి.

అల్మైరాలో ఈ వస్తువు పెడుతున్నారా? ఏమవుతుందో తెలుసా...

కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

గురు గ్రహం రాశి మార్పు వల్ల కర్కాటక రాశివారు పెద్దగా ప్రయోజనం పొందకపోవచ్చు. ఆర్థిక లావా దేవీలకు, స్పెక్యులేషన్ కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవు తాయి. అయితే, వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొద్దిగా ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయలు ఉత్తమం. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండం మంచింది.

సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గురుగ్రహం కుంభరాశి ప్రవేశం వల్ల సింహ రాశివారు ఇతోధికంగా లాభపడతారు. కొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. గృహ యోగం, వాహనయోగం వగైరాలకు అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు ఇవ్వాల్సినవారు తిరిగి ఇస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్దా ఉంటుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది.

కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

గురువు రాశి మార్పు వల్ల ఈ రాశివారికి పెద్దగా మేలు జరగకపోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఉండదు. తల పెట్టిన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులతో కష్టాలు పడతారు. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలు విరమిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

మంచంపై ఈ వస్తువు పెడితే.. దరిద్య్రం వెంటాడుతుంది!

తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురువు కుంభ రాశి ప్రవేశం వల్ల ఈ రాశివారు కొద్దిగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగపరంగా, కు టుంబపరంగా ఇంతవరకూ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారంలో అడు గుపెట్టే అవకాశం ఉంది.

వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

గురు గ్రహ రాశి మార్పు కొన్ని ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాస జీవితానికి అలవాటు పడతారు. ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడప డానికి ప్రాధాన్యం ఇస్తారు.

ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గురు గ్రహం కుంభ రాశి ప్రవేశం వల్ల ఉద్యోగ జీవితంలో మంచి పురోగతి కనిపిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. జీవితానికి పనికివచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధువులు, స్నేహితులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవాలి.

నెమలి ప్రతిమను ఇంట్లో పెట్టుకుంటున్నారా? వాస్తు దోషాలు..

మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

గురువు కుంభ రాశి ప్రవేశం వల్ల ఈ రాశివారు కొద్దిగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పాజిటివ్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తి డి ఉన్నా దాని వల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతం లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులకు అతి త్వరలో మంచి ఉద్యోగ 0 లభించే అవకాశం ఉంది.

కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

గురు గ్రహం రాశి మారడం వల్ల ఉద్యోగంలో జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా శ్రమ ఎక్కువవుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న ఓ వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరు ద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ పరవాలేదు. హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధువులకు సంబంధించి ఒక దుర్వార్త వింటారు.

మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

మీన రాశికి అధిపతి అయిన గురువు కుంభ రాశిలోకి, అంటే వ్యయంలోకి ప్రవేశించడం వల్ల దూర ప్రయాణాలకు, తీర్థ యాత్రలకు, వైద్య ఖర్చులు పెరగడానికి, ఆకస్మిక బదిలీలకు అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తల పెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆదాయప రంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

First published:

Tags: Astrology, Horoscope, Rashifal, Rasi phalalu, Weekly Horoscope, Zodiac signs

ఉత్తమ కథలు