• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • WEEKLY HOROSCOPE MAY 16 22 ASTROLOGY SPECULATE THESE ZODIAC SIGNS CAN COMPLETE WORKS SURELY CHECK YOUR RASI PHALALU HERE NK

Weekly Horoscope: వార ఫలాలు... ఈ రాశుల వారు పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు

Weekly Horoscope: వార ఫలాలు... ఈ రాశుల వారు పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు

Weekly Horoscope: వార ఫలాలు

Weekly Horoscope: ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఎవరికి బాగా కలిసొస్తుంది? ఆర్థిక, వివాహ, ప్రేమ, ఆస్తి వ్యవహారాలు ఎలా ఉంటాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope Weekly: దేశంలో ఆర్థిక పరిస్థితులు బాలేవు. చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా కరోనా సమస్య చాలా రాష్ట్రాల్ని కుదిపేస్తోంది. ఐతే... ఓ వారం నుంచి క్రమంగా ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. రికవరీ రేటు పెరుగుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వార ఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఆస్తి వ్యవహారాలు ఎవరికి కలిసొస్తాయి? ప్రేమ వ్యవహారాల్లో ఎవరు ముందుకు వెళ్లవచ్చు? వివాహ సంబంధాలు ఏ రాశుల వారికి సెట్ అవుతాయి? ఆర్థిక వ్యవహారాలు ఎవరికి లాభదాయకంగా ఉంటాయి? ఉద్యోగాల సంగతేంటి? వంటి వివరాల్ని మే 16 నుంచి 22 వరకు ఉన్న వార ఫలాల్లో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    చాలా కాలం నుంచి మీరు కృషి చేస్తున్న ఒక లక్ష్యం ఈ వారంలో సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంది. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతాయి. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు లాభాలపరంగా అభివృద్ధికి అవకాశం ఉంది.

    వృషభ రాశి (Taurus)
    అనుకోకుండా ఒక పెద్ద సంస్థ నుంచి ఉద్యోగానికి ఆఫర్‌ వచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ విభేదించకుండా పనులు పూర్తి చేసుకోండి. కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. మీకు విశ్రాంతి చాలా అవసరం. వృత్తి, వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. కాస్తంత తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

    మిథున రాశి (Gemini)
    ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఇంతకాలంగా పడుతున్న శ్రమ సత్ఫలితాలను ఇస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం దక్కకపోవచ్చు. మీ ఆధ్యాత్మిక చింతన వల్ల మీరు దేనికీ ఎక్కువగా బాధపడే అవకాశం లేదు. మీ తప్పు, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని, కొత్త నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం కొద్దిగా ధన యోగం పడుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

    కర్కాటక రాశి (Cancer)
    మీ ప్రేమ జీవితం ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తన, ఆలోచనా ధోరణిలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. గత కొన్ని వారాల కంటే ఈ వారం మీ వ్యాపారం చాలా వరకు మెరుగుపడుతుంది. మొత్తం మీద ఈ వారం మీకు అన్ని విధాలా అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది. ఐ.టి, వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి సమయం బాగుంది.

    సింహ రాశి (Leo)
    ఈ వారం ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఏ ఆటంకాలూ లేకుండా పనులు పూర్తి చేసుకుంటారు. గ్రహాలు చాలావరకు మీకు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలతో కొన్ని కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు. కొందరు మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం.

    కన్య రాశి (Virgo)
    చాలా కాలంగా వ్యాజ్యంలో చిక్కుకున్న ఆస్తి ఒకటి మీ సొంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి క్షణం తీరిక ఉండదు. ఉద్యోగం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా ఇబ్బందులు పడతారు. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఉండవద్దు. బాగా నష్టపోతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

    తుల రాశి (Libra)
    ఊహించని విధంగా ఒక మంచి సంస్థ నుంచి ఆఫర్‌ వచ్చే అవకాశం ఉంది. సరైన నిర్ణయాలు తీసుకుని కార్యాచరణకు దిగాల్సిన సమయం ఇది. స్వాతి నక్షత్రం వారు వ్యాపారంలోకి దిగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

    వృశ్చిక రాశి (Scorpio)
    మీలోని నైపుణ్యాన్ని, ప్రతిభను, నాయకత్వ లక్షణాలను అధికారులు గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరిగినా సత్ఫలితాలకు అవకాశం ఉంది. బాగా తిప్పుట ఉంటుంది. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఈ వారం మీకు స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో మీ తెలివితేటలను తక్కువ అంచనా వేసిన వారు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా లేదు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుభవార్త వింటారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.

    మకర రాశి (Capricorn)
    సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. గతంలో జరిపిన ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇప్పుడు ఏర్పడ్డ పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. నమ్మినవారు మోసం చేసే సూచనలు ఉన్నాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తి కలిగిస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ, సామాజిక రంగాలవారు అభివృద్ధి సాధిస్తారు.

    కుంభ రాశి (Aquarius)
    ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు.

    ఇది కూడా చదవండి: Bhakti: ఈ ఆకుల్ని ఇలా పెట్టుకుంటే డబ్బే డబ్బు... పండితులు ఏమంటున్నారంటే...

    మీన రాశి (Pisces)
    వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ, ఒత్తిడి పెరిగినా సత్ఫలితాలను ఇస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు