• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • WEEKLY HOROSCOPE IN TELUGU FROM APRIL 4 2021 TO APRIL 10 2021 THESE ZODIAC SIGNS FOCUS ON NEW INCOME SOURCES THIS WEEK NK

Horoscope Weekly: వార ఫలాలు.. ఈ రాశుల వారికి కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి

Horoscope Weekly: వార ఫలాలు.. ఈ రాశుల వారికి కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి

Horoscope Weekly: వార ఫలాలు

Horoscope Weekly: రాశిఫలాలు ఈ వారం ఎలా ఉన్నాయి. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 10, 2021 వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope Weekly Telugu: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. వారం, తిథి, నక్షత్రం, పంచాగం, గ్రహాలు, నక్షత్రాలు, ఘడియలు, ముహూర్తాలు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని పండితులు ఈ వార ఫలాలను అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక అంశాల్లో ఎలాంటి శుభాలు జరుగుతాయి? పంచాంగం ఎలాంటి అంశాలను సూచిస్తోంది? ఎవరికి ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? ఈ వారం రాశిఫలాలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఏవైనా సమస్యలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలవుతుంది. ఈ వారం ఏప్రిల్ 4 నుంచి 10 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం బాగానే పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఐ.టి, సాంకేతిక విభాగ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల వారికి, వృత్తి నిపుణులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.

    వృషభ రాశి (Taurus)
    ఈ వారంలో ఎక్కువ రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కొద్దిగా తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు వెతుకుతారు. చాలావరకు అప్పులు తీరుస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితురాలితో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు.

    మిథున రాశి (Gemini)
    అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడటం, తిప్పుట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు
    వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేస్తారు. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.

    కర్కాటక రాశి (Cancer)
    మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ వారం ఫలవంతమయ్యే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు... ఉపాధ్యాయుల, అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు కలిగిస్తాయి.

    సింహ రాశి (Leo)
    ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి అనుకూల సమయం.
    భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.

    కన్య రాశి (Virgo)
    ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కూడా కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూల సమయం.

    తుల రాశి (Libra)
    ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కామర్స్‌ విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు పడతారు. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు.

    వృశ్చిక రాశి (Scorpio)
    అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు.

    ధనస్సు రాశి (Sagittarius)
    సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది.

    మకర రాశి (Capricorn)
    ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఆదాయం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులకు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు.

    కుంభ రాశి (Aquarius)
    ఈ వారమంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడటమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి నిపుణులకు, లాయర్లకు, డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారికి ఒకరంటే ఒకరికి పడదు... దూరంగా ఉండటమే మేలు

    మీన రాశి (Pisces)
    చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి.
    Published by:Krishna Kumar N
    First published: