Weekly Horoscope: వారఫలాలు.. ఆర్థిక ఫలాలు, పని ఒత్తిళ్లు

Weekly Horoscope: వారఫలాలు

Horoscope Weekly in telugu: ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఆగస్ట్ 15 నుంచి 21, 2021 వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope Weekly: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, నక్షత్రాలు, ఘడియలు, ముహూర్తాలు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని జ్యోతిష పండితులు వార ఫలాలను అందిస్తున్నారు. ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంది? ఆర్థిక అంశాలు ఎవరికి బాగా కలిసొస్తాయి? తెలుగు పంచాంగం ఎలాంటి సూచనలు చేస్తోంది? ఎవరికి ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? వంటివి తెలుసుకుందాం ఏవైనా సమస్యలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... ఎదుర్కొనేందుకు వీలవుతుంది. ఆగస్ట్ 15 నుంచి 21 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్నివసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులు పురోగతి చెందుతారు. ఇంజనీరింగ్, పరిశోధక విద్యార్థులకు బాగుంది.

    వృషభ రాశి (Taurus)
    రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. వస్తువులు గానీ, డబ్బు గానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

    మిథున రాశి (Gemini)
    గ్రహ సంచారం చాలావరకు మిశ్రమంగా కొనసాగుతోంది. సహనంతో వ్యవహరించండి. సన్నిహితులతో సంప్రదించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. వ్యాపారులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

    ఇది కూడా చదవండి: Aura: ఆరా అంటే ఏంటి? మన చుట్టూ కాంతి ఉంటుందా?

    కర్కాటక రాశి (Cancer)
    ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసర ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోండి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అన్నివిధాలా అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.

    సింహ రాశి (Leo)
    గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఏ పనైనా శ్రమ మీద గానీ పూర్తి కాకపోవచ్చు. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. వృత్తి నిపుణులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త.

    కన్య రాశి (Virgo)
    ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారులకు ఆర్థికంగా కొద్దిగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, సాహిత్య రంగాలకు చెందినవారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.

    తుల రాశి (Libra)
    గ్రహ సంచారంలో కొద్దిగా ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావాల్సిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహార యాత్రలు చేస్తారు.

    వృశ్చిక రాశి (Scorpio)
    గ్రహ సంచారం సామాన్యంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో శత్రుబాధ ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, తిప్పుట తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. చిన్న, మధ్య వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

    ఇది కూడా చదవండి: Video: షాకింగ్.. పోలీస్‌ని ఢీకొట్టి పారిపోయిన కారు డ్రైవర్


    మకర రాశి (Capricorn)
    అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్టు అవుతుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చి పెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు బాగా పెరిగిపోతాయి. ఏలిన నాటి శని కారణంగా మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తెచ్చి పెడతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

    కుంభ రాశి (Aquarius)
    ఈ వారం మీకు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. మితిమీరిన ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ఇంటా బయటా మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి సమస్యలు తలెత్తుతాయి.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: రాశులపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం.. ఎవరిపై ఎలా ఉంటుందంటే?

    మీన రాశి (Pisces)
    చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ధోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొని పెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: